E-Paper
Advertisement

Varanasi Movie: వారణాసి కోసం మహేష్ బాబు రెమ్యూనరేషన్ ..పెద్ద ప్లానింగే!

Varanasi Movie: వారణాసి కోసం మహేష్ బాబు రెమ్యూనరేషన్ ..పెద్ద ప్లానింగే!
Advertisement

Varanasi Movie: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) ప్రస్తుతం రాజమౌళితో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. మొదటిసారి రాజమౌళి(Rajamouli) మహేష్ కాంబినేషన్లో సినిమా రాబోతున్న నేపథ్యంలో ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులను జరుపుకుంటుంది అయితే రాజమౌళి ఈ సినిమాని గ్లోబల్ రేంజ్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఆలోచనలో ఉన్నట్టు స్పష్టమవుతుంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమాకు సంబంధించి గ్లోబ్ ట్రాటర్ అనే పేరుతో కార్యక్రమాన్ని నిర్వహించి ఈ కార్యక్రమంలో భాగంగా సినిమాకు సంబంధించిన టైటిల్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

మహేష్ బాబు వారణాసి..

ఈ సినిమాకు వారణాసి(Varanasi) అనే టైటిల్ ప్రకటించారు. ఈ సినిమాని 2027 సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్టు చిత్ర బృందం వెల్లడించారు. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక వార్త వైరల్ అవుతుంది. ఈ సినిమా గ్లోబల్ రేంజ్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది అంటేనే ఈ సినిమా కోసం మహేష్ బాబు తీసుకునే రెమ్యూనరేషన్ గురించి కూడా పెద్ద ఎత్తున వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇదివరకు మహేష్ బాబు ఒక్కో సినిమాకు 70 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ అందుకుంటున్నారనే తెలుస్తుంది ఈయన చివరిగా నటించిన గుంటూరు కారం సినిమాకు ఏకంగా 78 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్నట్టు వార్తలు వచ్చాయి.

ఏడాది శాలరీ రూపంలో..

Advertisement

ఈ తరుణంలోనే వారణాసి సినిమా కోసం మహేష్ బాబు భారీ స్థాయిలోనే రెమ్యూనరేషన్ తీసుకోబోతున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి. అయితే ఈయన ఈ సినిమాకు రెమ్యూనరేషన్ తీసుకోలేదని తెలుస్తోంది. మహేష్ బాబు ఈ సినిమాకి రెమ్యూనరేషన్ శాలరీ రూపంలో తీసుకుంటున్నట్టు సమాచారం. ఈ సినిమా కోసం పనిచేస్తున్నందుకు ఏడాదికి ఒకసారి సాలరీ లాగా మహేష్ బాబు అందుకోబోతున్నారంటూ వార్తలు వచ్చాయి.

వివాదాలలో రాజమౌళి..

Advertisement

ఈ ప్రకారం రాజమౌళి ఎన్ని సంవత్సరాలు పాటు ఈ సినిమాని కొనసాగిస్తే మహేష్ బాబుకి అంత రెమ్యూనరేషన్ అందుతుందని చెప్పాలి. ఇక రాజమౌళి సినిమా అంటే ఎంత లేదన్న రెండు మూడు సంవత్సరాలు సమయం పడుతుంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొనే మహేష్ బాబు ఇలాంటి డీల్ కుదుర్చుకున్నారని తెలిసి అందరూ షాక్ అవుతున్నారు. ఇక ఈ సినిమా వారణాసి అనే టైటిల్ ప్రకటించినప్పటి నుంచి రాజమౌళి వివాదాలలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఒకవైపు హిందూ సంఘాలు రాజమౌళి పై కేసుల నమోదు చేయగా, మరోవైపు రామభక్త హనుమ క్రియేషన్ బ్యానర్ వాళ్ళు సైతం ఫిలిం ఛాంబర్ లో రాజమౌళి పై ఫిర్యాదులు చేశారు. ఈ సినిమా వేడుకలో తనకు దేవుడిపై నమ్మకం లేదంటూ రాజమౌళి చేసిన వ్యాఖ్యల పట్ల హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. అలాగే వారణాసి అనే టైటిల్ ఇది వరకు తాము రిజిస్టర్ చేసుకొని, అధికారికంగా పోస్టర్ కూడా విడుదల చేశామని, మా ప్రమేయం లేకుండా రాజమౌళి తన సినిమాకు టైటిల్ పెట్టుకోవడం ఏంటి అంటూ రామభక్త హనుమ నిర్మాతలు కూడా ఈయనపై ఫిర్యాదులు చేయడంతో రాజమౌళి వార్తల్లో నిలుస్తున్నారు.

Also Read: Suma Kanakala: రిటైర్మెంట్ పై సుమ షాకింగ్ రియాక్షన్… స్ట్రాంగ్ అంటూ!

Related News

కన్నీటి పర్యంతమవుతున్న మహారాజా హీరోయిన్.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

38ఏళ్ల తర్వాత తండ్రి నాగబాబు రికార్డును రిపీట్ చేసిన నిహారిక!

సైలెంట్ గా నిశ్చితార్థం.. పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ హీరో!

Big Stories

Advertisement
×