E-Paper
Advertisement

Producer Anil Sunkara: నిర్మాత అనిల్ సుంకర 14 రీల్స్ నుంచి అందుకే తప్పుకున్నాడా..? ఇన్నాళ్లకు బయటపెట్టిన నిజాలు..

Producer Anil Sunkara: నిర్మాత అనిల్ సుంకర 14 రీల్స్ నుంచి అందుకే తప్పుకున్నాడా..? ఇన్నాళ్లకు బయటపెట్టిన నిజాలు..
Advertisement

Producer Anil Sunkara: ఇండస్ట్రీలో ఎప్పుడు ఎవరు కలిసి ఉంటారో… ఎవరు విడిపోతారో చెప్పడం కష్టమే.. ముఖ్యంగా సినిమాలను నిర్మించే నిర్మాతలు సినిమాలు సక్సెస్ అయినప్పుడు కలిసి పని చేస్తారు.. తర్వాత అటు ఇటు తేడా గనక జరిగితే ఆ నిర్మాణ సంస్థ నుంచి బయటికి వచ్చేస్తారు.. ఇప్పటికే చాలామంది నిర్మాతలు ఇలానే బయటకు వచ్చి సొంతంగా నిర్మాణ సంస్థను స్థాపించి వరుసగా సినిమాలను చేస్తూ వస్తున్నారు. అలా బయటకొచ్చిన నిర్మాతల్లో ఒకరు అనిల్ సుంకర.. ఈయన మొదట 14 రీల్స్ బ్యానర్ లో నిర్మాతగా ఉన్నారు. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల ఆయన బయటకు వచ్చినట్లు వార్తలు వినిపించాయి. ఆ వార్తలపై తాజాగా మరోసారి చర్చ జరుగుతుంది. తాజాగా ఈ ప్రొడ్యూసర్ ఓ ఇంటర్వ్యూ ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని బయటపెట్టారు. అసలు ఆయన ఏం చెప్పారు ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం..

14 రీల్స్ బ్యానర్ నుంచి అనిల్ సుంకర తప్పుకున్నాడా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర గురించి అందరికీ తెలిసే ఉంటుంది.. ఈయన నిర్మించిన ఎన్నో సినిమాలు బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్నాయి కూడా.. ఏటీవీ ద్వారా ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలోకి అడుగుపెట్టిన ఆయన ఆ తర్వాత 14 రీల్స్ బ్యానర్‌పై ఎన్నో విజయవంతమైన చిత్రాలు నిర్మించారు.. అందులో దూకుడు, 1 నేనొక్కడినే, రాజుగారి గది, లెజెండ్, సరిలేరు నీకెవ్వరు వంటి సినిమాలు ఉన్నాయి. అయితే ఈయన 14 రీల్స్ నుంచి బయటకు వచ్చేసిన సంగతి తెలిసిందే.. తాజాగా ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్నో ఆసక్తికర విషయాలను బయటపెట్టారు. ఆయన మాట్లాడుతూ.. నేను ఆ నిర్మాణ సంస్థ నుంచి బయటకు రావడానికి కారణం చిన్న సినిమాలే.. లై వరకు పెద్ద సినిమాలను చేసాము. ఆ తర్వాత చిన్న సినిమాలను చెయ్యాలని అనుకున్నారు. దాంతో అక్కడ ఉండలేకపోయాను. కానీ అక్కడ నిర్మించే సినిమాల స్టోరీలను నేను కూడా వింటూనే ఉంటాను అని ఆయన అన్నారు. ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూ వీడియో వైరల్ అవ్వడంతో అసలు నిజం బయటకు వచ్చేసింది.

Advertisement

Also Read : వీకెండ్ ఓటీటీలోకి వచ్చేసిన సినిమాలు.. మిస్ అవ్వకుండా చూడాల్సిన సినిమాలు ఇవే..

సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో బాధ పడ్డాను.. 

2023లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా వచ్చిన ‘భోళా శంకర్’ ఆయనకు చేదు అనుభవాన్ని మిగిల్చింది… ఈ సినిమా భారీ విషయాన్ని అందుకుంటుందని ఎంతో ఆశగా ఉన్న నిర్మాతకు చుక్కెదురైంది.. దారుణంగా డిజాస్టర్ అవడంతో భారీగా నష్టాలను చవిచూశాడు. దాంతో ఆ తర్వాత ఇండస్ట్రీకి కొంతకాలం దూరమయ్యాడు.. సినిమాలకు అప్పులు ఎక్కువ అవడంతోనే ఆయన ఇండస్ట్రీకి దూరమైనట్లు గతంలో వార్తలు కూడా వినిపించాయి. కొత్త చిత్రాలతో, రియాలిటీ షోతో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టారు.. కంటెంట్ ను మనం బలంగా నమ్మితేనే ఆ సినిమాని సెట్స్ మీదకి తీసుకెళ్లాలి.. మనం ఒక్కరిని కథని విని ఓకే చేయడం మంచిది కాదు.. మరి కొంతమందికి ఈ కథ గురించి చెప్పి వారి సలహాలు తీసుకొని ఆ తర్వాత సినిమాలు చేయడం మంచిది అని నిర్మాత అంటున్నారు.. ప్రస్తుతం ఆయన ఏ టీవీ బ్యానర్ పై కొత్త సినిమాలు చేస్తున్నాడు.. భారీ బడ్జెట్ సినిమాలను ఇకముందు నిర్మిస్తారా లేదా అన్నది మాత్రం క్లారిటీ రాలేదు..

Related News

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

38ఏళ్ల తర్వాత తండ్రి నాగబాబు రికార్డును రిపీట్ చేసిన నిహారిక!

సైలెంట్ గా నిశ్చితార్థం.. పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ హీరో!

కళ్ళు లేవు.. మైమరిపించే గాత్రానికి నేషనల్ అవార్డు.. ఎవరీ సింగర్?

విజువల్ వండర్ గా రామాయణ ట్రైలర్.. అఫీషియల్ ఎప్పుడంటే?

Big Stories

Advertisement
×