E-Paper
Advertisement

ఏ.ఆర్.రెహమాన్ కొడుకుకు యాక్సిడెంట్.. పరిస్థితి ఎలా ఉందంటే?

ఏ.ఆర్.రెహమాన్ కొడుకుకు యాక్సిడెంట్.. పరిస్థితి ఎలా ఉందంటే?
Advertisement

AR Rahman: ప్రముఖ ఆస్కార్ అవార్డు గ్రహీత, ప్రముఖ సంగీత దర్శకుడు ఏ ఆర్ రెహమాన్ (AR Rahman) కుమారుడు, యువ నేపథ్య గాయకుడు ఏఆర్ అమీన్ (AR Ameen) రోడ్డు ప్రమాదానికి గురయ్యారు అన్న వార్త సోషల్ మీడియాలో ఒక్కసారిగా సంచలనం సృష్టిస్తోంది. ఆగస్టు 10న చెన్నైలో సోమవారం రోజు తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో అమీన్ తో పాటు ఆయన స్నేహితుడు కూడా ఈ ప్రమాదంలో ఇరుక్కున్నారు. దీంతో అమీన్ కి , ఆయన స్నేహితుడికి ఏదైనా గాయాలయ్యాయా? ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? వైద్యులు ఏం చెప్పారు? ఈ యాక్సిడెంట్ తీవ్రత ఏ విధంగా ఉంది ? అనే విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

రెహమాన్ కొడుకుకు కార్ యాక్సిడెంట్..

మీడియా, పోలీసుల కథనాల ప్రకారం.. చెన్నైలోని గిండీ ప్రాంతంలోని ఒలంపియా టెక్ పార్క్ సిగ్నల్ సమీపంలో సోమవారం తెల్లవారుజామున సుమారు 3:30 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఏ ఆర్ అమీన్ తన స్నేహితుడితో కలిసి పోర్షే కారులో జవహర్లాల్ నెహ్రూ రోడ్ మీదుగా గిండీ వైపు వెళుతుండగా.. పక్క రోడ్డు నుంచి ప్రధాన రహదారి పైకి వచ్చిన ఒక వ్యాగన్ ఆర్ క్యాబ్ వీరి కారును ఢీ కొట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ప్రమాదంలో రెండు వాహనాలు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి.

కార్ యాక్సిడెంట్ ఎలా జరిగిందంటే?

Advertisement

ఇక ఈ ప్రమాదంలో ఏ ఆర్ అమీన్, ఆయన స్నేహితుడికి స్వల్ప గాయాలయ్యాయి.. వెంటనే వారిని కావేరి ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రాథమిక చికిత్స అనంతరం ఇద్దరూ కూడా డిశ్చార్జ్ అయి ఇంటికి చేరుకున్నారు.. ప్రస్తుతం వీరిద్దరి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉంది. మరొకవైపు క్యాబ్లో ప్రయాణిస్తున్న వ్యక్తికి కూడా గాయాలవడంతో దగ్గర్లో ఉన్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కి తరలించి చికిత్స తీసుకొని, ఆ వ్యక్తి కూడా డిశ్చార్జ్ అయినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా ఈ కార్ యాక్సిడెంట్ నుంచి సేఫ్ గా అమీన్ బయటపడడంతో అభిమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు.

దర్యాప్తు చేపట్టిన పోలీసులు..

ఇక ప్రస్తుతం ప్రమాదంపై సమాచారం అందుకున్న అడయార్ ట్రాఫిక్ ఇన్వెస్టిగేషన్ వింగ్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు. ఈ ప్రమాదానికి గురైన రెండు వాహనాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. అక్కడ సీసీటీవీ ఫుటేజ్ ని పరిశీలిస్తూ.. ప్రమాదానికి అసలు కారణం ఏంటి ? అనే విషయాలపై దర్యాప్తు చేపట్టారు.

Advertisement

also read: కుకు విత్ జాతిరత్నాలు’ విజేతగా బిగ్ బాస్ బ్యూటీ!

అమీన్ పాడిన పాటలు..

అమీన్ విషయానికి వస్తే.. ఆస్కార్ గ్రహీత ఏ ఆర్ రెహమాన్ వారసుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈయన.. ప్లే బ్యాక్ సింగర్ గా మంచి పేరు సొంతం చేసుకున్నారు. ఇటీవల రామ్ చరణ్ (Ram Charan) నటించిన ‘పెద్ది’ చిత్రంలోని “చికిరి చికిరి” పాట తమిళ వెర్షన్ కు అమీన్ గాత్రం కూడా అందించారు . అలాగే దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ లతో కలిసి “భీగీ భీగీ” అనే ఇండిపెండెంట్ పాటలో కూడా కనిపించారు.. ఏది ఏమైనా అమీన్ ఇప్పుడు ఆరోగ్యంగా, సేఫ్ గా బయటపడడంతో సినీ సెలెబ్రెటీలు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Related News

చచ్చిపోతామని డ్రామా ఆడారు.. పూరి, ఛార్మి లీలలు బయటపెట్టిన ప్రొడ్యూసర్!

బూతులు తిడుతూ..చచ్చిపో అంటూ శాపాలు… రేణు దేశాయ్ ఎమోషనల్!

‘ముంజ్యా’ బ్యూటీ శర్వరీకి క్రేజీ అవార్డ్… ఆమె చేసిన సినిమాల లిస్ట్ ఇదే!

ప్రమోషన్లలో రణబాలి సరికొత్త స్ట్రాటజీ.. సినిమాకు ప్లస్ అయ్యేనా?

ఆదర్శ కుటుంబం నుంచి ‘నారాయణమ్మ’ ఫుల్ లిరికల్ సాంగ్ రిలీజ్

వెంకటేష్ అంటే త్రివిక్రమ్ కు అంత భయమా.. ఎందుకో తెలుసా?

అమ్మ హీరోయినే..కూతురు హీరోయినే..ఇండస్ట్రీలో తల్లీకూతుర్ల హవా!

రూ.200 కోట్లు సాధ్యమేనా..? ‘ప్యారడైజ్’కి అసలు పరీక్ష ఇప్పుడే!

Big Stories

Advertisement
×