E-Paper
Advertisement

Anil Ravipudi: ఆ బ్యానర్‌లో అనిల్ రావిపూడి యానిమేషన్ ఫిల్మ్.. వాస్తవమిదే!

Anil Ravipudi: ఆ బ్యానర్‌లో అనిల్ రావిపూడి యానిమేషన్ ఫిల్మ్.. వాస్తవమిదే!
Advertisement

Anil Ravipudi: అనిల్ రావిపూడి.. ఈ పేరు చానా ఏళ్లు గుర్తుంటాది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో సక్సెస్‌కి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన హిట్ మెషిన్ అనిల్ రావిపూడి (Anil Ravipudi), చేసే ప్రతి సినిమాకు అంచెలంచెలుగా ఎదుగుతూనే ఉన్నారు. లాస్ట్ సంక్రాంతికి ‘సంక్రాంతికి వస్తున్నాం’తో కెరీర్‌లో బెస్ట్ ఫిల్మ్ కొడితే.. మళ్లీ ఈ సంక్రాంతికి తన రికార్డును తానే బద్దలు కొట్టారు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా, లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్‌గా అనిల్ రావిపూడి తెరకెక్కించిన ‘మన శంకర వర ప్రసాద్ గారు’ చిత్రం ఈ సంక్రాంతికి ఎలాంటి సక్సెస్ అందుకుందో అందరికీ తెలిసిందే. దాదాపు రూ. 400 కోట్ల కలెక్షన్స్ రాబట్టి.. తెలుగు సినిమా సత్తా ఏంటో మరోసారి చాటి చెప్పింది. ఇక ఈ సినిమా తర్వాత అనిల్ రావిపూడి నెక్ట్స్ చేయబోయే సినిమాలపై రకరకాలుగా వార్తలు వైరల్ అవుతున్నాయి.

Also Read- Manchu Manoj: ఈ కసిని అలాగే కొనసాగిస్తా.. మనోజ్‌లో ఈ మార్పు చూశారా!

ఆ రూమర్స్‌కు బ్రేక్

Advertisement

అనిల్ రావిపూడి తదుపరి సినిమా విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ కాంబినేషన్‌లో ఉంటుందని అధికారిక ప్రకటన వచ్చింది. ఈ ప్రకటన రాకముందు.. తదుపరి చిత్రం ఈ హీరోతోనే అంటూ ఎలా రూమర్స్ వైరల్ అయ్యాయో అంతా చూస్తూనే ఉన్నారు. ఆ రూమర్స్‌కు బ్రేక్ వేస్తూ.. అనిల్ తన తదుపరి చిత్రం వెంకీ, కళ్యాణ్ రామ్‌లతో అని క్లారిటీ ఇచ్చేశారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను కూడా మొదలు పెట్టారు. ఈ నేపథ్యంలో అనిల్ రావిపూడి ఓ యానిమేషన్ ఫిల్మ్ కూడా చేస్తున్నట్లుగా వార్తలు వైరల్ అవుతున్నాయి. కన్నడ పరిశ్రమకు చెందిన కెవిఎన్ ప్రొడక్షన్స్ (KVN Productions).. ఇప్పుడు పాన్ ఇండియా భాషలలో సినిమాలు చేసేందుకు సిద్ధమైంది. ఈ సంస్థ ఎక్కువగా టాలీవుడ్‌పై ఫోకస్ పెట్టినట్లుగా ఆల్రెడీ వార్తలు వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఈ సంస్థ మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) తదుపరి సినిమాను నిర్మించబోతుంది.

Also Read- Peddi Song: ‘రై రై రా రా’.. చరణ్ హుక్ స్టెప్‌ను దించేసిన స్కూల్ పాప.. వీడియో వైరల్!

అనిల్ రావిపూడి మార్క్‌తోనే

Advertisement

ఇప్పుడు అనిల్ రావిపూడితో ఓ యానిమేషన్ ఫిల్మ్ (Animation Film) నిర్మించబోతుందంటూ వస్తున్న రూమర్స్‌‌కు మరోసారి అనిల్ టీమ్ తెరదించారు. కెవిఎన్ ప్రొడక్షన్స్‌లో సినిమా ఉన్న మాట నిజమే కానీ, అది యానిమేషన్ ఫిల్మ్ కాదని, దయచేసి అలాంటి అసత్యపు వార్తలు ఎవరూ నమ్మవద్దని అనిల్ టీమ్ కోరింది. అంతేకాదు, అనిల్ రావిపూడి మార్క్‌తోనే ఈ బ్యానర్‌లో సినిమా ఉంటుందనేలా కూడా వివరణ ఇచ్చారు. కెవిఎన్ ప్రొడక్షన్స్ సంస్థ టాలీవుడ్‌లో డజనుకు పైగా హీరోలకు, అరడజనుకు పైగా దర్శకులకు అడ్వాన్స్‌ను పే చేసి, కుదిరినప్పుడు సినిమా చేయాలనేలా ఒప్పందం కుదుర్చుకుందట. అందులో ఒక దర్శకుడు అనిల్ రావిపూడి. అది విషయం. దీనిపై.. అనిల్ రావిపూడి యానిమేషన్ ఫిల్మ్ చేస్తున్నాడని రూమర్ పుట్టించినవాడెవడు? అంటూ నెటిజన్లు కూడా ఈ విషయాన్ని నమ్మనట్లుగా రియాక్ట్ అవుతుండటం విశేషం.

Also Read- Dacoit Release Date: అడివి శేష్ డెకాయిట్ రిలీజ్ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ప్రకటించిన నిర్మాతలు..

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×