E-Paper
Advertisement

Gas Cylinder Booking: వాట్సాప్ మెసేజ్‌తో గ్యాస్ సిలిండర్‌ను ఎలా బుక్ చేసుకోవాలో తెలుసా? చాలా సింపుల్, ఇలా చెయ్యండి!

Gas Cylinder Booking: వాట్సాప్ మెసేజ్‌తో గ్యాస్ సిలిండర్‌ను ఎలా బుక్ చేసుకోవాలో తెలుసా? చాలా సింపుల్, ఇలా చెయ్యండి!
Advertisement

Gas Cylinder – WhatsApp: గ్యాస్ బుకింగ్ ప్రక్రియ వినియోగదారులకు మరింత సులభతరం చేసే దిశగా ఆయన కంపెనీలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఇప్పటి వరకు ప్రజలు కాల్స్ చేసి గ్యాస్ బుక్ చేస్తుండగా, ఇకపై వాట్సాప్ ద్వారా సులభంగా LPG గ్యాస్ సిలిండర్ బుకింగ్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నాయి. HP గ్యాస్, భారత్ గ్యాస్, ఇండేన్ గ్యాస్ లాంటి ప్రధాన కంపెనీలు ఈ సౌలభ్యాన్ని అందిస్తున్నాయి. మొబైల్ నుంచి కేవలం ఒక మెసేజ్ పంపడంతోనే బుకింగ్ చేసుకోవచ్చు. డిజిటల్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ఈ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చాయి.

వాట్సాప్ ద్వారా గ్యాస్ సిలిండర్ బుకింగ్ ఎలా?

⦿ HP గ్యాస్- 9222201122

1.ముందుగా 222201122 నంబర్‌ను మీ కాంటాక్ట్స్‌ లో సేవ్ చేయండి.

Advertisement

2.వాట్సాప్ ఓపెన్ చేసి, ఈ నంబర్‌కు మెసేజ్ పంపండి.

3.మెనూ నుంచి “బుక్” ఆప్షన్ ఎంచుకోండి. లేదంటే ‘BOOK’ టైప్ చేయండి.

Advertisement

4.మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌ను ఓటీపీ ద్వా వెరిఫై చేయండి.

5.’Y’ టైప్ చేసి సెండ్ చేయండి.

6.కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది. పేమెంట్ లింక్ క్లిక్ చేసి చెల్లించండి.

⦿ భారత్ గ్యాస్- 1800-22-4344

1.నంబర్ సేవ్ చేయండి.

2.వాట్సాప్‌లో మెసేజ్ పంపండి.

3.’BOOK’ లేదా ‘1’ టైప్ చేయండి.

4.మొబైల్ నంబర్ వెరిఫికేషన్.

5.బుకింగ్ కన్ఫర్మ్ అవుతుంది. స్టేటస్ WhatsAppలో అప్‌డేట్ అవుతుంది.

⦿ ఇండేన్ గ్యాస్- 75888 88824. 

1.నంబర్ సేవ్ చేయండి.

2.’BOOK’ మెసేజ్ పంపండి.

3.వెరిఫికేషన్ పూర్తి చేయండి.

4.పేమెంట్ ఆప్షన్ ఎంచుకోండి (UPI, వాలెట్).

5.కన్ఫర్మేషన్ మరియు డెలివరీ స్టేటస్ వస్తుంది.

Read Also:  దేశీ మార్కెట్లోకి iQOO 15.. ఈ ఫ్లాగ్‌ షిప్ స్మార్ట్‌ ఫోన్ ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

వాట్సాప్ ద్వారా గ్యాస్ బుకింగ్ టిప్స్

⦿ మీ గ్యాస్ కనెక్షన్‌ కు రిజిస్టర్ చేసిన మొబైల్ నంబర్‌ తోనే వాట్సాప్ ఉపయోగించాలి. లేకపోతే వెరిఫికేషన్ ఫెయిల్ అవుతుంది.

⦿ మీకు ఇన్ స్టంట్ బుకింగ్ నిర్ధారణ, రిఫరెన్స్ నంబర్, అంచనా వేసిన డెలివరీ డేట్ అందిస్తుంది.

⦿ బుకింగ్ తర్వాత పేమెంట్ లింక్ వస్తుంది. UPI, డెబిట్ కార్డ్, డిజిటల్ వాలెట్ ఉపయోగించవచ్చు.

⦿ బుకింగ్ తర్వాత WhatsAppలోనే డెలివరీ స్టేటస్ చూడవచ్చు.

⦿ ముందుగా మీ కంపెనీ అఫీషియల్ వెబ్‌ సైట్ లో లాగిన్ అయి, WhatsApp ఆప్షన్ చెక్ చేయండి. కొన్నిసార్లు నెంబర్లు మారే అవకాశం ఉంటుంది. కొత్త నెంబర్ ద్వారా గ్యాస్ బుక్ చేసుకోవడం మంచిది.

⦿ ప్రత్యామ్నాయ మార్గాలు: యాప్‌లు (ఇండియన్ ఆయిల్ వన్, HP పే, భారత్‌గ్యాస్), వెబ్‌ సైట్లు, IVRS కాల్స్ ద్వారా కూడా గ్యాస్ బుక్ చేసుఉనే అవకాశం ఉంటుంది.

Read Also:  ఫోన్ బ్యాటరీని 100 శాతం వరకు ఛార్జ్ చేయాలా? ఎక్స్‌ పర్ట్స్ చెప్పేది వింటే మీ మొబైల్‌కు ఫుల్ లైఫ్!

Related News

90% మంది చేసే అతిపెద్ద పొరపాటు.. కొత్త స్మార్ట్‌ఫోన్లలో మార్చాల్సిన ఆ 7 సెట్టింగ్స్ ఇవే!

ఇంట్లో పాత స్మార్ట్‌ఫోన్ ఉందా? దాన్ని క్యాష్‌గా మార్చుకోండిలా!

వాట్సప్‌లో Bill Payments ఫీచర్.. కరెంట్, ఫాస్టాగ్, క్రెడిట్ కార్డ్ బిల్స్ ఎలా కట్టాలో తెలుసా?

బ్యాటరీ తీయలేం, ఇయర్‌ఫోన్ పెట్టలేం..మోడర్న్ ఫోన్ల రూపు రేఖలు ఎందుకు మారాయ్ !

రూ.200లకే యూట్యూబ్ ప్రీమియం, ప్రైమ్ వీడియో.. జియో ఊహించని ధమాకా ఆఫర్!

సిగ్నల్ ఉన్నా.. కాల్స్ కట్ అవుతున్నాయా? అసలు కారణాలు ఇవే!

డ్యూయల్ డ్రైవర్స్,ఆర్జీబీ లైట్స్..బడ్జెట్‌లో బెస్ట్ పార్టీ టవర్ స్పీకర్ !

పళ్ల సందుల్లో ఏముందో ఫోన్‌లో లైవ్ చూడొచ్చు.. డైసన్ కొత్త ఏఐ టూత్ బ్రష్ ధరెంతో తెలుసా?

Big Stories

Advertisement
×