E-Paper
Advertisement

Bigg Boss 9 Telugu Promo: తండ్రిని చూసి కన్నీళ్లు పెట్టుకున్న భరణి కూతురు… చూడలేకపోయానంటూ!

Bigg Boss 9 Telugu Promo: తండ్రిని చూసి కన్నీళ్లు పెట్టుకున్న భరణి కూతురు… చూడలేకపోయానంటూ!
Advertisement

Bigg Boss 9 Telugu Promo: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 కార్యక్రమం ప్రస్తుతం 11 వ వారంలోకి అడుగుపెట్టింది. తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. ఈ ప్రోమోలో భాగంగా బిగ్ బాస్ హౌస్ లోకి కంటెస్టెంట్ భరణి కుమార్తె (Bharani Daughter)అడుగు పెట్టారు. 11వ వారం ఫ్యామిలీ వీక్(Family week) కావడంతో ఇప్పటికే హౌస్ లో ఉన్నటువంటి కంటెస్టెంట్స్ ఫ్యామిలీకి సంబంధించిన ఒక్కొక్కరు ఎంట్రీ ఇస్తున్నారు. ఇప్పటికే తనూజ, సుమన్ శెట్టి, దివ్య, డెమోన్, సంజన కుటుంబ సభ్యులు హౌస్ లో సందడి చేసిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా విడుదల చేసిన ప్రోమోలో భాగంగా భరణి కుమార్తె హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు.

హెల్త్ జాగ్రత్త డాడీ..

ఇలా భరణి కుమార్తె హౌస్ లోకి అడుగుపెట్టడంతో ఒక్కసారిగా భరణి ఎంతో ఎమోషనల్ అయ్యారు. ఇక భరణి కుమార్తె తన తండ్రిని గట్టిగా హత్తుకొని కన్నీళ్లు పెట్టుకున్నారు. అలాగే తన చేతికి గతంలో ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఇంకా నొప్పిగా ఉందా అంటూ తన కూతురు ఎంతో ప్రేమగా అడగడం అందరిని ఆకట్టుకుంది. చేతికి దెబ్బ తగిలినప్పుడు మిమ్మల్ని చూడలేకపోయాము అంటూ భరణి కుమార్తె ఎమోషనల్ అయ్యారు. ఇక తన కుటుంబ సభ్యుల క్షేమం గురించి కూడా భరణి అడిగి తెలుసుకున్నారు. అందరూ చాలా బాగున్నారు నీ కూతుర్లు అయినందుకు మేము చాలా గర్వపడుతున్నాము చాలా అద్భుతంగా ఆట ఆడుతున్నారు కానీ హెల్త్ కూడా జాగ్రత్త అంటూ ఈమె తన తండ్రికి కొన్ని సలహాలు ఇచ్చారు.

కెప్టెన్ గా చూడాలని ఉంది..

Advertisement

ఇకపోతే భరణి హౌస్ లో బాండింగ్ క్రియేట్ చేసుకుని గేమ్ ఆడుతున్నారు అనే వాదన ఉంది. ఈ విషయం గురించి కూడా తన కుమార్తె తనకి కొన్ని సలహాలు ఇచ్చారు. అందరితో బాండింగ్ పెంచుకున్నారు అంటూ మాట్లాడుతున్నారు అయితే మీరు పెరిగిన వాతావరణం అలాంటిది అందుకే ఇక్కడున్న వారిలో తమ్ముడు, కూతురు అంటూ మమ్మల్ని చూసుకుంటున్నారని తెలిపారు. అయితే మిమ్మల్ని మేము కెప్టెన్ గా చూడాలని కోరుకుంటున్నాము డాడీ అంటూ భరణి కుమార్తె తన మనసులో మాటను తన తండ్రికి చెప్పారు..

Advertisement

ఇక ఈ ప్రోమోలో భాగంగా సుమన్ శెట్టిని చూసిన భరణి కుమార్తె నాకు బాబాయ్ అంటూ ఎంతో ఆప్యాయంగా పిలిచారు. ప్రస్తుతం ఈ ప్రోమో వీడియో వైరల్ అవుతుంది. ఇలా ఫ్యామిలీ వీక్ లో భాగంగా హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఒక్కొక్కరుగా హౌస్ లోకి అడుగు పెట్టడంతో ఈ వారం ఈ కార్యక్రమం చాలా ఎమోషనల్ గా, కొనసాగుతోందని చెప్పాలి. ఇక ఈ వారం నామినేషన్ లో భాగంగా ఆరుగురు కంటెస్టెంట్లు నామినేషన్ లో ఉన్న సంగతి తెలిసిందే మరి ఈ వారం హౌస్ నుంచి ఎవరు బయటకు వస్తారు అనేది తెలియాల్సి ఉంది.

Also Read: Rajinikanth: మరో గౌరవం అందుకున్న తలైవా.. వందేళ్ళ చరిత్రలో మొదటిసారి ఇలా!

Related News

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

BiggBoss 10 : బిగ్ బాస్ లోకి క్రేజీ హీరోయిన్ ఎంట్రీ.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Ariana Glory : వామ్మో.. అరియనా నెలకు అన్ని లక్షలు సంపాదిస్తుందా..?

త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న బిగ్ బాస్ బ్యూటీ.. వరుడు ఎవరంటే..?

Siri Hanumanth : యాంకర్ సిరి హనుమంత్ నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

బిగ్ బాస్ ‘అగ్ని పరీక్ష 2’ డేట్ వచ్చేసింది.. షో పూర్తి వివరాలు ఇవే..

Bigg Boss : నటికి శాపంగా మారిన బిగ్ బాస్.. ఇప్పుడేం చేస్తుందంటే..?

Big Stories

Advertisement
×