E-Paper
Advertisement

Varanasi: వారణాసిలో మరో ‘నాటు నాటు’ సాంగ్? షూటింగ్ పై మహేష్ బాబు క్లారిటీ?

Varanasi: వారణాసిలో మరో ‘నాటు నాటు’ సాంగ్? షూటింగ్ పై మహేష్ బాబు క్లారిటీ?
Advertisement

Varanasi:ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద రాజమౌళి సినిమా అంటేనే అంచనాలు ఆకాశాన్ని తాకుతాయి. అందులోనూ గ్లోబల్ స్టార్ మహేష్ బాబు తోడైతే ఇక చెప్పేదేముంది? తాజాగా వీరిద్దరి కాంబోలో రాబోతున్న ‘వారణాసి’ గురించి ఒక అదిరిపోయే లీక్ బయటకు వచ్చింది. సినిమాలో ఒక సెన్సేషనల్ సాంగ్ ఉండబోతుందని, దాని కోసం మహేష్ బాబు తన డ్యాన్స్ ఫ్లోర్‌ను షేక్ చేశారనే టాక్ వినిపిస్తూ ఉండగా తాజాగా చిత్ర బృందం మొత్తం ఒక ఇంటర్వ్యూ నిర్వహించారు. అందులో ఒక సెన్సేషన్ న్యూస్ బయటకు చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు మహేష్ బాబు

ప్రియాంక చోప్రా కోరిక.. మహేష్ బాబుకు తప్పని డ్యాన్స్:

బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు తన సత్తా చాటిన ప్రియాంక చోప్రా, సుమారు ఏడేళ్ల తర్వాత ‘వారణాసి’తో మళ్లీ ఇండియన్ స్క్రీన్‌ పైకి వస్తోంది. అయితే ఈ సినిమా ఒప్పుకునే ముందే ఆమె రాజమౌళికి ఒక ఆసక్తికరమైన రిక్వెస్ట్ పెట్టిందట. “నేను ఇండియన్ సినిమా చేసి చాలా కాలమైంది, ఈ సినిమాలో నాతో ఒక మంచి డ్యాన్స్ నంబర్ చేయిస్తారా?” అని ఆమె కోరింది. ప్రియాంక అడిగితే జక్కన్న కాదనగలరా? వెంటనే ఒక అదిరిపోయే సాంగ్‌ను ప్లాన్ చేశారు. దీనివల్ల మహేష్ బాబు కూడా గట్టిగా డ్యాన్స్ చేయాల్సి వచ్చింది. ప్రియాంక పెట్టిన ఆ ఒక్క కండిషన్ వల్ల మహేష్ బాబు కూడా అదిరిపోయే స్టెప్పులు వేయాల్సి వచ్చిందని ఆయన సరదాగా లీక్ చేశారు.

షూటింగ్ పూర్తి.. మనసులో ప్లే అవుతున్న సాంగ్ :

Advertisement

ఈ పాట గురించి మహేష్ బాబు మాట్లాడుతూ.. “ప్రియాంక వల్లే నేను డ్యాన్స్ చేయాల్సి వచ్చింది. ఆ సాంగ్ నిజంగానే ఒక సెన్సేషన్ కాబోతుంది. మేం ఇప్పటికే ఆ సాంగ్ షూటింగ్ కూడా పూర్తి చేశాం” అని క్లారిటీ ఇచ్చారు. సినిమా విడుదలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ, ఆ సాంగ్ తాలూకు ట్యూన్ ఇంకా తన మనసులోనే ప్లే అవుతోందని మహేష్ చెప్పడం చూస్తుంటే, రాజమౌళి మరో ‘నాటు నాటు’ రేంజ్ సాంగ్‌ను సిద్ధం చేసినట్లు కనిపిస్తోంది. ప్రియాంక అయితే సెట్స్‌లో ఎప్పుడూ ఆ పాటను పాడుతూనే ఉండేదని, అంతగా ఆ ట్యూన్ తమను కట్టిపడేసిందని మహేష్ బాబు వెల్లడించారు.

ALSO READ:Varanasi: రాజమౌళి కథ విని భయపడ్డ మహేష్ బాబు.. ‘వారణాసి’ వెనుక అసలు రహస్యం ఇదే!

రాజమౌళి సినిమాలలో పాటలు ప్రత్యేకం..

Advertisement

రాజమౌళి సినిమాలలో పాటలు కేవలం వినోదం కోసం మాత్రమే కాకుండా, కథలో అంతర్భాగంగా ఉండి సినిమా స్థాయిని పెంచుతాయి. ముఖ్యంగా డాన్స్ విషయానికి వస్తే, ఆయన తన హీరోల బాడీ లాంగ్వేజ్‌కు తగ్గట్టుగా అత్యంత ఎనర్జిటిక్ , గ్రేస్‌ఫుల్ స్టెప్పులను డిజైన్ చేయిస్తారు. ‘యమదొంగ’లో ఎన్టీఆర్ క్లాసికల్ టచ్ ఉన్న స్టెప్పులు, ‘మగధీర’లో రామ్ చరణ్ వేసిన ‘బంగారు కోడిపెట్ట’ స్టెప్పులు అప్పట్లో సెన్సేషన్ సృష్టించాయి. ఇక ‘RRR’ లోని ‘నాటు నాటు’ పాటతో డాన్స్‌ను గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లి ఆస్కార్‌ను సైతం ముద్దాడారు…ఇక ఈ వారణాసి లోని సాంగ్ గ్లోబల్ వేదికలపై ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి..

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×