E-Paper
Advertisement

Maryada Manish : టాప్ 5 కంటెస్టెంట్ల లిస్ట్ చెప్పిన మనీష్ మర్యాద..ఎవరెవరున్నారంటే?

Maryada Manish : టాప్ 5 కంటెస్టెంట్ల లిస్ట్ చెప్పిన మనీష్ మర్యాద..ఎవరెవరున్నారంటే?
Advertisement

Maryada Manish: మర్యాద మనీష్ పరిచయం అవసరం లేని పేరు బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 (Bigg Boss 9Telugu)కార్యక్రమంలో భాగంగా ఈయన కామన్ మ్యాన్ క్యాటగిరిలో భాగంగా కంటెస్టెంట్ గా ఎంపిక అయ్యారు. ఇక ఈయన కామన్ మ్యాన్ క్యాటగిరిలో భాగంగా హౌస్ లోకి అడుగుపెట్టినప్పటికీ కేవలం రెండు వారాల వ్యవధిలోనే హౌస్ నుంచి బయటకు వచ్చారు. ఇలా బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన మనీష్ పలు సందర్భాలలో ఈ కార్యక్రమం గురించి మాట్లాడుతూ తన అభిప్రాయాలను తెలియజేశారు అయితే బిగ్ బాస్ కార్యక్రమం 11వ వారం కూడా పూర్తి అయిన నేపథ్యంలో ఈయన టాప్ 5 కంటెస్టెంట్లకు సంబంధించి ఆసక్తికరమైన పోస్ట్ చేశారు.

ఎంటర్టైన్ చేస్తున్న ఇమ్మూ…

ఇక మనీష్ ఈ పోస్ట్ చేస్తూ ఇది కేవలం తన అభిప్రాయం ప్రకారమే టాప్ ఫైవ్ కంటెస్టెంట్లను తెలియజేస్తున్నానని తెలిపారు. మరి  మనీష్ మర్యాద అంచనా ప్రకారం టాప్ 5 కంటెస్టెంట్లుగా ఎవరు ఉండబోతున్నారు అనే విషయానికి వస్తే..టాప్ 2 కంటెస్టెంట్ గా డెమోన్ లేదా ఇమ్మానియేల్ ఉండవచ్చని అంచనా వేశారు. వీరిద్దరూ ఒకరి కోసం స్టాండ్ తీసుకోకుండా, చాలా నేచురల్ గా టాస్కులు ఆడటం, ప్రేక్షకులకు మంచి ఎంటర్టైన్మెంట్ అందిస్తున్నారని మొదటి రోజు నుంచి కూడా వీరు ఇలాగే ఉన్నారని తెలిపారు.

తనూజ ఆట తీరు మార్చుకోవాల్సిందే?

Advertisement

టాప్ 3 కంటెంట్ గా దివ్య ఉండబోతున్నారని మనీష్ తెలిపారు. దివ్య వైపు నుంచి కూడా కొన్ని తప్పులు ఉన్నాయి కానీ భయం లేకుండా గేమ్ ఆడుతుంది అలాగే టాప్ లో వేరే వాళ్ళు ఉన్నారని అర్థమైనా సేఫ్ గేమ్ ఆడకుండా చాలా నిజాయితీగా గేమ్ ఆడుతుందని దివ్య గురించి మనీష్ చాలా గ్రేట్ గా మాట్లాడారు. ఇక టాప్ 4 కంటెస్టెంట్ గా తనూజ ఉన్నారని తెలిపారు. తనూజ బెస్ట్ స్మార్ట్ గేమర్ అని పేర్కొన్నారు. తనూజ కొంచెం తన ఆట తీరును మార్చుకుంటే ఆమె నా దృష్టిలో కచ్చితంగా టాప్ 2 లో ఉంటుందని పేర్కొన్నారు.

సంజనా, రీతు టాప్ 5 కంటెస్టెంట్లు..

Advertisement

టాప్ ఫైవ్ కంటెస్టెంట్లుగా సంజన, రీతు చౌదరి ఉన్నట్లు తెలిపారు. మొదటి రోజు నుంచి ఇప్పటివరకు 200% ఎఫర్ట్ పెట్టీ గేమ్ ఆడుతున్నారు టాస్కులలో కూడా అదే ఆట తీరును కనబరుస్తున్నారు. ఇతరుల కోసం స్టాండ్ తీసుకుంటున్నారు అంటూ మనీష్ ఇలా టాప్ ఫోర్ కంటెంట్ల గురించి తెలిపారు. మరి విజేతగా వీరిలో టాప్ వన్ లో ఎవరు ఉంటారో తెలియాల్సి ఉంది. అయితే ఈ విధంగా టాప్ ఫైవ్ కంటెంట్ల గురించి మనీష్ హౌస్ లో వాళ్లు ఆడుతున్న ఆట తీరు , టాస్కుల విషయంలో వారి వ్యవహార శైలిని ఆధారంగా చేసుకుని చెప్పినట్టు తెలిపారు. హౌస్ లో భయం లేకుండా గేమ్ ఆడటం ఎంత కష్టమో స్వయంగా నేను చూశాను. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని తన అభిప్రాయం ప్రకారం టాప్ 5 కంటెస్టెంట్ల గురించి తెలిపానని మనీష్ స్వయంగా వెల్లడించారు. మరి మనీష్ చెప్పిన కంటెస్టెంట్ లు టాప్ ఫైవ్ లో ఉంటారా? లేదా? అనేది తెలియాలి అంటే మరికొన్ని వారాలు ఎదురు చూడాలి.

Also Read: Actor Madhvan: వారణాసిలో హనుమంతుడిగా స్టార్ హీరో ఫిక్స్…ఇక మామూలుగా ఉండదుగా!

Related News

బిగ్ బాస్10 హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న కంటెస్టెంట్ తనేనా?

బిగ్ బాస్ హౌస్ లోకి గుండెనిండా గుడి గంటలు హీరో.. ఈ ట్విస్ట్ ఏందీ బాలు..వీడియో వైరల్!

బిగ్ బాస్ 10 లాంచింగ్ ఎపిసోడ్… చీఫ్ గెస్ట్ గా స్టార్ హీరో!

న్యూ చాప్టర్ బిగిన్స్.. బిగ్ బాస్ 10 ఎంట్రీ పై జబర్దస్త్ కమెడియన్ క్లారిటీ!

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ లిస్ట్ లీక్..హౌస్ లోకి వెళ్లేది వీళ్ళే!

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

Big Stories

Advertisement
×