E-Paper
Advertisement

బిగ్ బాస్ 10 సర్ప్రైజ్ ఎలిమినేషన్.. షాలిని అవుట్!

బిగ్ బాస్ 10 సర్ప్రైజ్ ఎలిమినేషన్.. షాలిని అవుట్!
Advertisement

Bigg boss 10 Shalini: బిగ్ బాస్ సీజన్ 10 ఏడవ వారం ఊహించని ఎలిమినేషన్ అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇకపోతే 12 మంది నామినేషన్ లోకి రాగా.. ఆరవ వారం ఎలిమినేషన్ లేకపోవడంతో ఈ వారం కచ్చితంగా డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని ఆడియన్స్ గెస్ చేశారు. దీనికి తోడు 12 మంది నామినేషన్ లోకి రావడంతో ఇద్దరిని ఎలిమినేట్ చేసే అవకాశాలున్నాయి అంటూ కూడా వార్తలు వినిపించాయి. ఇక సోషల్ మీడియాలో వైరల్ అయిన వార్తలు ఎట్టకేలకు నిజమయ్యాయి. అందులో భాగంగానే మొదటి ఎలిమినేషన్ లో భాగంగా వైల్డ్ కార్డు ద్వారా ఐదవ వారం హౌస్ లోకి అడుగుపెట్టిన దక్షి గుత్తికొండ (Dakshi guttikonda) ఎలిమినేట్ అయ్యింది.

బిగ్ బాస్ 10 ఏడవ వారం స్పెషల్ సర్ప్రైజ్..

ఇక రెండవ ఎలిమినేషన్ ఎవరు అంటూ ఆడియన్స్ సైతం ఆత్రుతగా ఎదురు చూడగా.. సర్ప్రైజ్ కంటెస్టెంట్ ఎలిమినేట్ అయ్యారు. రోహిత్, రామకృష్ణ, షాలిని డేంజర్ జోన్ లో ఉండగా.. గ్రీన్ జోన్ లో ఉన్న ముఖేష్, త్రిగుణ్, దెబ్జానీ, అమన్, నీతూ ఐదుగురు కలిసి ఈ ముగ్గురిలో ఒకరిని ఎలిమినేట్ చేశారు. నిజానికీ షాలిని ఎలిమినేషన్ ఆరవ వారంలోనే జరగాల్సి ఉంది. ఆమెను ఎలిమినేట్ చేసినట్లే చేసి సీక్రెట్ రూమ్ కి పంపించారు. కనీసం సీక్రెట్ రూమ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అయినా ఆమెలో మార్పు వస్తుందని నిర్వాహకులు అనుకున్నారు కానీ అది జరగకపోవడంతో ఆమెను ఎలిమినేట్ చేయడం జరిగింది. అలా ఏడు వారాల పాటు హౌస్ లో కొనసాగిన కామన్ క్యాటగిరీ నుండి హౌస్ లోకి అడుగుపెట్టిన షాలిని (Shalini ) బయటకు వచ్చేసింది.

షాలిని అవుట్..

Advertisement

ఇకపోతే బిగ్ బాస్ సీక్రెట్ రూమ్ నుంచి షాలిని హౌస్ లోకి అడుగుపెట్టినా.. అక్కడ తన గేమ్ కంటే కూడా రోహిత్తో ఆమె నడిపిన లవ్ ట్రాక్ నెట్ తీవ్రస్థాయిలో వైరల్ అయింది.. దీనికి తోడు వీరిద్దరి రొమాంటిక్ కెమిస్ట్రీకి యువత బాగానే కనెక్ట్ అయినప్పటికీ.. షాలిని వ్యక్తిగత ఆట తీరు మాత్రం కనబడలేదు. కేవలం లవ్ ట్రాక్ పైనే ఫోకస్ పెట్టి టాస్కులను పక్కన పెట్టేసిందనే విమర్శలు కూడా వచ్చాయి. ఇక సీక్రెట్ రూమ్ నుంచి వచ్చినా సరే తన ఆటను మెరుగుపరుచుకోకపోవడం వల్లే ఆమెకు ఆశించిన స్థాయిలో ఓట్లు పడలేదు. అలా ఎట్టకేలకు షాలిని ఎలిమినేట్ అయ్యింది.

also read: బిగ్ బాస్ హోస్ట్ గా రమ్య కృష్ణ ఒక్కరోజు రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

షాలిని రెమ్యూనరేషన్..

Advertisement

అగ్నిపరీక్ష సీజన్ 2 లో సత్తా చాటి కామనర్ కేటగిరీలో హౌస్ లోకి అడుగుపెట్టిన షాలిని వారానికి 75 వేలు చొప్పున అగ్రిమెంట్తో హౌస్ లోకి అడుగుపెట్టిందట. అంటే ఏడు వారాలకు గాను సుమారుగా రూ. 5.25 లక్షల రెమ్యూనరేషన్ లభించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి తోడు అగ్నిపరీక్ష ద్వారా ఈమెకు సుమారుగా రూ.50 నుండి రూ.75 వేల వరకు లభించిందని , అలా మొత్తంగా రూ.6 లక్షల వరకు రెమ్యూనరేషన్ లభించినట్లు సమాచారం.

Related News

బిగ్ బాస్ హోస్ట్ గా రమ్య కృష్ణ ఒక్కరోజు రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

బిగ్ బాస్ పర్ఫెక్ట్ హోస్ట్ గా రమ్యకృష్ణ.. ఒక్క ఎపిసోడ్ తోనే దడదడలాడించిందిగా!

దక్షి ఎలిమినేటెడ్.. వైల్డ్ కార్డు ద్వారా వచ్చిన ఈమె ఎంత సంపాదించిందంటే?

బ్రాండ్ అంబాసిడర్ గా షాలిని.. ఇదెక్కడి ట్విస్ట్ నాగ్ సార్!

రోహిత్ కి ఊహించని షాక్.. హౌస్ లో ఉన్నంతకాలం అలాగే ఉండాల్సిందేనా?

Nindu Noorella Saavasam Serial Today Episode October 25th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరే హంతకురాలు అన్న విషయం వైజయంతికి తెలిసిపోతుందా..?    

ఒక్క పాటతో ఓవర్‌నైట్ క్రేజ్.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోక్ సాంగ్స్!

Big Stories

Advertisement
×