E-Paper
Advertisement

Khammam Incident: దారుణం.. భార్య గొంతు కోసి హత్య చేసిన భర్త.. కూతురిపై కూడా..

Khammam Incident: దారుణం.. భార్య గొంతు కోసి హత్య చేసిన భర్త.. కూతురిపై కూడా..
Advertisement

Khammam Incident: ఖమ్మం గట్టయ్య సెంటర్లో దారుణం చోటుచేసుకుంది. గోగుల సాయివాణి(36) అనే మహిళను ఆమె భర్త భాస్కర్(38) గొంతు కోసి హత్య చేశాడు. ఈ దాడిలో అడ్డుకోబోయిన ఆమె కుమార్తె హర్షవర్ధిని (14) పై కూడా నిందితుడు కత్తితో దాడి చేయడంతో ఆమె గాయపడింది.

గోగుల సాయివాణి, భాస్కర్ దంపతులు చింతకాని మండలం నేరడ గ్రామంలోనే వివాహం చేసుకుని జీవితం గడుపుతున్నారు. భాస్కర్ ఖమ్మం పట్టణంలోని ఫంక్షన్ హాల్‌లో క్లీనర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అలాగే ఈ దంపతులకు ఒక కుమారుడు (12), కుమార్తె హర్షవర్ధిని (14) ఉన్నారు. మొదట్లో ఆర్థిక సమస్యలు, ఇతర కుటుంబ విషయాల వల్ల చిన్న చిన్న గొడవలు మొదలై, క్రమంగా తీవ్రమైన వివాదాలుగా మారాయి.

Advertisement

అయితే కొన్ని నెలలుగా సాయివాణి భర్త భాస్కర్‌తో గొడవలు తీవ్రమై, ఆమె కుమారుడు, కుమార్తెతో కలిసి ఖమ్మం నగరంలోని గట్టయ్య సెంటర్ సమీపంలో అద్దె ఇంట్లో ఉంటుంది. అయితే భాస్కర్ తన భార్య సాయివాణిని ఎప్పుడు అనుమానిస్తూ.. ఆమెను హింసాత్మకంగా వేధిస్తూ ఉండేవాడు. దీంతో ఆమె మానసికంగా కృంగిపోయి అతని నుంచి పిల్లలను తీసుకుని వేరుగా ఉంది.

దీంతో గురువారం తెల్లవారుజామున భాస్కర్ నేరడ గ్రామం నుంచి ఖమ్మం నగరానికి వచ్చి, సాయివాణి ఇంటి ముందు కాపు పెట్టుకున్నాడు. ఆమె ఇంటి వద్ద ఎదురుచూస్తూ ఉండటంతో, తెల్లవారుజామున సాయివాణి ఇంటి తలుపు తెరిచి బయటకు వచ్చిన వెంటనే అతడు ముందుకు పరిగెత్తి కత్తితో దాడి చేశాడు. సాయివాణి గొంతును కోసిన దాడిలో ఆమె స్థానికంగా చనిపోయింది. ఈ సంఘటనను చూసిన కుమార్తె హర్షవర్ధిని తల్లిని కాపాడాలని అడ్డుకోబోయింది. కానీ కోపంతో మండిన భాస్కర్ ఆమెపై కూడా కత్తితో దాడి చేసి, చేతికి, భుజంలో తీవ్ర గాయాలు కలిగించాడు. హర్షవర్ధిని స్థానికులు తక్షణమే ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆమెకు అత్యవసర చికిత్స అందించారు. కుమారుడు ఈ సమయంలో ఇంట్లోనే ఉండటంతో తప్పించుకున్నాడు.

Advertisement

Also Read: తిరుపతిలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన.. కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసిన అధికారులు..

సంఘటన తెలిసిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఖమ్మం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని సాయివాణి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. అంతేకాకుండా నిందితుడు భాస్కర్‌ను పోలీసులు అరెస్టు చేశారు.

Related News

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

ఆదిభట్ల గౌరా ఎయిరోస్పేస్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడిన మంటలు, రంగంలోకి ఫైర్ ఫైటర్స్!

Big Stories

Advertisement
×