E-Paper
Advertisement

సెంటిమెంట్ ను బ్రేక్ చేసిన అనిల్.. వర్క్ అవుట్ అవుతుందా?

సెంటిమెంట్ ను బ్రేక్ చేసిన అనిల్.. వర్క్ అవుట్ అవుతుందా?
Advertisement

Anil Ravipudi: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో హిట్ మెషిన్ గా గుర్తింపు తెచ్చుకున్న అనిల్ రావిపూడి ఇండస్ట్రీలో వరుస హిట్స్ తో దూసుకుపోతున్నారు. కళ్యాణ్ రామ్ (Kalyan Ram) హీరోగా వచ్చిన ‘పటాస్’ సినిమాతో తన కెరీర్ మొదలుపెట్టిన ఈయన ఆ తర్వాత చేసిన ప్రతి సినిమా కూడా భారీ విజయాన్ని అందించింది. గత ఏడాది వెంకటేష్ తో సంక్రాంతికి వస్తున్నాం సినిమా చేసి మరో ఇండస్ట్రీ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నారు. ఈ ఏడాది మన శంకర వరప్రసాద్ గారు అంటూ చిరంజీవితో సినిమా చేసి ఊహించని విజయాన్ని సొంతం చేసుకున్నారు. అలా వరుస చిత్రాలతో వరుస విజయాలను దక్కించుకుంటూ ఇండస్ట్రీలో హిట్ మెషిన్ గా పేరు సొంతం చేసుకున్న అనిల్ రావిపూడి ఇప్పుడు కళ్యాణ్ రామ్, వెంకటేష్ తో కలిసి ఒక సినిమా చేస్తున్నారు. ఈ సినిమా వచ్చే సంక్రాంతికి విడుదల అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

సెంటిమెంట్ బ్రేక్ చేసిన అనిల్ రావిపూడి..

ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న నేపథ్యంలో ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. మరోపక్క ఆ సెంటిమెంటును బ్రేక్ చేశాడా అనే కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి. అసలు విషయంలోకి వెళ్తే.. వెంకీ – కళ్యాణ్ రామ్ కాంబినేషన్లో వస్తున్న సినిమా కోసం తమిళ మ్యూజిక్ డైరెక్టర్ ను రంగంలోకి దింపినట్లు సమాచారం.. అంతకుముందు అనిల్ సినిమాలకు భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందించేవారు. అంతేకాదు భీమ్స్ మ్యూజిక్ అనిల్ రావిపూడి సినిమాలకు చాలా వరకు ప్లస్ అయ్యింది. అలాంటి ఆయనను కాదని తమిళ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్ ను అనిల్ రావిపూడి ఫైనల్ చేసినట్లు సోషల్ మీడియాలో వార్త వినిపిస్తోంది. త్వరలోనే దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా రాబోతున్నట్లు సమాచారం.

కొత్తదనం కోరుకుంటున్న అనిల్ రావిపూడి..

Advertisement

ఇకపోతే భీమ్స్ సిసిరోలియోని కాదని అనిల్ రావిపూడి జీవి ప్రకాష్ కుమార్ ను ఫైనల్ చేయడంతో ఇప్పుడు సోషల్ మీడియాలో సరికొత్త అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భీమ్స్ సిసిరోలియో తో అనిల్ రావిపూడి కి ఏదైనా విభేదాలు ఉన్నాయా? లేక హిట్ సెంటిమెంట్ ని ఇప్పుడు బ్రేక్ చేశారు అనిల్ రావిపూడి . ఈ సినిమా సక్సెస్ అవుతుందా? అనే కామెంట్లు వ్యక్తం అవుతున్న వేళ సడన్గా మరో విషయం సంచలనంగా మారింది . అనిల్ గత చిత్రాలకు భీమ్స్ సిసిరోలియో హిట్ మ్యూజిక్ అందించినప్పటికీ ఈసారి కొత్తదనం ఆయన కోరుకుంటున్నట్లు సమాచారం. అందుకే మ్యూజిక్ కోసం తొలిసారి తమిళ మ్యూజిక్ డైరెక్టర్ తో జతకట్టబోతున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

also read:రూట్ మార్చిన ప్రశాంత్ నీళ్.. హారర్ తో వణికించడానికి వస్తున్న ‘418’!

సినిమా సక్సెస్ అవుతుందా?

Advertisement

ఇక అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ , కళ్యాణ్ రామ్ హీరోలుగా రాబోతున్న ఈ సినిమాలో కృతి శెట్టి, కీర్తి సురేష్ లను ఫైనల్ చేశారు. ఇక ఇందులో కళ్యాణ్ రామ్ సరసన కృతి శెట్టి , వెంకటేష్ సరసన కీర్తి సురేష్ నటించనున్నట్లు సమాచారం. మొత్తానికైతే కొత్త కాంబినేషన్ ఫ్రెష్ మ్యూజిక్ ఈ సినిమాకు ఏ విధంగా ప్లస్ అవుతాయో చూడాలి.

Related News

‘గరివిడి లక్ష్మి’లో ఆర్పీ పట్నాయక్ పాత్ర వెనుక అసలు కథ ఇదేనా?

క్యాస్టింగ్ కౌచ్‌పై ఝాన్సీ ఏమన్నారంటే.. ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి ఇదేనా?

యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న ‘హైకూ’.. అక్టోబర్ 23న థియేటర్లలోకి!

మాల్దీవుల్లో ఖుషీ కపూర్ అందాల సందడి.. ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్!

రామాయణంపై రాజమౌళి పోస్ట్.. ఏమన్నారంటే!

విజయ్ దేవరకొండ, రష్మికతో మధ్యప్రదేశ్ సీఎం.. అసలు విషయం ఇదే!

మహిళా కథ అనగానే నో చెప్పారు.. చివరికి అదే సినిమాతో సక్సెస్!

సలార్‌లో ఛాన్స్ కోసం ఝాన్సీ ఏం చేశారో తెలుసా?

Big Stories

Advertisement
×