Akhanda 2 Movie : నందమూరి అభిమానులు ఎంతగానో ఎదురు చూసినా అఖండ 2 వాయిదా పడింది.. ఈ సినిమాను థియేటర్లలోకి చూడాలి అని అనుకున్న వారికి నిరాశ మిగిలింది. కొన్ని ఫైనాన్షియల్ కారణాలవల్ల ఈ సినిమా వాయిదా పడిన విషయం తెలిసిందే.. అయితే ఈ మూవీ కొత్త రిలీజ్ డేట్ కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.. సంక్రాంతికి రిలీజ్ చేయాలనే డిమాండ్ ఎక్కువవుతోంది.. కానీ ఈనెల 25 న సినిమాను రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఆ డేట్ న సినిమా రావడం కష్టమే అనిపిస్తుంది. తాజాగా ఈ మూవీని ఓవర్సీస్ లో రిలీజ్ చేసేందుకు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ముందుగా బయ్యర్లతో నిర్మాతలు సమావేశం ఏర్పాటు చెయ్యనున్నారని సమాచారం.. అందుతున్న సమాచారం ప్రకారం బయ్యర్లు 25 న రిలీజ్ చేసేందుకు అభ్యంతం వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది.. మరి దీనిపై నిర్మాతలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అన్నది ఆసక్తిగా మారింది.. అసలు ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి..? అభిమానులు రియాక్షన్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం..
నందమూరి బాలయ్య నటించిన అఖండ 2 చిత్రం ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ డిస్కషన్ గా మారిపోయింది. డిసెంబర్ 5 రిలీజ్ కి అంతా రెడీ అయిపోయింది. మరి కొన్ని గంటల్లో సినిమా థియేటర్లలోకి రాబోతుంది అని అభిమానులు థియేటర్ల వద్ద హంగామా మొదలుపెట్టారు. కానీ అభిమానులకు నిరాశ తప్పలేదు. సినిమా రిలీజ్ అవ్వలేదని ప్రకటించారు. ఇక కొత్త డేట్ కోసం అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు.. ఈనెల క్రిస్మస్ పండుగ సందర్భంగా ఈ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అయితే క్రిస్మస్ పండుగకి బోలెడు సినిమాలు రిలీజ్ కు రెడీగా ఉన్నాయి. ఇప్పటికే బాలయ్య సినిమా కోసం చాలా సినిమాలు వాయిదా పడ్డాయి. ఇప్పుడు మరోసారి వాయిదా వేసుకోవడం కష్టమని బయ్యర్లు ఆ రోజున సినిమాను విడుదల చేసేందుకు ఒప్పుకోవట్లేదంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే విడుదల చేస్తే ఈనెల 12 న చేసుకోవాలని చెప్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.. ఎటు చూసిన ఈ మూవీకి రిలీజ్ కష్టాలు తప్పలేదు.. రేపు అఖండ 2 నిర్మాతలు, బయ్యర్లతో సమావేశం కానున్నారని సమాచారం. ఈ మూవీ కొత్త రిలీజ్ డేట్ పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది..
క్రిస్మస్ పండగ సందర్భంగా అమెరికాలో తెలుగు సినిమాలకు అంతగా ఆదరణ ఉండదని తెలిసిందే. ఈరోజున ఎక్కువగా హాలీవుడ్ సినిమాలు రిలీజ్ అవుతాయి. అంతేకాదు అక్కడ సినిమాలకు డిమాండ్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి క్లిష్టమైన పరిస్థితిలో అఖండ 2 ని రిలీజ్ చేస్తే అక్కడ ఉన్న బయ్యర్లు నష్టపోవాల్సి వస్తుందని, వాళ్ళు ఈ సినిమాని 25న రిలీజ్ చేయడానికి ఒప్పుకోవట్లేదంటూ వార్తలు వినిపిస్తున్నాయి.. ఈనెల 25న దాదాపు 16 సినిమాలు థియేటర్లలోకి రాబోతున్నాయి. వాటి గురించి కూడా దృష్టిలో పెట్టుకుని డేట్ ని మార్చాలంటూ డిమాండ్ చేస్తున్నట్లు ఓ న్యూస్ చక్కర్లు కొడుతుంది.. ఇక బయ్యర్ల కోరిక మేరకు సినిమాని మరో డేట్ కి పోస్ట్ ఫోన్ చేస్తారా? లేదా సంక్రాంతి తర్వాత సినిమాను రిలీజ్ చేస్తారా? అన్నది తెలియాల్సింది.. ఏది ఏమైనా కూడా ఈ సినిమా వాయిదా పడటంతో అభిమానులు తీవ్ర నిరాశను వ్యక్తం చేస్తున్నారు…
Also Read: నిర్మాత అనిల్ సుంకర 14 రీల్స్ నుంచి అందుకే తప్పుకున్నాడా..? ఇన్నాళ్లకు బయటపెట్టిన నిజాలు..
బాలయ్య నటించిన అఖండ 2 పాన్ ఇండియా లెవల్ లో రిలీజ్ అవుతుంది. డిసెంబర్ 5 న రిలీజ్ కావాల్సిన సినిమా పలు కారణాలు వల్ల వాయిదా పడింది. ఈ నెల 25 న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొని వచ్చేందుకు నిర్మాతలు నిర్ణయం తీసుకున్నారు. కానీ ఆ డేట్ ను సినిమాలు ఎక్కువగా రిలీజ్ కాబోతున్నాయి. అటు బెంగళూరు లో అవతార్ సిరీస్ మూవీ రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో ఈ సినిమా రిలీజ్ డేట్ మార్చాలని అక్కడ బయ్యర్లు రిక్వెస్ట్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఎటు చూసిన డిసెంబర్ 25 న సినిమా రిలీజ్ అవ్వడం కష్టం అనిపిస్తుంది. రేపు బయ్యర్లతో ఏర్పాటు చేసిన మీటింగ్ లో ఏం నిర్ణయం తీసుకుంటారో చూడాలి..