Arjun sarja:చిత్ర పరిశ్రమలో యాక్షన్ కింగ్ గా గుర్తింపు తెచ్చుకున్న అర్జున్ సర్జ (Arjun Sarja) ఎట్టకేలకు తన చిన్న కూతురు వివాహాన్ని జరిపించారు.. 14 ఏళ్ల ప్రేమ బంధానికి స్వస్తి పలుకుతూ అర్జున్ చిన్న కూతురు అంజన వైవాహిక బంధంలోకి అడుగు పెట్టింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పంచుకున్న ఫోటోలు అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. అంజన పెళ్లి ఫోటోలు వైరల్ కావడంతో సినీ సెలబ్రిటీలు, అర్జున్ అభిమానులు నూతన జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
అర్జున్ చిన్న కూతురు అంజన విదేశీయుడుతో ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. సుమారుగా 14 ఏళ్ల ప్రేమాయణానికి స్వస్తి పలుకుతూ గతంలో అతనితో నిశ్చితార్థం కూడా చేసుకుంది.. అయితే ఇప్పుడు ఈ నెల 19వ తేదీన వీరిద్దరూ విదేశాలలోనే వివాహ బంధంలోకి అడుగు పెట్టారు. అయితే ఇందుకు సంబంధించిన ఫోటోలు ఆలస్యంగా వెలుగు చూడడం గమనార్హం. మొత్తానికి అయితే అంజన పెళ్లి చేసుకోవడంతో అర్జున్ బాధ్యత పూర్తయింది అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
అంజన సర్జ విషయానికి వస్తే.. ఈమె ఒక స్టార్టప్ కంపెనీ స్థాపించి ,బిజినెస్ రంగంలో దూసుకుపోతోంది. అమెరికాలో చదువుకుంటున్న సమయంలోనే ఇసాయ్ నట్టర్ అనే కుర్రాడితో ప్రేమలో పడింది. దాదాపు 14 ఏళ్ల పాటు ప్రేమించుకున్న ఈ జంట.. ఇప్పుడు పెళ్లి బంధంలోకి అడుగుపెట్టారు. తాజాగా వైరల్ అవుతున్న ఫోటోలలో లైట్ పింక్ కలర్ హాఫ్ సారీ ధరించిన ఈమె.. ఇందుకు కాంబినేషన్లో స్పెషల్ జువెలరీతో డిజైన్ చేసిన చౌకర్ ధరించి తన మేకోవర్‌ను ఫుల్ ఫీల్ చేసుకుంది. అటు పెళ్లి కొడుకు సేమ్ కలర్ కాంబినేషన్లో షేర్వానీ ధరించి రాయల్ లుక్ లో అభిమానులను ఆకట్టుకున్నారు. ఈ పెళ్లి వేడుకల్లో అర్జున్ దంపతులు స్పెషల్ అట్రాక్షన్ గా నిలవగా.. అర్జున్ పెద్ద కూతురు , ప్రముఖ నటి ఐశ్వర్య మరింతగా ఆకట్టుకుంది.
also read:బిగ్ బాస్ 10 సర్ప్రైజ్ ఎలిమినేషన్.. షాలిని అవుట్!
అర్జున్ కెరీర్ విషయానికి వస్తే సినిమా ఇండస్ట్రీలో యాక్షన్ కింగ్ గుర్తింపు తెచ్చుకున్న ఈయన.. తెలుగులో ఒకే ఒక్కడు, హనుమాన్ జంక్షన్ , శ్రీ ఆంజనేయం వంటి సూపర్ హిట్ చిత్రాలతో భారీ పాపులారిటీ సొంతం చేసుకున్నారు. కన్నడలో అనేక చిత్రాలలో నటించి స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ఈయన ఇప్పుడు సహాయ నటుడిగా మెప్పిస్తున్న విషయం తెలిసిందే. అంతే కాదు తన కూతురు ఐశ్వర్య ను తెలుగు తెరకు పరిచయం చేస్తూ దర్శకుడిగా మారి సినిమా కూడా చేశారు. అలాంటి ఈయన 1988లో ప్రముఖ నటి నివేదితను ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఐశ్వర్య , అంజన అనే ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు
. అయితే తండ్రి బాటలోనే సినీ రంగంలోకి అడుగుపెట్టిన పెద్ద కూతురు ఐశ్వర్య.. హీరోయిన్గా పలు సినిమాలలో నటించింది. ఇక ఈమె ప్రముఖ తమిళ నటుడు రామయ్య కుమారుడు హీరో ఉమాపతి రామయ్య ను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు తల్లిదండ్రులు, అక్క లాగే అంజన కూడా ప్రేమ వివాహం చేసుకుంది