E-Paper
Advertisement

Big tv kissik Talks: తినడానికి తిండిలేదు .. చావు బతుకులలో అమ్మ.. ఆఖరి కోరిక తీర్చలేకపోయాను..

Big tv kissik Talks: తినడానికి తిండిలేదు .. చావు బతుకులలో అమ్మ.. ఆఖరి కోరిక తీర్చలేకపోయాను..
Advertisement

Big tv kissik Talks: టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ హీరోయిన్ గా మంచి సక్సెస్ అందుకున్న వారిలో ఇంద్రజ ఒకరు. ప్రస్తుతం ఇంద్రజ బుల్లితెరపై పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. ఈమె జబర్దస్త్ కార్యక్రమంతో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమానికి కూడా జడ్జిగా వ్యవహరిస్తున్నారు. ఇలా బుల్లితెర కార్యక్రమాలతో పాటు సెకండ్ ఇన్నింగ్స్ లో భాగంగా పలు సినిమాలలో తల్లిగా అక్క పాత్రలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. ఇకపోతే తాజాగా ఇంద్రజ బిగ్ టీవీ కిస్సిక్ టాక్స్(Big tv kissik Talks) కార్యక్రమంలో పాల్గొన్నారు.

సర్జరీకి కూడా డబ్బులు లేవు..

ఈ కార్యక్రమంలో భాగంగా తన వ్యక్తిగత విషయాలతో పాటు తన వృత్తిపరమైన విషయాల గురించి కూడా అభిమానులతో పంచుకున్నారు. ఈ క్రమంలోనే వర్ష తన తల్లి గురించి ప్రశ్నలు వేయడంతో కాస్త ఎమోషనల్ అయ్యారు. తన అమ్మ గురించి ఇంద్రజ మాట్లాడుతూ.. ఓసారి మా అమ్మకు ఉన్నఫలంగా హార్ట్ కు సంబంధించిన ఇబ్బంది వచ్చిందని తెలిపారు. అయితే ఆ సమయంలో చేతిలో డబ్బులు లేవు ఓ సినిమా కోసం పని చేస్తున్నాను కానీ సరైన సమయంలో డబ్బులు ఇవ్వకపోవడంతో ఎన్నో ఇబ్బందులు పడ్డామని తెలిపారు. కనీసం అమ్మకు మందులు తీసుకురావడానికి, తినడానికి కూడా డబ్బులు లేని పరిస్థితుల్లో ఉన్నామని తెలిపారు. కానీ డాక్టర్లు మాత్రం తనకు ట్రీట్మెంట్ అత్యవసరమని తెలిసి ఫస్ట్ సర్జరీ చేసి అమ్మని బ్రతికించారని తెలిపారు.

అమ్మ ఆఖరి కోరిక తీర్చలేదు..

Advertisement

సర్జరీ తర్వాత అమ్మ చాలా మంచిగా ఉందని కానీ అమ్మ చనిపోవడానికి ముందు నన్ను ఒక కోరిక కోరారు కనీసం అది తీర్చలేకపోయాను అంటూ ఎమోషనల్ అయ్యారు. మా ఇంటికి దగ్గరలోనే బాగా నడిస్తే పది నిమిషాలు దూరంలోనే ఒక గుడి ఉంది ఆ గుడికి తీసుకెళ్ళమని అమ్మ ఎప్పుడు అడిగేది చూద్దాంలే మా అంటూ నేను అమ్మను గుడికి తీసుకెళ్లలేదు. అయితే ఉన్నఫలంగా అమ్మకు ఆరోగ్యం బాగలేకపోవడం హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరణించారు. ఇలా అమ్మ చనిపోయిన తర్వాత అమ్మ అడిగిన చిన్న కోరిక నేను తీర్చలేకపోయాను అంటూ ప్రతిరోజు బాధపడుతూనే ఉన్నానని తెలిపారు. అందుకే అమ్మ నాన్నలకు ఏదైనా చిన్న చిన్న కోరికలు ఉంటే ఆ కోరికలు తీర్చి వారిని ప్రశాంతంగా పంపించండి అంటూ ఈ సందర్భంగా ఎమోషనల్ అయ్యారు.

Advertisement

ఇక మనిషి జీవితంలో మీరు డబ్బుకు విలువిస్తారా లేక మనుషులకు విలువిస్తారా అంటూ ప్రశ్న ఎదురవడంతో ఇంద్రజ ఆసక్తికరమైన సమాధానం చెప్పారు. ప్రతి ఒక్కరూ మనుషులకే ఇంపార్టెంట్ ఇస్తారు కానీ పరిస్థితులు డబ్బుకు విలువ నిచ్చేలా చేస్తాయని డబ్బు లేకపోతే ఎవరూ పలకరించరని తెలిపారు. డబ్బు మంచి మనసున్న వారి చేతిలో ఉంటే పదిమందికి సహాయం చేస్తుందని తెలిపారు.. ఇప్పుడున్న పరిస్థితులలో మీతో ఎవరైనా మాట్లాడుతున్నారు అంటే వాళ్లు మిమ్మల్ని చూసి కాదని మీ సక్సెస్, మీ దగ్గర ఉన్న డబ్బు, మీ స్టేటస్ చూసే మాట్లాడుతున్నారు. అందుకే ప్రస్తుత కాలంలో డబ్బు ప్రతి ఒక్కరి దగ్గర ఉండాలని ఇంద్రజ తెలిపారు.

Also Read: Big tv kissik Talks: ఇంద్రజ అసలు పేరు ఇది కాదా… ఈ పేరు వెనుక అంత కథ ఉందా?

Related News

సింగర్ అంతడుపుల రమాదేవి ఒక్క పాటకు ఎంత తీసుకుంటారో తెలుసా?

Telugu Tv Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. ఆ ఒక్కటే మళ్లీ టాప్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి కొత్త టెన్షన్.. చింటును బాలు తెస్తాడా..? గుణ ప్లానేంటి..?

Podarillu Today Episode : నారాయణకు అడ్డంగా దొరికిన జమున.. కన్నా సీరియస్.. ఇదేం ట్విస్ట్..

Intinti Ramayanam Today Episode: అక్షయ్ మాటతో మీనాక్షి షాక్.. పల్లవికి మైండ్ బ్లాక్.. అరెస్ట్ చేస్తారా..?

Illu Illalu Pillalu Today Episodes: రెచ్చిపోయిన భాగ్యం.. రామరాజు మాస్ వార్నింగ్.. వల్లికి ఇంకో ఛాన్స్..

Sunday TV Movies : ఆదివారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. మస్ట్ వాచ్..

Nindu Noorella Saavasam Serial Today Episode October 18th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి కోల్‌ కతా వెళ్లడానికి వైజయంతి ఒప్పుకుంటుందా..?

Big Stories

Advertisement
×