E-Paper
Advertisement

Andhra King Taluka : ఆంధ్రకింగ్ తాలూకాలో ఊహించని ట్విస్ట్.. అసలైన ఆంధ్ర కింగ్‌గా మరో స్టార్

Andhra King Taluka : ఆంధ్రకింగ్ తాలూకాలో ఊహించని ట్విస్ట్.. అసలైన ఆంధ్ర కింగ్‌గా మరో స్టార్
Advertisement

Andhra King Taluka: మహేష్ బాబు.పి (Mahesh Babu.P)దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో రామ్ పోతినేని(Ram Pothineni) భాగ్యశ్రీ(Bhagya Shri) హీరో హీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం ఆంధ్ర కింగ్ తాలూకా(Andhra King Taluka). ఈ సినిమా నవంబర్ 27వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా చిత్ర బృందం హైదరాబాద్ ఆంధ్ర ప్రదేశ్ బెంగళూరు వంటి రాష్ట్రాలలో వరుసగా ఈవెంట్లను నిర్వహిస్తూ పెద్ద ఎత్తున ప్రమోషన్లను కొనసాగిస్తున్నారు. తాజాగా కర్నూలులో ఈ సినిమా ప్రీ  రిలీజ్ వేడుకను నిర్వహించిన సంగతి తెలిసిందే.

ఆంధ్ర కింగ్ గా ఉపేంద్ర?

ఇకపోతే తాజా గా బెంగళూరులో కూడా ఈ సినిమా వేడుకను నిర్వహించి కన్నడ ట్రైలర్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా చిత్ర బృందం మీడియాతో ఇంటరాక్ట్ అవుతూ వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఇకపోతే ఈ కార్యక్రమంలో భాగంగా ఉపేంద్ర (Upendra)ఈ సినిమాకు సంబంధించి ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. ఈ సినిమా అభిమాని నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఇక ఇటీవల ఈ సినిమా నుంచి విడుదల చేసిన ట్రైలర్ చూస్తుంటే మాత్రం రామ్ ఖచ్చితంగా ఈ సినిమాతో కం బ్యాక్ ఇవ్వబోతున్నారని స్పష్టమవుతుంది.

ఆంధ్ర కింగ్ పాత్రలో మరో స్టార్?

Advertisement

ఇక ఈ సినిమాలో కన్నడ నటుడు ఉపేంద్ర కీలక పాత్రలో పోషించబోతున్నారు ఆంధ్ర కింగ్ పాత్రలు ఉపేంద్ర నటిస్తున్నారని, ఆయనకు అభిమానిగా రామ్ ఈ సినిమాలో కనిపించబోతున్నారని అందరూ భావించారు అయితే తాజాగా ఈ విషయం గురించి ఉపేంద్ర మాట్లాడుతూ ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. ఈ సినిమాలో తాను ఆంధ్ర కింగ్ గా కనిపించడం లేదని అలాగే రామ్ పోతినేని కూడా ఆంధ్ర కింగ్ పాత్రలో కనిపించరని వెల్లడించారు. దీంతో మరి ఆంధ్ర కింగ్ పాత్రలో నటించేది ఎవరు? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

రామ్ కం బ్యాక్ ఇవ్వనున్నారా..

Advertisement

మరి ఆంధ్ర కింగ్ ఎవరు అనేది తెలియాలి అంటే థియేటర్లో మనం చూడాల్సి ఉంటుంది. ఇలా ఉపేంద్ర చేసిన ఈ వ్యాఖ్యలను బట్టి చూస్తుంటే ఈ సినిమాలో మరొక స్టార్ హీరో కూడా నటించబోతున్నారని స్పష్టం అవుతుంది . మరి ఆ హీరో ఎవరో తెలియాలి అంటే నవంబర్ 27వ తేదీ వరకు ఎదురు చూడాల్సిందే. తాజాగా ఉపేంద్ర చేసిన ఈ వ్యాఖ్యలతో సినిమా పట్ల మరిన్ని అంచనాలు పెరిగిపోయాయి. నిజానికి ఈ సినిమా నవంబర్ 28వ తేదీ విడుదల కావాల్సి ఉండగా ఒకరోజు ముందుగానే ప్రేక్షకుల విడుదల కానుంది. గత కొద్దిరోజులుగా సరైన సక్సెస్ లేక సతమతమవుతున్న రామ్ విభిన్నమైన కథ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా నుంచి విడుదల చేసిన పాటలు కానీ టీజర్, ట్రైలర్ వంటి వీడియోలు చూస్తే ఖచ్చితంగా రామ్ ఈ సినిమాతో మంచి సక్సెస్ అందుకోబోతున్నారని తెలుస్తోంది.

Also Read: Bigg Boss 9 Telugu Promo: తండ్రిని చూసి కన్నీళ్లు పెట్టుకున్న భరణి కూతురు… చూడలేకపోయానంటూ!

Related News

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

Big Stories

Advertisement
×