E-Paper
Advertisement

Shambala OTT: ఓటీటీలోనూ తగ్గని ఆది శంభాల క్రేజ్… ఆహాలో సరికొత్త రికార్డు !

Shambala OTT: ఓటీటీలోనూ తగ్గని ఆది శంభాల క్రేజ్… ఆహాలో సరికొత్త రికార్డు !
Advertisement

Shambala OTT: సీనియర్ నటుడు సాయికుమార్ వారసుడిగా ఆది సాయికుమార్(Aadi Sai Kumar) ప్రేమ కావాలి సినిమా ద్వారా ఇండస్ట్రీకి హీరోగా పరిచయమయ్యారు. మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ అందుకున్న ఈయన అనంతరం పలు సినిమాలలో నటించారు. అయితే సాయికుమార్ సినిమాలు అనుకున్న స్థాయిలో సక్సెస్ కానీ నేపథ్యంలో అవకాశాలు కూడా తగ్గిపోతూ వచ్చాయి దీంట్లో కొంత కాలం పాటు ఇండస్ట్రీకి గ్యాప్ ఇచ్చారు. ఇటీవల శంబాల(Shambhala) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆది సాయికుమార్ ఈ సినిమాతో స్ట్రాంగ్ కం బ్యాక్ ఇచ్చారని చెప్పాలి. ఈ సినిమా 2025 డిసెంబర్ 25వ తేదీ క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. థియేటర్లలో ఎంతో అద్భుతమైన ఆదరణ సొంతం చేసుకున్న ఈ సినిమా ఓటీటీ హక్కులను ఆహా(Aha) కొనుగోలు చేశారు.

100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ ..

ఇక ఈ సినిమా థియేటర్ రన్ పూర్తి కావడంతో జనవరి 21వ తేదీ నుంచి ఆహాలో ప్రసారం అవుతుంది అయితే థియేటర్లలో మంచి సక్సెస్ అందుకున్న ఈ సినిమా ఇక్కడ కూడా అదే స్థాయిలో ఆదరణ సొంతం చేసుకోవడం విశేషం. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కు అందుబాటులోకి వచ్చిన కేవలం 11 రోజుల వ్యవధిలోనే 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ పూర్తి చేసుకొని ఆహాలోనే సరికొత్త రికార్డును సృష్టించింది. ఇప్పటివరకు ఓటీటీలో విడుదలైన చిన్న బడ్జెట్ సినిమాలలో ఈ సినిమా సరికొత్త రికార్డును నెలకొల్పింది.

అమెజాన్ ప్రైమ్ లో హిందీ వెర్షన్..

Advertisement

శంభాల సినిమా కేవలం తెలుగులో మాత్రమే ప్రసారమవుతూ ఈ స్థాయిలో ఆదరణ సొంతం చేసుకోవడం అంటే మామూలు విషయం కాదు ఇలా ఈ సినిమాకు తెలుగులో మంచి ఆదరణ వచ్చిన నేపథ్యంలో హిందీలో కూడా ఈ సినిమాని విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇక త్వరలోనే ఈ సినిమా హిందీ డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సమస్థ అమెజాన్ ప్రైమ్(Amazon Prime) అందుబాటులోకి తీసుకురాబోతోంది.

Advertisement

యుగంధర్ ముని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ఆది సాయికుమార్ జోడిగా అర్చన అయ్యర్ హీరోయిన్ గా నటించారు. శంభాల అనే గ్రామంలో 1980 సంవత్సరంలో జరిగిన కథ చిత్రంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో ఆది సాయికుమార్ విక్రమ్ అనే పాత్రలో శాస్త్రవేత్తగా కనిపించి సందడి చేశారు. ఇలా చాలా విరామం తర్వాత ఆది సాయికుమార్ అద్భుతమైన కథ చిత్రాన్ని ఎంపిక చేసుకొని ప్రేక్షకుల ముందుకు రావడమే కాకుండా సూపర్ సక్సెస్ కావడంతో ఈయన కెరియర్ పరంగా బిజీ కాబోతున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ఆది సాయి కుమార్ తదుపరి సినిమాల కథలపై పూర్తిస్థాయిలో దృష్టి సారించి, కేవలం కథ ప్రాధాన్యత ఉన్న సినిమాలను మాత్రమే ఎంపిక చేసుకోబోతున్నారని తెలుస్తోంది.

Also Read: Allu Arjun: ఉపాసన రాంచరణ్ కు ట్విన్స్.. డబుల్ లవ్ అంటూ అల్లు అర్జున్ పోస్ట్!

Related News

కార్గిల్‌ యుద్ధంలో పక్షవాతం… ఓటమిని ఒప్పుకోని నిజమైన యోధుడి కథ… గూస్ బంప్స్ స్టోరీ భయ్యా

మాఫియా గ్యాంగ్‌ చేతికి చిక్కిన పురాతన నిధి మ్యాప్‌… డేంజరస్ అడ్వెంచర్ లో కామెడీ కూడా

అత్తింట్లోనే దెయ్యాల వేట… ఒక్కొక్కరినీ రాక్షసులుగా మార్చే దుష్టశక్తి… తెలుగులోనూ హారర్ మూవీ

డెత్‌ లిస్ట్‌లో ఒకే కుటుంబం… ఒక్కొక్కరినీ మృత్యువు వేటాడే హారర్‌ ఫ్రాంచైజీ కొత్త అధ్యాయం స్ట్రీమింగ్

మోనాలిసా పెయింటింగ్‌ కొట్టేయడానికి మాస్టర్‌ప్లాన్‌… ఫ్యామిలీ ఫ్యామిలీకి ఇదే పనా ? క్రేజీ క్రైమ్ కామెడీ

కాలేజీ క్యాంపస్‌లో డ్రగ్స్‌ కలకలం… గ్యాంగ్‌స్టర్‌ ఎంట్రీతో అడ్డం తిరిగే కథ… క్రైమ్‌, కామెడీ కలిసిన మలయాళ మూవీ

జర్నలిస్ట్ మిస్సింగ్ తో తీవ్ర కలకలం… కట్ చేస్తే దిమ్మతిరిగే ట్విస్ట్… మలయాళ క్రైమ్ థ్రిల్లర్‌ ఓటీటీలోకి

జైలర్ 2 వచ్చేది ఆ ఓటీటీలోనే..స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!

Big Stories

Advertisement
×