E-Paper
Advertisement

సైబర్ నేరగాళ్లు వాట్సాప్‌నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? అసలు కారణాలు ఇవే!

సైబర్ నేరగాళ్లు వాట్సాప్‌నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? అసలు కారణాలు ఇవే!
Advertisement

WhatsApp Scams: ప్రపంచవ్యాప్తంగా వందల కోట్ల మంది వినియోగించే అత్యంత ప్రజాదరణ పొందిన మెసేజింగ్ యాప్ వాట్సాప్ (WhatsApp). అయితే దీనికున్న ఈ విశేషమైన ఆదరణే సైబర్ నేరగాళ్లను కూడా ఇటువైపు ఆకర్షిస్తోంది. అమాయక వినియోగదారులను మోసం చేయడానికి హ్యాకర్లు వాట్సాప్‌ను ఒక ప్రధాన వేదికగా మలుచుకుంటున్నారు. దాని వెనుక ఉన్న అసలు కారణాలు ఏంటి? సైబర్ కేటుగాళ్ల నుంచి ఎలా బయటపడాలి? ఈ కథనంలో చూద్దాం.

అత్యధిక యూజర్లు

వాట్సాప్‌ను ప్రతిరోజూ అన్ని వయసుల వారు విరివిగా ఉపయోగిస్తున్నారు. స్మార్ట్‌ఫోన్ వాడకం బాగా పెరగడంతో పాటు సామాన్యుల నుంచి పెద్దల వరకు అందరికీ వాట్సప్ సులభంగా అందుబాటులో ఉంది. ఎక్కువ మంది ప్రజలు ఒకే చోట ఉన్నప్పుడు నేరస్థులు చూపు కూడా సహజంగానే అటు వైపు పడుతోంది. అందుకే అమాయక ప్రజలను హ్యాకర్లు లక్ష్యంగా చేసుకుంటున్నారు.

ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్

Advertisement

వాట్సాప్‌లో జరిగే చాట్లు పూర్తిగా ఎన్‌క్రిప్ట్ చేయబడి ఉంటాయి. అంటే ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకునే విషయాలు మూడో వ్యక్తికి కనిపించవు. ఈ భద్రతా ఫీచర్‌ను నేరగాళ్లు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. తాము పంపే మోసపూరిత సందేశాలు, లింక్‌లు అధికారుల నిఘా నుంచి సులభంగా తప్పించుకుంటాయని, తమ ఉచ్చు బయటపడదని వారు భావిస్తున్నారు.

నమ్మకమైన వాతావరణం

ఈమెయిల్‌లలో వచ్చే స్పామ్ మెసేజ్‌లను ప్రజలు అంతగా నమ్మరు. కానీ వాట్సాప్‌లో మనకు తెలిసిన బంధువులు, స్నేహితుల నుంచి మెసేజ్‌లు వస్తుంటాయి. ఈ నమ్మకాన్ని ఆసరా చేసుకుని హ్యాకర్లు.. ఇతరుల అకౌంట్లు హ్యాక్ చేసి వారి పేరుతోనే డబ్బులు అడగడం, నకిలీ లింక్‌లను పంపడం చేస్తున్నారు. మనవాళ్లే పంపారనే నమ్మకంతో బాధితులు త్వరగా మోసపోతున్నారు.

త్వరితగతిన స్పందించే స్వభావం

Advertisement

మనుషులు సాధారణంగా అత్యవసర పరిస్థితుల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు. ఈ మానసిక బలహీనతను సైబర్ నేరస్థులు ఆసరాగా తీసుకుంటున్నారు. ఆలోచించడానికి కూడా అవకాశం ఇవ్వకుండా క్షణాల వ్యవధిలో మోసాలకు పాల్పడుతున్నారు. ‘మీ అకౌంట్ బ్లాక్ అవుతుంది. వెంటనే ఈ లింక్ క్లిక్ చేయండి’, ‘మీకు లాటరీ తగిలింది’ లాంటి సందేశాలతో అమాయకులకు వల వేస్తున్నారు.

Also Read: బిఏ కుర్రాడి అద్భుతం.. యూట్యూబ్ చూసి ఎగిరే కారు ఆవిష్కరణ.. యావత్ దేశమే షాక్!

వాట్సాప్ మోసాలకు చెక్

వాట్సప్ లో పరిచయం లేని నంబర్ల నుంచి వచ్చే విచిత్రమైన లింక్‌లను, ఆఫర్ల మెసేజ్‌లను ఎట్టి పరిస్థితుల్లోనూ క్లిక్ చేయవద్దని నిపుణులు సూచిస్తున్నారు. అదే విధంగా వాట్సాప్ సెట్టింగ్స్‌లో టూ-స్టెప్ వెరిఫికేషన్‌ను ఎనేబుల్ చేసుకోవాలని సూచిస్తున్నారు. దీనివల్ల మీ అనుమతి లేకుండా ఎవరూ మీ అకౌంట్‌ను ఓపెన్ చేయలేరని స్పష్టం చేస్తున్నారు. మరోవైపు ఆధార్ నంబర్, బ్యాంక్ వివరాలు, ఓటీపీ (OTP) వంటి సున్నితమైన సమాచారాన్ని ఎవరికీ షేర్ చేయవద్దుని హితవు పలుకుతున్నారు. అటు స్నేహితులు, కుటుంబ సభ్యులు ఎవరైనా వాట్సాప్‌లో డబ్బులు అడిగితే.. నేరుగా ఫోన్ చేసి అది వారో కాదో కన్ఫామ్ చేసుకోవాలని హితవు పలుకుతున్నారు.

Also Read: రూ.25 వేల జీతమా? నెలకు ఎంత పొదుపు చేస్తే సేఫ్? నిపుణులు చెప్పే సూపర్ ప్లాన్ ఇదే!

Tags

Related News

బిఏ కుర్రాడి అద్భుతం.. యూట్యూబ్ చూసి ఎగిరే కారు ఆవిష్కరణ.. యావత్ దేశమే షాక్!

సినిమా థియేటర్‌ను ఇంటికే తెచ్చుకోండి..రూ.5వేలలోపే బెస్ట్ ప్రొజెక్టర్లు

ఆన్‌లైన్ క్లాసులు,ఆఫీస్ వర్క్ కోసం ఏసర్ క్రోమ్‌బుక్ లాంచ్- ధర ఎంతంటే?

రూ.736కే ట్రెండీ ఇయర్‌బడ్స్..ఫీచర్లు చూస్తే ఫిదా అవడం గ్యారంటీ

రూ.999కే బ్లూటూత్ సౌండ్‌బార్..ఈ ఆఫర్ అస్సలు మిస్సవ్వొద్దు!

మ్యూజిక్ లవర్స్‌కు గుడ్‌న్యూస్..రూ.949కే జెబ్రోనిక్స్ 20W స్పీకర్

రూ.1000లోపు బెస్ట్ స్మార్ట్‌వాచ్..కొంటే ఇలాంటి వాచ్ కొనాలి!

Big Stories

Advertisement
×