E-Paper
Advertisement

Ramchander Rao: హైదరాబాద్‌ను మజ్లిస్ నడిపిస్తోంది.. రాంచందర్ రావు సంచలనం!

Ramchander Rao: హైదరాబాద్‌ను మజ్లిస్ నడిపిస్తోంది.. రాంచందర్ రావు సంచలనం!
Advertisement

Ramchander Rao: స్వేచ్చ బ్యూరొ: హైదరాబాద్‌ను మజ్లిస్ కనుసన్నల్లో నడిపిస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు విమర్శించారు. రాష్ట్ర కార్యవర్గ సమావేశాల అనంతరం శనివారం జరుగుతున్న సికింద్రాబాద్ కార్యవర్గ సమావేశం, మేడ్చల్ మల్కాజిగిరి జిల్ఆ కార్యవర్గ సమావేశాలకు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు ముఖ్య అతిథిగా పాల్గొని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.

ఇస్లామీకరణ..

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి ఇస్లామీకరణ చేయాలని చూస్తున్నాయని మండిపడ్డారు. ఈరెండు పార్టీలు ఓటు బ్యాంక్, అరాచక రాజకీయాలు చేస్తున్నాయని ధ్వజమెత్తారు. విద్యా, హోం, న్యాయ శాఖలను చేతుల్లో పెట్టుకుని వ్యవస్థలను ధ్వంసం చేసిన సీఎం రేవంత్ రెడ్డి తుగ్లక్ పాలనను ఎండగట్టాలని పిలుపునిచ్చారు. రాబోయే గ్రేటర్ హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్‌గిరి ఎన్నికల నేపథ్యంలో ప్రజలు తీవ్రంగా ఆలోచిస్తున్నారని రాంచందర్ రావు తెలిపారు.

విద్యార్థులతో కూడా కల్మా..

Advertisement

గతంలో బీఆర్ఎస్ ప్రజా మద్దతుతో కాకుండా, మజ్లిస్ పార్టీతో తెరవెనుక పొత్తు పెట్టుకుని, వారి ఓట్లతోనే హైదరాబాద్ చుట్టుపక్కల గెలిచిందని విమర్శించారు. ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలోనూ మజ్లిస్ ప్రభావం పరాకాష్టకు చేరిందని ఫైరయ్యారు. హైదరాబాద్‌లోని పాఠశాలల్లో ముస్లిమేతర విద్యార్థులతో కూడా కల్మా చదివించే, రాయించే దుస్థితికి తెచ్చారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పరిపాలన తుగ్లక్ పాలనను తలపిస్తోందని రాంచందర్ రావు విమర్శించారు. రాష్ట్రంలో అత్యంత కీలకమైన హోం, విద్యా శాఖలను ముఖ్యమంత్రి తన వద్దే ఉంచుకుని, మూడు సంవత్సరాలుగా వీటికి ప్రత్యేక మంత్రులను నియమించకుండా వ్యవస్థలను పూర్తిగా నిర్వీర్యం చేశారని ఫైరయ్యారు.

Also Read: KBR Python: హైదరాబాద్ కేబీఆర్ పార్క్‌లో భారీ కొండ చిలువ హల్ చల్..!

బీసీ హాస్టళ్లలో.. 

Advertisement

ప్రత్యేక హోంమంత్రి లేకపోవడం వల్లే రాష్ట్రంలో హత్యలు, దాడులు, నేరాలు, కుంభకోణాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయని, లా అండ్ ఆర్డర్ పూర్తిగా క్షీణించిందని ఆందోళన వ్యక్తం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ధరణి, భూగర్భ భూముల వ్యవహారాల్లో వేల కోట్ల దోపిడీకి పాల్పడితే, నేడు కాంగ్రెస్ ప్రభుత్వం సైతం అదే దారిలో నడుస్తోందని మండిపడ్డారు. విద్యాశాఖ పరిస్థితి మరీ దారుణంగా తయారైందని, బీసీ హాస్టళ్లలో విద్యార్థులకు కనీసం సరైన తిండి లేక, తరచూ ఫుడ్ పాయిజనింగ్ ఘటనలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

బీఆర్ఎస్ హయాంలో..

అటు విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్, ఫీజు బకాయిలు చెల్లించకుండా విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగుల విషయంలో కూడా బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు పార్టీలూ దగా చేశాయని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో పేపర్ లీకేజీలతో నిరుద్యోగులను కోర్టుల చుట్టూ తిప్పారని మండిపడ్డారు. నగరంలో కనీసం వర్షం పడితే డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయని, బస్తీలలో కాలనీలలో ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేస్తూ, అందులోనూ అధికార పార్టీ నేతలు అవినీతి, దోపిడీకి పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే ఏకైక లక్ష్యం కావాలని, అందుకు ప్రతి నాయకుడు, కార్యకర్త సిద్ధం కావాలని రాంచందర్ రావు పిలుపునిచ్చారు.

Also Read: Second Hand Mobile: సెకండ్‌హ్యాండ్ మొబైల్ కొంటున్నారా?.. అయితే ఇవి తప్పని సరి!

బుల్లెట్ ట్రైన్ రాక..

ఇదిలాఉండగా శంషాబాద్‌ బహదూర్‌గూడలో మెట్రో, బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుల పేరుతో స్థానిక రైతుల భూములను బలవంతంగా లాక్కోవాలని చూడటం, దీనిపై శాంతియుతంగా పోరాడుతున్న బీజేపీ నాయకులను, రైతులను అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని రాంచందర్ రావు తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో అభివృద్ధి పనులకు, మెట్రో లేదా బుల్లెట్ ట్రైన్ రాకకు బీజేపీ, ఇక్కడి రైతులు వ్యతిరేకం కాదని, కానీ, పచ్చని పంటలు పండుతున్న భూములను లాక్కుంటూ, రైతులకు సరైన ప్రత్యామ్నాయం చూపకుండా, న్యాయమైన నష్టపరిహారం ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేయడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు.

రైతుల పక్షాన ధర్నా..

1000 మందికి పైగా పోలీసులను మోహరించి, కంచెలు వేసి మరీ రైతులను భయభ్రాంతులకు గురిచేయడం దుర్మార్గమని ఫైరయ్యారు. ఉదయం నుంచే రైతుల పక్షాన ధర్నాకు దిగిన బీజేపీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు రాజ్ భూపాల్ గౌడ్, జిల్లా ఇంచార్జ్ సేవెళ్ళ మహేందర్, సీనియర్ నాయకుడు తోకల శ్రీనివాస్ రెడ్డి, ఇతరులను అక్రమంగా అరెస్ట్ చేయడంపై రాంచందర్ రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. అరెస్టయిన నాయకులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

Also read: Kharif Farming: పాలమూరు జిల్లాలో ఎల్‌నినో దెబ్బ.. భూమిలోనే కుళ్ళిపోయిన పత్తి విత్తనాలు!

Related News

Rajagopal Reddy: రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాల్సిందే.. జగ్గారెడ్డి డిమాండ్!

Kharif Farming: పాలమూరు జిల్లాలో ఎల్‌నినో దెబ్బ.. భూమిలోనే కుళ్ళిపోయిన పత్తి విత్తనాలు!

Rice Prices: ఎల్ నినో ఎఫెక్ట్.. పెరగనున్న బియ్యం ధరలు.. అంతా వారిచేతుల్లోనే..?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మాయగాళ్లను నమ్మొద్దు.. మేకతోలు కప్పుకున్న తోడేళ్లు.. బీఆర్‌ఎస్‌పై సీఎం రేవంత్ నిప్పులు

KBR Python: హైదరాబాద్ కేబీఆర్ పార్క్‌లో భారీ కొండ చిలువ హల్ చల్..!

Second Hand Mobile: సెకండ్‌హ్యాండ్ మొబైల్ కొంటున్నారా?.. అయితే ఇవి తప్పని సరి!

Big Stories

Advertisement
×