E-Paper
Advertisement

మాదాపూర్, ఐటీ కారిడార్ వాసులకు గుడ్ న్యూస్..?

మాదాపూర్, ఐటీ కారిడార్ వాసులకు గుడ్ న్యూస్..?
Advertisement

HYDRAA Restoration: సర్కారు స్థలాలైన చెరువులు, కుంటలను పరిరక్షించటంలో సంకల్ప దిశగా దూసుకెళ్తున్న హైడ్రా ఇప్పటి వరకు సిటీలో కనుమరుగైపోయానని భావించిన పాతబస్తీలోని భమృక్ ఉన్ ఉద్దౌలా, అంబర్ పేటలోని బతుకమ్మ కుంటలను పునరుద్దరించి, ఎంతో ఆహ్లాదకరంగా తీర్చిదిద్దిన సంగతి తెల్సిందే. చెరువులను కాపాడటంతో పాటు వాటిని ప్రజలకు ఆక్సిజన్ అందించేలా, ఆహ్లాదాన్ని పంచేలా హైడ్రా తీర్చిదిద్దుతుంది. రెండో దశగా ఎంపిక చేసుకున్న ఆరు చెరువుల్లో మరో రెండు చెరువుల పునరుద్దరణ పనులు త్వరలోనే ముగించి, వాటిని ప్రారంభించేందుకు హైడ్రా సిద్దమవుతుంది.

హైడ్రా పూర్వ వైభవం..

ఆస్తులను పరిరక్షించటంతో పాటు శతాబ్థాల క్రితం నగర జీవి మనుగడ సాగించేందుకు బతుకు దెరువును ప్రసాదించి, ప్రస్తుతం ఆక్రమణలతో బక్క చిక్కిన చెరువులను గుర్తించి, హైడ్రా పూర్వ వైభవం తీసుకువస్తుండటం పట్ల హర్షం వ్యక్తమవుతుంది. తొలి దశగా హైడ్రా అంబర్ పేటలోని చారిత్రక బతుకమ్మ కుంటకు, పాతబస్తీలోని భమృక్ ఉన్ ఉద్దౌలా చెరువుల జీవం పోసి, ఎంతో ఆహ్లాదకరంగా, ఆకర్షనీయంగా తీర్చిదిద్దిన హైడ్రా ఇపుడు మాదాపూర్ సమీపంలోని ఖానామెట్ లోని తమ్మిడికుంట చెరువు, మాదాపూర్ సమీపంలోనే గుట్టల బేగంపేట ప్రాంతంలోని సున్నం చెరువు లను ప్రారంభోత్సవానికి సిద్దం చేస్తుంది.

ఈ నెల 31న..

Advertisement

పునరుద్దరణ, అభివృద్ది, పచ్చదనం మెరుగుపరిచే పనులు ప్రస్తుతం తుది దశలో ఉన్నాయి. ఈ నెల 31న గుట్టల బేగంపేటలోని సున్నం చెరువును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించేందుకు సన్నాహాలు కూడా జరుగుతున్నాయి. దీంతో పాటు వచ్చే నెల 2వ తేదీన ఖానామెట్ లోని తమ్మిడి కుంట చెరువును సీఎం రేవంత్ ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. దసరా పండుగ సందర్భంగా ఈ రెండు చెరువులను ప్రారంభించేందుకు హైడ్రా ప్రయత్నాలు చేసినా, పనులు తుది దశలో ఉండటంతో ముహూర్తాన్ని ఈ నెలాఖరుకు, వచ్చే నెల 2వ తేదీకి ఫిక్స్ చేసింది.

ఎంతో ముందు చూపుతో పనులు

ఈ నెల 31న, వచ్చే నెల 2వ తేదీన సీఎం చేతుల మీదుగా ప్రారంభం కానున్న రెండు చెరువుల్లో ఆక్రమణలను, చెరువులో పేరుకుపోయిన చెత్తా చెదారంతో పాటు పూడికను తొలగించి, హైడ్రా ఈ రెండు చెరువులను ఎంతో ముందు చూపుతో అభివృద్ది చేస్తుంది. ఖానామెట్ లోని తమ్మిడి కుంట చెరువు లో గతంలో సినీ నటుడు నాగార్జునకు చెందిన ఎన్ కన్వేన్షన్ ను హైడ్రా తొలగించిన సంగతి తెల్సిందే. ఈ రకంగా ఆక్రమణల చెర నుంచి చెరువులకు విముక్తి కల్గించటంతో పాగటు పూర్వ వైభవం తీసుకువచ్చే దిశగా హైడ్రా పకడ్బందీగా చర్యలు చేపడుతుంది. కబ్జాల బారిన చిక్కి కనుమరుగైపోయాయన్న చెరువుల ఆనవాళ్లకు హైడ్రా మళ్లీ జీవం పోయటంతో పాటు వాటిని ఎంతో అందంగా, ఆహ్లాదకరంగా తీర్చిదిద్దుతుంది. సాంకేతికంగా కబ్జాలను గుర్తించి, తొలగించటంతో పాటు చెరువుల విస్తీర్ణాన్ని తిరిగి పెంచి నీటి నిల్వ సామర్థ్యం మెరుగుపరిచే చర్యలను కూడా చేపట్టింది. చెరువు ను మున్ముందు ఎవరు ఆక్రమించకుండా చెరువు కట్టలను పటిష్టం చేస్తూ చెరువుల పరిరక్షణ, భద్రతకు హైడ్రా ప్రాధాన్యతనిస్తుంది.

Advertisement

Also read: ఆదిలాబాద్ జిల్లా ST కుల ధృవీకరణ పత్రాల వివాదానికి.. ప్రభుత్వం చెక్!

బండరాళ్లకు కళాత్మక రూపం..చక్కటి వ్యూ పాయింట్..

చెరువు పక్కనే ఉన్న బండరాళ్లను కళాత్మకంగా తీర్చిదిద్దుతూ ఆకర్షణీయమైన వ్యూ పాయింట్లుగా హైడ్రా తీర్దిదిద్దుతుంది. ఈ రెండు చెరువుల చుట్టూ వాకింగ్ ట్రాక్‌లు, పార్కుల అభివృద్ధి చేయటంతో పాటు ప్రజలు వ్యాయామం చేసుకునేందుకు వీలుగా ఓపెన్ జిమ్‌లు, చిన్నారుల కోసం ఆట స్థలాలు, పచ్చదనం, ల్యాండ్‌స్కేపింగ్‌తో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సమకూర్చుతుంది. వర్షపు నీరు చెరువుల్లోకి చేరేలా ఇన్‌లెట్లు, నీటి ప్రవాహ నియంత్రణకు అవుట్‌లెట్లను చెరువు నీటి నిల్వలకు అనుకూలంగా అభివృద్ధి చేసింది. ఈ రెండు చెరువుల్లోకి భవిష్యత్తులో కూడా మురుగునీరు చేరకుండా ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఎంతో ముందు చూపుతో వర్షపు నీటి నిల్వ పెంచి భూగర్భ జలాల రీఛార్జ్‌కు అవకాశం కల్పిస్తుంది.

గుట్టల మాదాపూర్..

వరద ముప్పు తగ్గించేలా సహజ నీటి ప్రవాహ మార్గాలను పునరుద్ధరించింది. గుట్టల మాదాపూర్ సమీపంలోని గుట్టల బేగంపేటలోని సున్నం చెరువు గతంలో సుమారు 32 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నట్లు గుర్తించిన హైడ్రా ఆక్రమణలతో సుమారు 16.4 ఎకరాలకు తగ్గినట్లు గుర్తించిన హైడ్రా ప్రస్తుతం అభివృద్ది చేస్తున్న చెరువును తిరిగి చెరువు 30.5 ఎకరాలకు విస్తరించి, అభివృద్ది చేస్తుంది. సున్నం చెరువు అభివృద్ధికి సుమారు 10 కోట్ల వెచ్చిస్తూ, చెరువు మధ్యలో బోటింగ్ కోసం ఐలాండ్ ఏర్పాటు చేసింది. మాదాపూర్ సమీపంలోని ఖానామెట్ లోని తుమ్మిడికుంట చెరువు కూడా ఆక్రమణలతో సుమారు 16.2 ఎకరాలకు తగ్గినట్లు గుర్తించిన హైడ్రా చెరువును తిరిగి సుమారు 29.3 ఎకరాలకు పునరుద్దరించింది.

రెండో దశలో రూ.303 కోట్లతో మరో 14 చెరువుల పునరుద్దరణ

హైడ్రా తాజాగా రెండో దశగా రూ. 303 కోట్లతో వ్యయంతో మరో 14 చెరువులకు పూర్వ వైభవం తీసుకునే దిశగా చేస్తున్న ప్రయత్నాలు చేస్తుంది. చెరువు ఎఫ్ టీఎల్ లను గుర్తించి, ఆ తర్వాత చెరువులో పేరుకుపోయిన పూడిక, చెత్తాచెదారం బయటకు తీసి, చెరువు చుట్టున్న ఆక్రమణలను తొలగించి, చెరువులకు పూర్వ వైభవాన్ని తీసుకువచ్చేందుకు కృషి చేస్తుంది. చెరువులను పునరుద్దరించి, పూర్వ వైభవం తీసుకురావటంతో పాటు మళ్లీ చెరువుల్లో ఆక్రమణలు, కబ్జాలు రాకుండా ఫెన్సింగ్ ను కూడా ఏర్పాటు చేయనుంది. ఈ రకంగా అభివృద్ది చేసిన నాలుగు చెరువుల్లో స్థానికుల్లో అన్ని వయస్సుల వారికి అవసరమైన సౌకర్యాలను సమకూర్చుతూ హైడ్రా చెరువులకు ప్రాణం పోస్తుంది. చెరువును మళ్లీ కబ్జా చేయటం మాట దేవుడెరుగు గానీ, చెరువులో చెత్తా చెదారం వేయకుండా నిరంతర నిఘా ఉండేలా 14 చెరువుల వద్ద హైడ్రా సీసీ కెమెరాలతో నిరంతరం నిఘాను ఏర్పాటు చేస్తుంది.

Also read: రాజమౌళి నుంచి త్రివిక్రమ్ వరకు.. తనికెళ్ల భరణి చెప్పిన ఆసక్తికర విషయాలు!

Tags

Related News

మాదాపూర్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్య!

ఒక్క ఫోన్ కాల్‌తో సీన్ రివర్స్.. కారులో రూ.2.40 లక్షలతో ఏసీబీకి చిక్కిన వాటర్ బోర్డ్ JD!

టీజీ-ఐపాస్ సర్వర్‌ హ్యాక్.. హ్యాకర్లు ఏం డిమాండ్ చేశారో తెలిస్తే షాకవుతారు!

ఎల్ నినో కరువు మండలాల లెక్కింపుపై.. ప్రభుత్వం సంచలన నిర్ణయం!

టికెట్ గొడవ.. కండక్టర్‌ను రన్నింగ్ బస్సులోంచి తోసేసిన మహిళ!

ఆదిలాబాద్ జిల్లా ST కుల ధృవీకరణ పత్రాల వివాదానికి.. ప్రభుత్వం చెక్!

ORRపై ఘోర ప్రమాదం.. వాటర్ ట్యాంకర్‌ను ఢీకొట్టిన వాహనం.. ఇద్దరు దుర్మరణం!

Big Stories

Advertisement
×