E-Paper
Advertisement

థియేటర్లలో సక్సెస్ ఫుల్ రన్.. ఓటీటీలోకి వచ్చేస్తున్న జైలర్ 2?

థియేటర్లలో సక్సెస్ ఫుల్ రన్.. ఓటీటీలోకి వచ్చేస్తున్న జైలర్ 2?
Advertisement

Jailer 2 OTT: కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న రజినీకాంత్ తాజాగా జైలర్ 2(Jailer 2 ) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. నెల్సన్ దిలీప్ కుమార్(Nelson Dilip Kumar) దర్శకత్వంలో రజనీకాంత్(Rajinikanth) జైలర్ అనే సినిమాలో నటించారు. ఈ సినిమా అద్భుతమైన ఆదరణ సొంతం చేసుకోవడంతో ఈ సినిమాకు సీక్వెల్ చిత్రంగా జైలర్ 2 సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా దసరా పండుగను పురస్కరించుకొని అక్టోబర్ 15వ తేదీ తెలుగు తమిళ భాషలలో విడుదలైన సంగతి తెలిసిందే.

700 కోట్ల క్లబ్లో జైలర్ 2..

ఇలా ఈ సినిమా తెలుగులో ఏ విధమైనటువంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ సుమారు 100కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టినట్లు తెలుస్తోంది. ఈ సినిమా తెలుగు రిలీజ్ హక్కులను ప్రముఖ నిర్మాత నాగవంశీ కొనుగోలు చేశారు. ఈ సినిమా థియేటర్లలోకి వచ్చి దాదాపు 11రోజులు అవుతున్న ఇప్పటికీ ఏమాత్రం కలెక్షన్లు తగ్గకుండా దూసుకుపోతుంది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 710 కోట్ల రూపాయల కలెక్షన్లను రాబట్టినట్టు తెలుస్తోంది. ఇప్పటికీ జైలర్ 2 సినిమా విజయవంతంగా థియేటర్లలో ప్రసారం అవుతున్నప్పటికీ ఈ సినిమా త్వరలోనే డిజిటల్ స్ట్రీమింగ్ కాబోతోందని సమాచారం.

నవంబర్ 12 నుంచి డిజిటల్ స్ట్రీమింగ్..

Advertisement

ఈ సినిమా డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ భారీ ధరలకు కొనుగోలు చేశారు. అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా అక్టోబర్ 15వ తేదీ థియేటర్లలో విడుదల కాగా ముందుగా అనుకున్న డీల్ ప్రకారం నవంబర్ 12వ తేదీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల చేయబోతున్నట్లు తెలుస్తుంది. త్వరలోనే ఈ సినిమా ఓటీటీ విడుదల తేదీకి సంబంధించి అధికారిక ప్రకటన రాబోతోంది. ఇలా నవంబర్ 12వ తేదీ ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కాబోతుందనే విషయం తెలిసిన రజినీకాంత్ అభిమానులు మరి కాస్త ఆలస్యంగా ఈ సినిమాని డిజిటల్ స్ట్రీమింగ్ చేస్తే బాగుంటుందని థియేటర్లలో మంచి కలెక్షన్లను రాబడుతున్న సినిమాని అప్పుడే తొలగించడం ఏంటంటూ వారి అభిప్రాయాలను తెలియజేస్తూ కామెంట్లు చేస్తున్నారు.

హైయెస్ట్ కలెక్షన్లను సాధించిన జైలర్ 2..

ఇప్పటివరకు రజనీకాంత్ కెరియర్ లో ఈ స్థాయిలో ఏ సినిమా కూడా కలెక్షన్లను రాబట్టలేదని చెప్పాలి. ఈయన నటించిన జైలర్ సినిమా హైయెస్ట్ కలెక్షన్లను సొంతం చేసుకోగా ఇప్పుడు జైలర్ సినిమాకు జైలర్ 2 పోటీ పడటం విశేషం. ఇక కోలీవుడ్ ఇండస్ట్రీలోనే ఏ హీరో కూడా ఇప్పటివరకు 700 కోట్ల కలెక్షన్లను రాబట్టలేదని తెలుస్తోంది. ఈ ఘనత సాధించిన మొదటి హీరో కూడా రజనీకాంత్ కావటం విశేషం.

Advertisement

Also Read: ఏందయ్యా స్వామి ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్.. విరోష్ కెమిస్ట్రీ అదుర్స్!

Related News

 హర్రర్ నుంచి హీస్ట్ థ్రిల్లర్ వరకు ఈ వారం ఓటీటీలో మోస్ట్ అవైటింగ్ సినిమాలు… ఈ తెలుగు సినిమాలు మాత్రం అస్సలు మిస్ అవ్వొద్దు

This Week OTT Releases : ఓటీటీ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఆ ఒక్కటి మస్ట్ వాచ్..

జగపతిబాబు షోలో బాలయ్య రహస్యాలు రివీల్ చేసిన నారా లోకేష్!

ప్రేమ కోసం షోలోకి… కెమెరాలు ఆగాక వాళ్ల బంధాలు ఏమయ్యాయి ? క్రేజీ కొరియన్ సిరీస్

చక్రవర్తి సింహాసనానికే ఎసరు పెట్టే నింజాలు… ఒక్క సీక్రెట్ బయటకొస్తే బ్లడీ బ్లడ్ బాత్… యాక్షన్ తో ఇరగదీస్తున్న సిరీస్

సముద్రంలో చిక్కుకున్న అన్నదమ్ములు… ముంచేయడానికి దూసుకొచ్చే పెను తుఫాను… గూస్ బంప్స్ తెప్పించే సర్వైవల్ థ్రిల్లర్

సైంటిస్ట్‌ గా మారిన గొర్రె… ప్రయోగం బెడిసికొట్టి ఊర్లోకి వచ్చే భయంకరమైన మృగం… హాలోవిన్ అంతా రచ్చ రచ్చ

Big Stories

Advertisement
×