E-Paper
Advertisement

పూర్తిగా కుక్కలా మారిన మిలీనియర్.. ఆ సర్జరీ కోసం రూ.22 కోట్లు వెచ్చించాడా? నిజమేంటీ?

పూర్తిగా కుక్కలా మారిన మిలీనియర్.. ఆ సర్జరీ కోసం రూ.22 కోట్లు వెచ్చించాడా? నిజమేంటీ?
Advertisement

Viral News Fact Check: సోషల్ మీడియాలో కొంతకాలంగా ఓ ఆసక్తికరమైన వార్త వైరల్ అవుతోంది. జపాన్‌కు చెందిన 26 ఏళ్ల వ్యక్తి కుక్కలా మారడానికి ఏకంగా రూ.22 కోట్లకు పైగా ఖర్చు చేశాడని, ఇందుకోసం పలు ఆపరేషన్స్, కృత్రిమ అవయవాలు, పచ్చబొట్లు వేయించుకున్నాడని సోషల్ మీడియాలో కోకొల్లలుగా వార్తలు సర్క్యులేట్ అవుతున్నాయి.  అంతేకాదు, అతడు శాశ్వతంగా నాలుగు కాళ్లపై నడుస్తూ కుక్కలా జీవిస్తున్నాడనే ప్రచారం కూడా జరుగుతోంది. అయితే, ఈ వార్తలో నిజం ఎంత? అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

ఆపరేషన్స్ కాదు.. స్పెషల్ కాస్ట్యూమ్స్!

వైరల్ వార్తల్లో చెప్పినట్లుగా జపాన్‌కు చెందిన  జాసో అనే వ్యక్తి శరీరాన్ని కుక్కలా మార్చుకునేందుకు ఎలాంటి శస్త్రచికిత్స చేయించుకోలేదు. ఈ వార్తలకు సంబంధించిన అసలు వ్యక్తి పేరు టోకో. అతను నిజంగా కుక్కలా కనిపించేందుకు ప్రత్యేకంగా తయారు చేయించిన ఒక కాస్ట్యూమ్‌ ను ఉపయోగిస్తున్నాడు. ఈ కాస్ట్యూమ్‌ ను చూస్తే నిజమైన కుక్కకు, దుస్తులు ధరించిన మనిషికి తేడా గుర్తించడం కూడా కష్టంగా అనిపిస్తుంది. ముఖ్యంగా రఫ్ కోలీ బ్రీడ్ కుక్కను పోలి ఉండేలా దీనిని ప్రత్యేకంగా రూపొందించారు.

కాస్ట్యూమ్ కోసం ఎంత ఖర్చు చేశాడు?

Advertisement

టోకో ఈ ప్రత్యేకమైన కుక్క దుస్తుల కోసం జపాన్‌కు చెందిన జెప్పెట్ అనే స్పెషల్ ఎఫెక్ట్స్ సంస్థను కాంటాక్ట్ అయ్యాడు. టీవీ కార్యక్రమాలు, సినిమాలు, యాడ్స్ కోసం కాస్ట్యూమ్‌లు, ఇతర ప్రాప్స్ తయారు చేయడంలో ఈ సంస్థకు మంచి ఎక్స్ పీరియెన్స్ ఉంది. ఈ స్పెషల్ కాస్ట్యూమ్ తయారీకి సుమారు 20 లక్షల జపనీస్ యెన్లు ఖర్చయినట్లు సమాచారం. భారత కరెన్సీలో ఇది దాదాపు రూ.12.5 లక్షల నుంచి రూ.13 లక్షల వరకు ఉంటుంది. సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నట్లుగా 2.7 మిలియన్ డాలర్లు అంటే, రూ.22 కోట్లకు పైగా ఖర్చు చేయలేదు.

టోకో ఎప్పుడూ కుక్కలా ఉండడు!

మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే టోకో 24 గంటలూ కుక్క దుస్తుల్లో ఉండడు. తనకు ఇష్టమైన సమయంలో, వీడియోలు తీసే సమయంలో మాత్రమే ఈ ప్రత్యేకమైన సూట్‌ వేసుకుంటాడు. తన యూట్యూబ్ ఛానెల్‌ లో కుక్కలా నడవడం, దొర్లడం, వస్తువులను తీసుకురావడం లాంటి పనులు చేస్తూ వీడియోలు పోస్ట్ చేస్తుంటాడు. మిగతా సమయంలో సాధారణ వ్యక్తిలాగే తన రోజువారీ జీవితాన్ని కొనసాగిస్తాడు. ఉద్యోగం కూడా చేస్తున్నాడు.

మరి రూ.22 కోట్ల కథ ఎలా వచ్చింది?

Advertisement

టోకోకు సంబంధించిన నిజమైన ఫొటోలు, వీడియోలను కొన్ని సోషల్ మీడియా పేజీలు వేరే కథనాలతో కలిపి ప్రచారం చేశాయి. అసలు పేరును మార్చి జాసో అనే పేరు పెట్టడం, కాస్ట్యూమ్ ఖర్చును భారీగా పెంచి చూపించడం, శాశ్వతంగా శరీరాన్ని మార్చుకున్నాడని అసత్యాలు రాసుకొచ్చాయి. ఆ వార్తల్లో అబ్ నార్మల్ విషయాలు ఉండటంతో సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. వాస్తవానికి టోకో ఒక ప్రత్యేకమైన కుక్క కాస్ట్యూమ్‌ను ధరించి జస్ట్ అప్పుడప్పుడు ఎంజయ్ చేస్తాడు. అంతేతప్ప, ఆపరేషన్స్ చేయించుకుని శాశ్వతంగా కుక్కగా మారలేదు. సో, జపాన్ వ్యక్తి కుక్కగా మారడానికి రూ.22 కోట్లు ఖర్చు చేశాడనే వైరల్ వార్తలో ఏమాత్రం నిజం లేదు.

Read Also: హోర్డింగ్ లోపల వ్యక్తి నివాసం.. నెట్‌ ఫ్లిక్స్ వింత ప్రచారం!

Tags

Related News

ఫిక్స్‌డ్ డిపాజిట్లకు పెట్టుబడి ప్రత్యామ్నాలు వెతుకుతున్న భారతీయులు.. ఎందుకంటే?

30 ఏళ్లు వచ్చేలోపు..ఈ 7ట్రిక్స్ పాటిస్తే, మీ ఫ్యూచర్ సెట్టైనట్టే!

మీకు 4-5 బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయా? ఎక్కువ అకౌంట్లు ఉంటే జరిగే నష్టాలు ఇవే!

క్రెడిట్ కార్డ్ Vs వర్సెస్ బ్యాంక్ లోన్.. అత్యవసర సమయంలో ఏది బెటర్?

మీ బంగారంపై ఉన్న హాల్‌మార్క్ అసలైనదా? లేదా ?ఇలా గుర్తించండి!

ఒక్క ఏడాదిలోనే రూ.3.2 లక్షల నుంచి రూ.40 లక్షల ప్యాకేజీకి.. ప్రభుత్వ కాలేజీ విద్యార్థి కెరీర్ సూపర్ ఫాస్ట్

గోల్డ్ లోన్ చెల్లించినా మీ బంగారాన్ని బ్యాంక్ తిరిగి ఇవ్వకపోతే ఏం చేయాలి? ఇది తెలుసుకోండి

బ్యాంకుకు వెళ్లకుండానే..ఫోన్ నంబర్ మార్చుకోవడం ఎలా? సింపుల్ ప్రాసెస్ ఇగో!

Big Stories

Advertisement
×