E-Paper
Advertisement

Garikipati – Sivaji: వాటితో మాకు సంబంధం లేదు.. శివాజీ వివాదంపై గరికపాటి సీరియస్

Garikipati – Sivaji: వాటితో మాకు సంబంధం లేదు.. శివాజీ వివాదంపై గరికపాటి సీరియస్
Advertisement

Garikipati – Sivaji:  ప్రముఖ టాలీవుడ్ నటుడు శివాజీ(Sivaji) మహిళల వస్త్రధారణ గురించి చేసిన వ్యాఖ్యలు ఎంతటి దుమారం రేపాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ వివాదంలోకి ఎంతోమంది నటీనటులు హీరోయిన్లు కూడా ఇన్వాల్వ్ అవ్వడంతో ఇప్పటికీ ఈ వివాదం కొనసాగుతూనే ఉంది. మహిళల వస్త్రధారణ గురించి శివాజీ చేసిన వ్యాఖ్యలపట్ల పలువురు విమర్శించగా మరి కొంతమంది ఆయన మాటలలో తప్పులేదని తెలిపారు. ఇకపోతే శివాజీ వివాదంలో కొంతమంది యూట్యూబర్స్ తమ వ్యూస్ కోసం ప్రముఖ ప్రవచన కర్త గరికపాటి నరసింహారావును(Garikapati Narasimha Rao) కూడా లాగిన సంగతి తెలిసిందే. ఈయన తన ప్రవచనాలలో భాగంగా గతంలో ఎప్పుడో మహిళల వస్త్ర దారణ గురించి మాట్లాడినటువంటి కొన్ని వీడియోలను వైరల్ చేయడంతో గరికపాటిపై కూడా పలు విమర్శలు వచ్చాయి.

యూట్యూబ్ వ్యూస్ కోసమే..

ఇలా తనకు ఏమాత్రం సంబంధం లేనటువంటి ఒక వివాదంలో గరికపాటి పేరును ఉపయోగించడమే కాకుండా సోషల్ మీడియా వేదికగా ఆయన వీడియోలను వైరల్ చేయడంతో ఈ వివాదం పట్ల గరికపాటి టీం స్పందిస్తూ అధికారకంగా ఒక నోట్ విడుదల చేశారు. ఈ సందర్భంగా గరికపాటి టీం స్పందిస్తూ.. గత కొన్ని రోజులుగా జరుగుతున్న ఒక వివాదానికి గురువుగారు ఎప్పుడో చెప్పిన మాటలను జోడించి, వక్రీకరించి వివిధ యూట్యూబ్ ఛానల్ లేని సమస్యను సృష్టించే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ మధ్యకాలంలో వ్యూస్ కోసం గురువుగారి మాటలు ఫోటోలను ఇష్టానుసారంగా వాడుకోవడం అలవాటుగా మారిపోయింది. ఇలాంటివి పూర్తిగా అర్థరహితమైనవి కవ్వింపు చర్యలు.

చట్టపరమైన చర్యలు తప్పవు..

Advertisement

గురువుగారి పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తులపై, ఛానల్ లపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం ఖాయమని హెచ్చరించారు. ఇంతకు ముందు కూడా తాము ఎన్నో ఛానెల్స్, వ్యక్తులపై  చర్యలు తీసుకున్నాము కావున అభిమానులు ఏ సమాచారానైనా ఒకటికి రెండుసార్లు సరి చూసుకోవడం మంచిది. గురువుగారు అధికారక మాధ్యమాలలో మాత్రమే వారి ప్రసంగాలు, వ్యాఖ్యలు వెలబడతాయి. మిగతా వాటితో వారికి ఎటువంటి సంబంధం లేదు అభిమానులు ఇటువంటి సందర్భాలలో ఎటువంటి ఆందోళన చెందరాదని తెలియజేస్తున్నాము అంటూ గరికపాటి టీం ఈ వివాదంపై స్పందించి క్లారిటీ ఇచ్చారు.

Advertisement

ఇలా తమ స్వలాభం కోసం గురువుగారి పేరును ఉపయోగిస్తే కచ్చితంగా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ చేసిన ఈ పోస్ట్ వైరల్ అవుతుంది. ఇక గరికపాటి గతంలో చేసిన వ్యాఖ్యలను ఇటీవల ప్రముఖ యూట్యూబర్ నా అన్వేషణ ప్రస్తావిస్తూ ఒక వీడియోని విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇలా తనకు సంబంధంలేని ఒక వివాదంలో గరికపాటి పేరును ప్రస్తావించిన నేపథ్యంలోనే ఆయన టీం అలర్ట్ అవుతూ అందరిని హెచ్చరించారు. ఇలా శివాజీ విషయంలో స్పందించిన నా అన్వేషణ తీవ్రస్థాయిలో విమర్శలను కూడా ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.

Also Read: Anil Ravipudi : నాగార్జునతో అనిల్ రావిపూడి మూవీ.. క్లారిటీ ఇచ్చేసిన డైరెక్టర్!

Related News

బాలీవుడ్‌లో కాల్పుల కలకలం.. టైగర్ ష్రాఫ్‌కు ఏమైంది?

40 ఏళ్ల తర్వాత కాశీకి వెళ్లిన రేణు దేశాయ్.. అక్కడ ఏం జరిగిందంటే?

విజయ్ యాక్షన్‌కు ఫిదా అయిన సందీప్ వంగా.. ఆర్జీవీ రియాక్షన్ మామూలుగా లేదుగా!

బాలు సినిమాలో పవన్ వేసుకున్న ప్యాంట్స్ వెనుక ఇంత కథ ఉందా?

పవన్ కళ్యాణ్‌తో విడిపోయాక నా పరిస్థితి ఇదే.. రేణు దేశాయ్ కామెంట్స్!

నవరాత్రుల వేళ హెబ్బా పటేల్ స్పెషల్ ట్రీట్..ఫ్యాన్స్‌కు కనువిందే!

జ్యోతి పూర్వజ్, పూర్వాజ్ మూవీ ‘కిల్లర్’.. ఒకేసారి రెండు అప్డేట్స్!

‘స్పిరిట్’ వాయిదా.. ఫ్యాన్స్‌కు కొత్త రిలీజ్ డేట్ ప్రకటించిన సందీప్ రెడ్డి వంగా!

Big Stories

Advertisement
×