E-Paper
Advertisement

మీరు AI క్రియేటర్లా? హైదరాబాద్‌లో EROS సంస్థ ఆడిషన్‌ మిస్ కాకండి, ఎప్పుడంటే?

మీరు AI క్రియేటర్లా? హైదరాబాద్‌లో EROS సంస్థ ఆడిషన్‌ మిస్ కాకండి, ఎప్పుడంటే?
Advertisement

EROS:ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికతతో సినిమాలు, వీడియోలు రూపొందించే వారికి ఈరోస్ యూనివర్స్ (EROS Universe) ఒక సువర్ణావకాశాన్ని తెచ్చింది. దేశవ్యాప్తంగా ప్రతిభావంతులైన ఏఐ రచయితలు, దర్శకులను ఎంపిక చేసేందుకు ‘ఏఐ క్రియేటర్ ఆడిషన్’ పేరుతో టాలెంట్ హంట్‌ను ప్రారంభించింది. కేవలం ఒక్క ఆడిషన్‌తో మీ భవిష్యత్తును మార్చుకునేలా కాంట్రాక్టులు, ఉద్యోగాలు సాధించే గొప్ప అవకాశాన్ని ఈ సంస్థ కల్పిస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

నాలుగు నగరాల్లో టాలెంట్ హంట్ :

ఈరోస్ యూనివర్స్ ప్రవేశపెట్టిన ఈ ఆడిషన్ ప్రోగ్రామ్ ముంబై, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై అనే నాలుగు ప్రధాన నగరాల్లో జరగనుంది. ఈ కార్యక్రమం ఆగస్టు 7న ముంబైలో ప్రారంభమైంది. ఆ తర్వాత ఆగస్టు 16న హైదరాబాద్, సెప్టెంబర్ 6న బెంగళూరు, సెప్టెంబర్ 12న చెన్నై నగరాల్లో జరగనుంది. ఇక ఈ ఆడిషన్ల ద్వారా మొత్తం 15 మంది ఏఐ రైటర్లు, 20 నుండి 25 మంది ఏఐ డైరెక్టర్లను ఎంపిక చేసి ఉద్యోగాలు, ప్రాజెక్ట్ ఒప్పందాలు ఇవ్వనున్నారు.

6 గంటల ఛాలెంజ్.. 2 నిమిషాల సినిమా :

Advertisement

ఈ పోటీలో పాల్గొనే అభ్యర్థులకు 6 గంటల సమయం ఇస్తారు. ఆ సమయంలోనే వారు 90 నుండి 120 సెకన్ల వ్యవధి గల ఏఐ మైక్రోఫిల్మ్‌ను రూపొందించాల్సి ఉంటుంది. కథాంశం మరియు జానర్ ఏంటనేది పోటీ ప్రారంభమయ్యే సమయంలోనే వెల్లడిస్తారు. ఇక విజువల్స్, ఆడియో అన్నీ పూర్తిగా ఏఐ ద్వారానే క్రియేట్ చేయాలి. ఎలాంటి రియల్ లైఫ్ క్యారెక్టర్లు లేదా కాపీరైట్ ఉన్న కంటెంట్ వాడకూడదు.

ALSO READ:ఏ.ఆర్.రెహమాన్ కొడుకుకు యాక్సిడెంట్.. పరిస్థితి ఎలా ఉందంటే?

ఎంపిక విధానం మరియు టూల్స్:

Advertisement

పోటీదారులకు అవసరమైన ఏఐ టూల్ క్రెడిట్స్‌ను ఈరోస్ యూనివర్స్ సంస్థే ఉచితంగా అందిస్తుంది. వారు క్రియేట్ చేసిన ఫిల్మ్‌లను కథ చెప్పే విధానం, క్రియేటివిటీ, విజువల్ క్వాలిటీ, ఏఐ ప్రాంప్టింగ్, ఎడిటింగ్ ఆధారంగా న్యాయనిర్ణేతలు మూల్యాంకనం చేస్తారు. ఇక ఎంపిక చేసిన చిత్రాలను జ్యూరీ ముందు ప్రదర్శించి విజేతలను ప్రకటిస్తారు.

రిజిస్ట్రేషన్ వివరాలు:

ఏఐ సాంకేతికతపై ఆసక్తి, నైపుణ్యం ఉన్న ఎవరైనా ఈ పోటీలో వ్యక్తిగతంగా పాల్గొనవచ్చు. దీనికోసం రిజిస్ట్రేషన్ ఫీజుగా కేవలం రూ.99 మాత్రమే నిర్ణయించారు. ప్రస్తుతం అధికారిక వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్లు అందుబాటులో ఉన్నాయి. ఇక తమ ప్రతిభను నిరూపించుకుని సినీ పరిశ్రమలో స్థిరపడాలనుకునే ఏఐ క్రియేటర్లకు ఇది ఒక అద్భుతమైన అవకాశం.

మారుతున్న సాంకేతికతతో పాటు సినిమా రంగంలోనూ ఏఐ ప్రాధాన్యత వేగంగా పెరుగుతోంది. ఇలాంటి సమయంలో ఈరోస్ యూనివర్స్ అందిస్తున్న ఈ అవకాశం ఏఐ క్రియేటర్లకు తమ కెరీర్‌ను మలుపు తిప్పే ఒక పెద్ద వేదిక కానుంది. మీకు కూడా ఏఐ క్రియేటివిటీపై పట్టు ఉంటే వెంటనే రిజిస్టర్ చేసుకుని మీ అదృష్టాన్ని, ప్రతిభను పరీక్షించుకోండి.

Tags

Related News

ఏ.ఆర్.రెహమాన్ కొడుకుకు యాక్సిడెంట్.. పరిస్థితి ఎలా ఉందంటే?

సాయి దుర్గ తేజ్ ‘ సంబరాల ఏటి గట్టు ‘ రిలీజ్ డేట్ లాక్.. పోటీ తప్పదా..?

నూతన ప్రసాద్ ఇంట్లో మామిడికాయలు దొంగతనం చేసిన స్టార్ హీరో.. ఎవరంటే?

డ్యాన్సర్స్ అసోసియేషన్స్ లో ఉప ఎన్నికల ఫలితాలు.. చిరంజీవి మాటని కూడా లెక్క చేయని వైనం!

AAA ఓపెనింగ్.. ఆ సిటీపై బన్నీ మమకారం.. మరో దుబాయ్ కానుందా?

కొరియన్ కనకరాజు వెనుక వరుణ్ కష్టం.. నాగబాబు ఎమోషనల్ పోస్ట్!

స్టేజ్ పైనే ప్రముఖ నటికి లిప్ కిస్ ఇచ్చిన అభిమాని.. వీడియో వైరల్!

Big Stories

Advertisement
×