E-Paper
Advertisement

Anthology Movie OTT : గుజరాతీ సూపర్ హిట్ మూవీ ఓటీటీలోకి… ముచ్చటగా మూడు కథలతో

Anthology Movie OTT : గుజరాతీ సూపర్ హిట్ మూవీ ఓటీటీలోకి… ముచ్చటగా మూడు కథలతో
Advertisement

Anthology movie OTT : గుజరాతి ఇండస్ట్రీ నుంచి గత ఏడాది సూపర్ హిట్ అయిన ‘నాన్‌ఖటై’ మూవీ, ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ కి వస్తోంది. ఇది ఆంథాలజీ ఫార్మాట్లో రూపొందింది. మూడు ఇంట్రెస్టింగ్ కథలతో వచ్చిన ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంది. ఇప్పుడు ఆరు నెలల తర్వాత డిజిటల్ ఆడియన్స్ ని పలకరించబోతోంది. ‘నాన్‌ఖటై’ అంటే గుజరాతిలో ఫేమస్ బిస్కెట్. ఈ సినిమా కూడా ఆ బిస్కెట్ లా మధురంగా ఉంటుందని ఈ పేరు పెట్టారు.

ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అంటే

ఈ గుజరాతీ చిత్రం ‘నాన్‌ఖటై’ (Naankhatai) 2025 సెప్టెంబర్ 5న థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా మూడు విభిన్న కథలతో (Anthology) రూపొందింది. దర్శకుడు ప్రీత్‌సింగ్ గోహిల్ మన నిత్య జీవితంలోని ఎమోషన్స్ , కుటుంబ అనుబంధాలను చాలా సున్నితంగా చూపించారు ఇందులో. ‘నాన్‌ఖటై’ బిస్కెట్ లాగే ఈ సినిమా కూడా తియ్యని అనుభూతిని ఇస్తుందని విమర్శకులు ప్రశంసించారు. ఈ చిత్రంలో హితేన్ కుమార్, దీక్షా జోషి, ఈషా కన్సార, మిత్ర గధ్వి, మయూర్ చౌహాన్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషించారు. సిద్ధార్థ్ భవ్సార్ అందించిన సంగీతం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. దాదాపు 2 గంటల 40 నిమిషాల నిడివి గల ఈ చిత్రం కామెడీ, డ్రామా ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా ప్రేక్షకులను అలరించింది. ఇప్పుడు ఆరు నెలల 2026 తర్వాత మార్చి 12 నుంచి షెమరూమీలో స్ట్రీమింగ్ కి వస్తోంది. ఇది గుజరాతీ భాషలో ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో అందుబాటులో ఉంటుంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

ఈ సినిమా మూడు అద్భుతమైన కథల చుట్టూ తిరుగుతుంది. మొదటి కథలో తండ్రీకొడుకుల మధ్య జరిగే అసలైన లొల్లి కనిపిస్తుంది. సూర్య అనే కుర్రాడికి, వాళ్ళ తండ్రి మహదేవ్‌కి అస్సలు పడదు. చిన్నప్పటి నుంచి మనస్పర్థలతో విడిపోయిన వీళ్లిద్దరూ.. మళ్ళీ ఒకరినొకరు అర్థం చేసుకుని ఎలా కలిశారనేది మెయిన్ పాయింట్. బయటికి గంభీరంగా కనిపించే తండ్రి మనసులో కొడుకు మీద ఎంత ప్రేమ ఉందో చూపించే సీన్లు గుండెకు హత్తుకుంటాయి ఇందులో.

రెండో కథ ఒక మధ్యతరగతి ఫ్యామిలీ చుట్టూ తిరుగుతుంది. ప్రతి సామాన్యుడికి ఉండే ఒకటే కల సొంత ఇల్లు. ఆ ఇల్లు కట్టుకోవడానికి ఆ కుటుంబం పడే కష్టాలు, ఆ క్రమంలో వాళ్ళు చూసే అవమానాలు, అయినా సరే వెనక్కి తగ్గకుండా వాళ్ళు చేసే పోరాటం ఇందులో ఉంటుంది. మనం నిత్యం చూసే మన ఇంటి కథలాగే ఇది చాలా సహజంగా అనిపిస్తుంది.

Advertisement

ఇక మూడో కథ ఒక గవర్నమెంట్ ఆఫీసర్ చుట్టూ తిరుగుతుంది. లోకమంతా లంచాలు, అవినీతితో నిండిపోయినా.. తను మాత్రం నిజాయితీగా బతకాలని మొండిగా ముందుకెళ్తాడు. అలా ఉండటం వల్ల అతను తన జీవితంలో ఎన్ని తిప్పలు పడ్డాడు, చివరకు ఆ నిజాయితీ అతన్ని ఎక్కడికి తీసుకెళ్లింది అనేది చాలా ఎమోషనల్‌గా ఉంటుంది. మొత్తానికి ఈ ‘నాన్‌ఖటై’ ఒక తియ్యని బిస్కెట్ లాంటి సినిమా అని చెప్పొచ్చు.

Read Also : ఇంట్లోనే మాటు వేసే మొగుడు… భార్య చేసే పనులకు ఫ్యూజులు అవుట్

Related News

ఏం సిరీస్ రా అయ్యా… రక్తం ఏరులై పారే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్

అమాయకపు దొంగను అడ్డం పెట్టుకుని ఇవేం పాడు పనులు… ఈ తమిళ మిస్టరీ థ్రిల్లర్ క్లైమాక్స్ హైలెట్

40 ఏళ్ల వయసులో పట్టే పిచ్చి… ఫ్యామిలీ ఫ్యామిలీకి నెంబర్ల శాపం… కట్ చేస్తే గజగజా వణికిపోయే ట్విస్ట్

సైనికుడిని సొంత ప్రభుత్వమే ఉగ్రవాదిగా ముద్రవేస్తే… మెంటల్ మాస్ యాక్షన్ థ్రిల్లర్

శబరిమల కొండల్లో కొడుకు మిస్సింగ్… ఎమోషనల్ తమిళ ఫ్యామిలీ డ్రామా

పెళ్ళయిన వ్యక్తితో ప్రేమ… ఓటీటీలోకి వచ్చేసిన ట్రయాంగిల్ రొమాంటిక్ డ్రామా

కోమాలో ఉన్న భార్యను కాపాడుకోవడానికి కిరాక్ ప్లాన్, కానీ… ఒక్కసారి చూస్తే మర్చిపోలేరు భయ్యా

ఘనంగా నెక్సా ఓటీటీ అకాడమీ అవార్డ్స్ వేడుక.. సత్తా చాటిన తెలుగు కుర్రాడు!

Big Stories

Advertisement
×