Manchu Manoj: మంచు మనోజ్ అంటే కేవలం హీరో మాత్రమే కాదు, తెరపై ప్రాణాలకు తెగించి స్టంట్స్ చేసే ఒక రియల్ ఫైటర్ కూడా. ఆ విషయం తెలుగు సినిమా ఇండస్ట్రీలోని ఎంతో మందికి తెలుసు. కొన్నాళ్ల పాటు సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నా, లైఫ్‌లో స్ట్రగుల్స్ చేసినా.. ఫ్యాన్స్ మనసులో మాత్రం ఆయనెప్పుడూ ట్రెండింగ్‌లోనే ఉన్నారు. మళ్లీ హీరోగా పవర్ ఫుల్ సినిమాలతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైన మనోజ్ (Manchu Manoj).. రీ ఎంట్రీలో మంచి పాత్రలు చేస్తూ.. మాంచి కిక్కుస్తున్నారు. తాజాగా మనోజ్ ఇన్‌స్టా వేదికగా షేర్ చేసిన ఒక పోస్ట్ చూస్తుంటే ఈ రాక్ స్టార్ (Rock Star) మళ్ళీ పాత రోజుల్లోకి వెళ్ళిపోయాడని అర్థమవుతోంది. మూడు వారాల కిందట ఒక దృఢ నిశ్చయంతో మొదలైన ఈ ప్రయాణం కేవలం బాడీ బిల్డింగ్ కోసం మాత్రమే కాదని, తనలోని పట్టుదలను ప్రపంచానికి చూపించడానికని ఆయన ఇందులో చెప్పుకొచ్చారు. ‘సోమవారం చూద్దాం.. రేపు చేద్దాం’ అనే సాకులకు ఫుల్ స్టాప్ పెట్టి, కంఫర్ట్ జోన్ నుండి బయటకు వచ్చి మనోజ్ చేస్తున్న ఈ యుద్ధం నిజంగా స్ఫూర్తిదాయకమనే చెప్పాలి.
Also Read- Peddi Song: ‘రై రై రా రా’.. చరణ్ హుక్ స్టెప్‌ను దించేసిన స్కూల్ పాప.. వీడియో వైరల్!
యాక్షన్ సినిమాల్లో రాణించాలంటే కేవలం నటన ఉంటే సరిపోదు, ఆ క్యారెక్టర్‌కు కావలసిన ఫిజిక్, ఎనర్జీ కూడా ఉండాలని మనోజ్ గట్టిగా నమ్ముతున్నారు కాబట్టే.. ‘డేవిడ్ రెడ్డి’ కోసం ఆయన ఇంతలా కష్టపడుతూ కండలు పెంచుతున్నారు. అందుకే ఈసారి ‘కేవలం అందంగా కనిపించడం’ కోసం కాకుండా, ‘అన్ బ్రేకబుల్’గా తయారవ్వడమే తన లక్ష్యమని ప్రకటించారు. తెరపై చూసే ప్రతి పంచ్, ప్రతి కిక్ వెనుక ఎంతో కష్టం ఉంటుందని, కెమెరా మన ఉద్దేశాలను కాదు.. మనం పడిన కష్టాన్ని మాత్రమే చూపిస్తుందని ఆయన చెప్పిన మాటలు సినిమా పట్ల ఆయనకున్న అంకితభావాన్ని తెలియజేస్తున్నాయి. మనోజ్ దృష్టిలో ఒంటిపై ఉన్న ప్రతి మార్క్ ఒక సంతకం లాంటిది. శరీరాన్నే ఇలా మార్చుకునేందుకు ఎలాంటి షార్ట్‌కట్స్ వెతకకూడదని, అలా చేస్తే అది మనల్ని మనం మోసం చేసుకోవడమేనని ఆయన అభిప్రాయపడ్డారు.
Also Read- Star Heroine: 52 ఏళ్ల వయసులో మళ్లీ ప్రేమలో పడిన స్టార్ హీరోయిన్..ఎవరంటే..!
ముహమ్మద్ అలీ చెప్పిన ఒక మాటను కోట్ చేస్తూ.. మనోజ్ తన గమ్యం వైపు అడుగులు వేస్తున్నాడు. విజయం అనేది అందరూ చూస్తున్న వేదిక మీద దక్కేది కాదని, సాక్ష్యం లేని చోట, జిమ్‌లో ఏకాంతంగా పడే చెమట చుక్కల నుంచి పుడుతుందని ఆయన నిరూపిస్తున్నాడు. 21 రోజుల క్రితం ఉన్న మనిషి కంటే.. ఇప్పుడు తనలో వచ్చిన మార్పు మనోజ్‌కు గొప్ప సంతృప్తిని ఇస్తోందట. ఇంకా సుదీర్ఘ ప్రయాణం బాకీ ఉందని చెబుతూనే, తనలో రగిలిన ఈ కసిని అలాగే కొనసాగిస్తానని హింట్ ఇస్తున్నారు. మంచు మనోజ్ ఇలా చూస్తుంటే.. ఆయన ప్రస్తుతం చేస్తున్న ‘డేవిడ్ రెడ్డి’ (David Reddy) సినిమా మాములుగా ఉండదని అర్థమవుతోంది. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే వచ్చిన ప్రమోషనల్ కంటెంట్.. సినిమాపై ఆకాశమే అవధి అన్నట్లుగా అంచనాలను పెంచేసిన విషయం తెలిసిందే.
Also Read- Sports comedy drama OTT: ఓటీటీలోకి ఆమిర్ ఖాన్ స్పోర్ట్స్ కామెడీ డ్రామా… ఎక్కడ చూడచ్చో తెలుసా ?