E-Paper
Advertisement

వారణాసి షూటింగ్ పై క్రేజీ అప్డేట్.. జక్కన్న ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా?

వారణాసి షూటింగ్ పై క్రేజీ అప్డేట్.. జక్కన్న ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా?
Advertisement

Varanasi:రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న వారణాసి మూవీ గురించి ఎప్పటికప్పుడు ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ముఖ్యంగా రాజమౌళి ఈ సినిమా నుంచి ఎటువంటి లీకులు కాకుండా.. చిన్న చిన్న అప్డేట్స్ తోనే సినిమా పై అంచనాలు పెంచుతున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుండి మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేస్తారు అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఒక వార్త వైరల్ గా మారింది.

వారణాసి షూటింగ్ అప్డేట్…

ఇలాంటి సమయంలో వారణాసి షూటింగ్ కి సంబంధించిన ఒక వార్త వెలుగులోకి రావడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. ముఖ్యంగా ఈ షూటింగ్ అప్డేట్ చూసి జక్కన్న అసలు ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా అంటూ ఆశ్చర్యంతో నోరెళ్లబెడుతున్నారు. మరి ఆ షూటింగ్ అప్డేట్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

వందలాది మందితో అఘోర ఎపిసోడ్..

Advertisement

రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో భారీ షెడ్యూల్ ను షూటింగ్ జరుపుకుంటుంది. వారణాసి పుణ్యక్షేత్రం నేపథ్యంలో వందలాది మంది జూనియర్ ఆర్టిస్టులతో కూడిన అఘోర ఎపిసోడ్ ఇక్కడ ప్రత్యేకంగా వేసిన సెట్ లో చిత్రీకరిస్తున్నారు.అయితే మరో 80 రోజుల షూటింగును సెప్టెంబర్ లేదా అక్టోబర్ నాటికి పూర్తి చేయాలని చిత్ర బృందం గట్టిగా ప్లాన్ చేసుకున్నట్లు సమాచారం. ఇకపోతే భారీ సెట్లో ఏకంగా అఘోర ఎపిసోడ్ చిత్రీకరించబోతున్నారు అంటూ వచ్చిన ఈ అప్డేట్ సినిమాపై అంచనాలను పెంచేసింది. ఇక ఈ సినిమాలో ఇంకెలాంటి అద్భుతాలు తెరపై చూపించబోతున్నారో అంటూ.. ఈ అద్భుతాలు చూడడానికి అభిమానులతో పాటు సినీ ప్రేమికులు ప్రపంచవ్యాప్తంగా ఎదురు చూస్తున్నారు. 2027 ఏప్రిల్ 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.

also read:ఎమోషనల్ గా ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్.. కిరణ్ ఖాతాలో మరో హిట్?

అంచనాలు పెంచిన ప్రియాంక చోప్రా లుక్..

Advertisement

ఇదిలా ఉండగా.. మరొకవైపు ఈరోజు గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా పుట్టినరోజు. ఈ సినిమాలో ఆమె హీరోయిన్ గా మందాకిని అనే ఒక పవర్ఫుల్ పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. ఇకపోతే ఈమె పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్ర దర్శకుడు రాజమౌళి ప్రియాంక పాత్రకు సంబంధించిన రెండు ఫోటోలను తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా షేర్ చేసారు. అందులో ప్రియాంక చోప్రా ఒక ఫోటోలో జాలీగా కనిపించగా.. మరొక ఫోటోలో చాలా కోపంగా భయపెట్టేలా కనిపించింది. అంతే కాదు ఈ రెండు ఫోటోలకు రాజమౌళి..” మందాకిని నవ్వితే అందం, నవ్వకపోతే అగ్ని” అంటూ ఒక క్యాప్షన్ కూడా జోడించారు. మొత్తానికి అయితే రాజమౌళి పంచుకున్న ఈ పోస్టర్ పై కూడా పలు రకాల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇందులో రాజమౌళి ప్రియాంక చేత రెండు పాత్రలు చేయిస్తున్నారా ? అనే కామెంట్లు కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే ఈ చిత్రాన్ని శ్రీ దుర్గా ఆర్ట్స్ క్రియేషన్స్ బ్యానర్ పై కే ఎల్ నారాయణ రూ.1200 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. సూపర్ స్టార్ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కుంభ అనే కీలక పాత్ర పోషిస్తూ ఉండడం గమనార్హం.

Related News

వారికి అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం!

ఎమోషనల్ గా ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్.. కిరణ్ ఖాతాలో మరో హిట్?

ఫిగర్ బాలేదని టార్చర్.. 40 ఏళ్లొచ్చాకే ఆ నరకం నుండి బయటపడ్డానంటున్న తారక్ హీరోయిన్

యాంకర్ సుమ హీరోయిన్‌గా నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా ?

‘టాక్సిక్’ ట్రైలర్ డేట్ ఫిక్స్..ఇదైనా ఖాయమా యష్?

72వ జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన తెలుగు సినిమాలు.. ఉత్తమ చిత్రం ఏదంటే?

విక్రమ్ 1 సక్సెస్.. చిరు ఫిదా: ప్రైవేట్ రాకెట్ ప్రయోగంపై మెగాస్టార్ క్రేజీ రియాక్షన్!

Big Stories

Advertisement
×