E-Paper
Advertisement

Difficult People: ఆఫీసు డ్రామాకు దూరంగా ఉంటూ.. విజయం సాధించడం ఎలా ?

Difficult People: ఆఫీసు డ్రామాకు దూరంగా ఉంటూ.. విజయం సాధించడం ఎలా ?
Advertisement

Difficult People: ఆఫీసు అనేది విభిన్న మనస్తత్వాలు, నైపుణ్యాలు కలిగిన వ్యక్తుల సమూహం. ఈ వాతావరణంలో.. కొంత మందితో సులభంగా కలిసిపోతాం. కానీ మరికొంతమంది మనతో కఠినంగా, అహంకారంగా, లేదా ఇబ్బంది కలిగించే విధంగా ప్రవర్తించవచ్చు. ఇలా వ్యక్తులు మీ పనితీరుపై, మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. వారిని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి , ప్రశాంతంగా పనిచేయడానికి కొన్ని ముఖ్యమైన చిట్కాలు పాటించాలి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

1. భావోద్వేగాలను నియంత్రించుకోండి:

కొంతమంది మీ ప్రతిస్పందనను కోరుకుంటారు. మీరు వారి ప్రవర్తనకు కోపంగా లేదా బాధగా ప్రతిస్పందిస్తే.. అది పరిస్థితిని మరింత దిగజార్చుతుంది. వాటిని వ్యక్తిగతంగా తీసుకోకండి. వారి ప్రవర్తన మీ గురించి కాదని, అది వారి వ్యక్తిగత సమస్యలు, ఒత్తిడి లేదా అభద్రతా భావాల నుంచి వచ్చిందని అర్థం చేసుకోండి. కాస్త సమయం తీసుకుని వారు మిమ్మల్ని విమర్శించినా లేదా రెచ్చగొట్టినా.. వెంటనే ప్రతిస్పందించకుండా.. 10 సెకన్లు బ్రేక్ తీసుకోండి. ఈ విరామం మీకు ప్రశాంతంగా సమాధానం చెప్పడానికి సహాయ పడుతుంది.

Advertisement

2. స్పష్టమైన సరిహద్దులు నిర్ణయించుకోండి:

కొంత మంది వ్యక్తులు తరచుగా ఇతరుల సమయాన్ని, శక్తిని వృథా చేస్తారు. మీ పనిని రక్షించుకోవడానికి సరిహద్దులు అవసరం. అలాంటి వారితో నిక్కచ్చిగా మాట్లాడండి. నేను ప్రస్తుతం ముఖ్యమైన పనిలో ఉన్నాను. నేను దీని గురించి మరో 30 నిమిషాల తర్వాత మాట్లాడతాను” అని సున్నితంగా చెప్పండి. అంతే కాకుండా పనిపై దృష్టి పెట్టండి. వ్యక్తిగత గాసిప్‌లు, అనవసరమైన డ్రామాలకు దూరంగా ఉండండి. మీ సంభాషణ ఎల్లప్పుడూ పని లేదా ప్రాజెక్టు గురించే ఉండేలా చూసుకోండి.

3. ప్రశాంతంగా మాట్లాడండి :

సమస్యను పరిష్కరించడానికి ప్రశాంతంగా మాట్లాడటం ముఖ్యం. విమర్శపై దృష్టి పెట్టండి. వారి ప్రవర్తనను కాకుండా.. ఆ ప్రవర్తన మీ పనిపై చూపిన ప్రభావాన్ని గురించి మాత్రమే మాట్లాడండి. ఉదాహరణకు.. “మీరు నన్ను మధ్యలో ఆపడం వల్ల, నేను నా ఆలోచనను కోల్పోతున్నాను” అని చెప్పండి. అంతే కాకుండా ఎక్కువగా వినడానికి ఆసక్తి చూపించండి. వారు ఏమి చెప్పాలనుకుంటున్నారో శ్రద్ధగా వినండి. వారి కోణం అర్థం కాకపోయినా.. వినడం వల్ల వారి కోపం కొంత తగ్గే అవకాశం ఉంటుంది.

4. రికార్డు చేయండి :

సమస్యలు తెచ్చే పెట్టే వ్యక్తులతో పనిచేసేటప్పుడు.. మీ భద్రత కోసం ప్రతి విషయం రికార్డు ఉంచుకోవడం ముఖ్యం. ముఖ్యమైన నిర్ణయాలు, సూచనలు లేదా డెడ్‌లైన్‌ల గురించి మాట్లాడిన తర్వాత, ఈమెయిల్‌ పంపండి. ఇది భవిష్యత్తులో వచ్చే అపార్థాలను నివారిస్తుంది. సాక్ష్యం ఉంచుకోండి. అన్యాయంగా విమర్శించినప్పుడు లేదా నిబంధనలు ఉల్లంఘించినప్పుడు, తేదీ, సమయం, ఏం జరిగిందో రికార్డు చేయండి.

5. ఉన్నతాధికారులను సంప్రదించండి:

మీ ప్రయత్నాలన్నీ విఫలమై.. ఆ వ్యక్తి ప్రవర్తన మీ పనితీరుకు, మానసిక ఆరోగ్యానికి ఆటంకం కలిగిస్తుంటే.. ఉన్నతాధికారులు లేదా హెచ్ ఆర్‌ను సంప్రదించాలి. నిజాలు మాత్రమే చెప్పండి. మీ బాధను కాకుండా.. మీకు కలిగిన అసౌకర్యాన్ని నిజాలు, రికార్డులతో వివరించండి. ఆఫీసుల్లో కొంత మంది వ్యక్తులను మార్చడం మీ చేతుల్లో ఉండకపోవచ్చు. కానీ మీ ప్రతి స్పందనను, మీ సరిహద్దులను నియంత్రించడం ద్వారా మీరు ప్రశాంతంగా, విజయవంతంగా పనిచేయగలరు.

Related News

మరణం తర్వాత శరీరంలోని ఏ అవయవం ఎంతసేపు జీవించి ఉంటుంది? ఈ విషయాలు తెలుసా

జీవితంలో ఎప్పుడూ తప్పుడు నిర్ణయాలు తీసుకోరు, మోసపోరు.. చాణక్యుడు చెప్పిన ఈ నీతి సూత్రాలు పాటిస్తే

తక్కువ స్థలంలో కిచెన్ గార్డెన్‌.. ఇంట్లోనే కూరగాయలు పండించడం మరింత సులభం

రాత్రి ఆలస్యంగా నిద్రపోయి ఉదయం త్వరగా లేస్తున్నారా? మీ శరీరానికి కలిగే నష్టాలివే

పిల్లలు రాత్రి ఏ సమయం కల్లా నిద్రపోవాలి? టైమ్‌కు నిద్రపోకపోతే మెదడుపై ప్రభావం

రక్తపోటు పెరగడానికి మౌత్ వాష్ కూడా ఒక కారణమేనా.. తాజా రీసెర్చ్ ఏం చెబుతోంది?

గ్రీన్ టీ తాగుతున్నా బరువు తగ్గట్లేదా? అయితే మీరు ఈ 5 తప్పులు చేస్తున్నట్టే!

గుండెపోటు వెనక అసలు విలన్ ప్లాస్టిక్కేనా? మెడికల్ హిస్టరీలోనే షాకింగ్ నిజాలు!

Big Stories

Advertisement
×