E-Paper
Advertisement

Mr. Work From Home: భీమిలిలో సినిమా సందడి..ఘనంగా జరిగిన మిస్టర్ వర్క్ ఫ్రం హోమ్ ప్రీ రిలీజ్ వేడుక

Mr. Work From Home: భీమిలిలో సినిమా సందడి..ఘనంగా జరిగిన మిస్టర్ వర్క్ ఫ్రం హోమ్ ప్రీ రిలీజ్ వేడుక
Advertisement

Mr. Work From Home: భీమిలి ప్రాంతంలో సినిమా సందడి నెలకొంది. శనివారం భీమిలి తిమ్మాపురంలో ఉన్న విశాఖ ఫిల్మ్ నగర్ సెంటర్‌లో మిస్టర్ వర్క్ ఫ్రం హోమ్ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సినిమా బృందం మొత్తం హాజరై సందడి చేసింది. స్థానిక ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో వచ్చి ఈ వేడుకను ఆసక్తిగా తిలకించారు.

ఈ చిత్రాన్ని అరవింద్ నిర్మిస్తున్నారు. మధు ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. త్రిగున్ హీరోగా నటించగా, పాలయి రాధా కృష్ణ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు మధు మాట్లాడుతూ, ఈ సినిమా కథ వ్యవసాయ నేపథ్యంలో సాగుతుందని తెలిపారు. వ్యవసాయంలో కొత్త యంత్రాలు, ఆధునిక పరికరాల వినియోగం ఎలా రైతులకు ఉపయోగపడుతుందో ఈ సినిమాలో చూపించామని చెప్పారు. గ్రామీణ వాతావరణంలో పుట్టి పెరిగిన ఒక యువకుడు, యువతి మధ్య ప్రేమ, పెళ్లి, కుటుంబ జీవితం చుట్టూ కథ తిరుగుతుందని వివరించారు. వినోదంతో పాటు మంచి సందేశం కూడా ఈ చిత్రంలో ఉంటుందని అన్నారు.

Advertisement

 

హీరో త్రిగున్ మాట్లాడుతూ, ఈ సినిమా నేటి యువతకు చాలా అవసరమని చెప్పారు. వ్యవసాయం పట్ల యువతలో ఆసక్తి పెరగాలనే ఉద్దేశంతో ఈ సినిమా రూపొందించామని తెలిపారు. భవిష్యత్ తరాలకు ఉపయోగపడే సందేశం ఈ చిత్రంలో ఉంటుందని ఆయన అన్నారు. ఈ సినిమాలో నటించడం తనకు ఎంతో ఆనందంగా ఉందని..ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

Advertisement

నిర్మాత అరవింద్ మాట్లాడుతూ..ఈ చిత్రం ప్రేక్షకుల మెప్పు పొందేలా ఉంటుందని అన్నారు. దర్శకుడు మధు ఎంతో కష్టపడి సినిమాను తీశారని, మంచి కథతో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందని చెప్పారు. కుటుంబంతో కలిసి చూసేలా ఈ సినిమా ఉంటుందని తెలిపారు.

ఈ ప్రీ రిలీజ్ వేడుకలో చిత్ర బృందం సభ్యులు పాల్గొని మాట్లాడారు. మిస్టర్ వర్క్ ఫ్రం హోమ్ సినిమా ఫిబ్రవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుందని ప్రకటించారు. గ్రామీణ నేపథ్యంతో వినోదం, సందేశం కలగలిసిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి ఏర్పడింది.

ALSO READ: Vishwak Sen: అనిల్ రావిపూడికి చిరు కారు గిఫ్ట్.. హర్టయిన మాస్ కా దాస్!

Related News

ఏడేళ్ల వయసులోనే సాఫ్ట్వేర్ సంస్థకు యజమాని.. ‘జైలర్’ బుడ్డోడు చిన్నోడు కాదండోయ్!

‘గరివిడి లక్ష్మి’లో ఆర్పీ పట్నాయక్ పాత్ర వెనుక అసలు కథ ఇదేనా?

క్యాస్టింగ్ కౌచ్‌పై ఝాన్సీ ఏమన్నారంటే.. ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి ఇదేనా?

యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న ‘హైకూ’.. అక్టోబర్ 23న థియేటర్లలోకి!

మాల్దీవుల్లో ఖుషీ కపూర్ అందాల సందడి.. ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్!

రామాయణంపై రాజమౌళి పోస్ట్.. ఏమన్నారంటే!

విజయ్ దేవరకొండ, రష్మికతో మధ్యప్రదేశ్ సీఎం.. అసలు విషయం ఇదే!

మహిళా కథ అనగానే నో చెప్పారు.. చివరికి అదే సినిమాతో సక్సెస్!

Big Stories

Advertisement
×