E-Paper
Advertisement

KIA Sales Jan 2026: కియా నయా జోష్, 2026లో అమ్మకాల జోరు!

KIA Sales Jan 2026: కియా నయా జోష్, 2026లో అమ్మకాల జోరు!
Advertisement

KIA Sales Jan 2026 In India: స్టైలిష్ కార్లతో ఇండియన్ మార్కెట్ లో కియా దూసుకెళ్తుంది. గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది ప్రారంభంలో మంచి జోష్ ను కనబరిచింది. జనవరి 2026లో కియా ఇండియా 27,603 యూనిట్లను అమ్మింది. కొత్త క్యాలెండర్ మంచి వృద్ధితో మొదలు పెట్టింది. గత సంవత్సరం ఇదే నెలలో 25,025 యూనిట్లు అమ్ముడు కాగా, ఈసారి అమ్మకాలు పెరిగాయి. 2025తో పోలిస్తే 2026 జనవరిలో 10.3 శాతం వార్షిక వృద్ధిని నమోదు చేసింది. ఇండియన్ ప్యాసింజర్ వెహికిల్స్ మార్కెట్‌ లోని పలు  విభాగాలలో స్థిరమైన డిమాండ్‌ తో ఈ రిజల్ట్ ను సాధించింది.

జనాదరణ పొందిన కార్లపై మంచి డీల్స్

కియా కంపెనీ తన ప్రధాన మోడల్ శ్రేణిలో డిమాండ్ ద్వారా జనవరిలో మంచి సేల్స్ ను కొనసాగించింది. మిడ్ సైజ్ SUV విభాగంలో కొత్త తరం సెల్టోస్‌ కు బలమైన ప్రజాదరణ లభించింది. ఈ మోడల్ అమ్మకాలు పెద్ద సంఖ్యలో కొనసాగాయి.  అయితే సోనెట్ సబ్ 4m SUV  తన ప్లేస్ ను స్థిరంగా కొనసాగించింది. కారెన్స్ క్లావిస్ MPV, ఆల్ ఎలక్ట్రిక్ క్లావిస్ EV కోసం కస్టమర్ ట్రాక్షన్ ద్వారా అమ్మకాలు మరింత పెరిగాయి. ఇది MPV, EV విభాగాలలో కియా సత్తాను బలంగా చాటింది.

Advertisement

Read Also: ఏడాదిలో 7.6 లక్షల కార్ల అమ్మకం.. హ్యుందాయ్ సంచలనం!

సెల్టోస్ మరింత దూకుడు

న్యూ జెనరేషన్ సెల్టోస్ రాబోయే నెలల్లో  మరింత దూకుడు కనబరుస్తుందని కియా భావిస్తోంది. అంతేకాదు, వాల్యూమ్‌లను పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుందని అంచనా వేస్తోంది. సోనెట్ కియా వాల్యూమ్ డ్రైవర్లలో ఒకటిగా కొనసాగుతోంది.  అయితే, కారెన్స్ ఆధారిత లైనప్ ఫ్యామిలీ ఆధారిత, ఎలక్ట్రిక్ మొబిలిటీ ఎంపికల కోసం చూస్తున్న కొనుగోలుదారులను ఆకర్షిస్తూనే ఉంది.

Advertisement

Read Also: హ్యుందాయ్ ఫస్ట్, టాటా నెక్ట్స్.. వామ్మో.. ఒక్క నెలలో ఇన్ని కార్లు అమ్మాయా?

అమ్మకాల్లో దూకుడుపై కియా సంతోషం

జనవరి 2026లో తమ కంపెనీ అమ్మకాలపై కియా ఇండియాలో సేల్స్, మార్కెటింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అతుల్ సూద్ సంతోషం వ్యక్తం చేశారు. “2026లో కియాకు మంచి ప్రారంభం లభించింది. కియా బ్రాండ్‌ పై కస్టమర్లు ఉంచిన నమ్మకాన్ని ప్రతిబింబిస్తుంది. కొత్త తరం సెల్టోస్‌ కు సానుకూల స్పందన, సోనెట్‌ కు స్థిరమైన డిమాండ్,  కారెన్స్ క్లావిస్, క్లావిస్ EVకి  పెరుగుతున్న ప్రజాదరణ, మా పోర్ట్‌ ఫోలియో బలం, సమతుల్యతను చాటి చెప్తున్నాయి. ఈ పనితీరు విభిన్నమైన, భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న ఉత్పత్తులను అందించడంపై మా దృష్టిని బలోపేతం చేస్తుంది. అదే సమయంలో మొత్తం కంపెనీ అనుభవాన్ని మెరుగుపరిచేలా చేస్తుంది. ఇదే దూకుడును ఏడాది అంతా కొనసాగించాలని భావిస్తుంది. ఇందుకోసం కొత్త మోడల్స్ ను మార్కెట్ కు పరిచయం చేసే దిశగా ఆలోచనలు చేస్తున్నాం” అని వివరించారు.

Read Also: ఏడుకు తోడు మరో మూడు.. విన్ ఫాస్ట్ ప్లాన్ మామూలుగా లేదుగా!

Related News

తక్కువ ధర.. ఎక్కువ మైలేజ్.. మధ్యతరగతి కుటుంబాలకు బెస్ట్ కార్లు!

కార్ల కంపెనీల దగ్గరే చవకగా సెకండ్ హ్యాండ్ కార్లు కొనేయొచ్చు.. జస్ట్ ఇలా చేస్తే చాలు!

హ్యుందాయ్ బౌల్డర్ కు పేటెంట్.. రగ్గడ్ లుక్‌ లో అదిరిపోయిందిగా!

విన్‌ ఫాస్ట్ డబుల్ సర్‌ ప్రైజ్.. కొత్త ఈ-స్కూటర్, ఈ-బైక్‌కు పేటెంట్!

టాటా అవిన్యా X టెస్టింగ్ షురూ.. నెట్టింట వైరల్ అవుతున్న స్పై షాట్స్!

థార్‌ కు నెక్స్ట్ లెవల్ అవతారం.. విజన్ T వచ్చేస్తోంది!

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

Big Stories

Advertisement
×