Bigg Boss 10:బిగ్ బాస్ సీజన్ 10 అలా ప్రారంభమైందో లేదో అప్పుడే అతడి పై తన ఇష్టాన్ని అందరి ముందు చెప్పి ఆశ్చర్యపరిచింది. అతడి కళ్ళు అంటే ఇష్టమని చెప్పింది. అతడి కోసం తాను వెంటపడుతుంటే.. అతడేమో తనను పట్టించుకోవడంలేదని, ఇంకొక అమ్మాయి కోసం పరుగులు పెడుతున్నాడు అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. హోస్ట్ నాగార్జున ముందు రియాలిటీ షోలో అందరూ చూస్తుండగానే కంటెంట్ కోసమైనా సరే ఒక అమ్మాయి తన ఇష్టాన్ని బయటపెట్టింది. కానీ అతడు ఇప్పుడు ఆమెపై చూపిస్తున్న ఆగ్రహం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అసలు అతనికి ఏమైంది ? అంటూ మండిపడుతున్నారు. మరి అసలు ఎందుకీ చర్చో ఇప్పుడు చూద్దాం.
బిగ్ బాస్ సీజన్ 10 ఎనిమిదో వారానికి సంబంధించిన నామినేషన్ ప్రక్రియ గట్టిగా సాగుతోంది. ముఖ్యంగా గోట్ గా నిలిచిన ఐదు మంది కంటెస్టెంట్స్ మిగిలిన కంటెస్టెంట్స్ ను నామినేట్ చేస్తున్నారు. రెండు వారాల ఇమ్యూనిటీ పొందిన గోట్ సభ్యులు హౌస్ లో పలు మార్పులు చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇకపోతే తాజాగా విడుదల చేసిన రెండవ ప్రోమోలో గోట్ సభ్యులలో ఒకరైన ముఖేష్ మరో గోట్ గా నిలిచిన దెబ్జానీ పై తన పవర్ చూపిస్తుండడం ఆశ్చర్యంగా అనిపిస్తోంది.
ప్రోమో విషయానికి వస్తే.. కిచెన్ రూమ్ లో ముఖేష్ మాట్లాడుతుండగా ఎవరికి వారు ఆయా డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఉన్నారు అని దెబ్జానీ చెప్పింది. అయితే ముకేష్ మాత్రం నువ్వు ఆగు కాసేపు అంటూ ఆమెను మాట్లాడకుండా అడ్డుకున్నాడు. ఇక దాంతో దేబ్జానీ మాటిమాటికీ ఎందుకు నన్ను ఆపుతున్నావ్ అని ప్రశ్నించగా.. మరి నువ్వు ఎందుకు ప్రతి దానికి మధ్యలోకి దూరుతున్నావ్ అంటూ అసహనం వ్యక్తం చేశాడు. అంతటితో ఆగకుండా బాగా కనిపించాలనుకుంటున్నావా ? లేక ఎందుకు ఇదంతా అంటూ ఆమెపై మండిపడ్డాడు. అటు శివ పై కూడా ఫైర్ అయ్యాడు. నేను, త్రిగుణ్ మాట్లాడుతుంటే.. మధ్యలో నీకెందుకు శివ అంటూ కూడా రెచ్చిపోయాడు.
ALSO READ:విజయ్ పై భారీ ట్రోల్స్.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన రష్మిక!
మరో గోట్ గా ఉన్న అమన్ మాట్లాడుతూ.. నాకు ఒక డిపార్ట్మెంట్ ఉంది. ఐదుగురుగా ఉన్న గోటు సభ్యులలో నేను కూడా ఒకడిని. ప్రతిసారి నన్ను మారిస్తే ఒప్పుకోను. ముఖేష్ ని ఇక్కడ ఉండమనండి నా డిపార్ట్మెంట్ నేను చూసుకుంటాను అంటూ గట్టిగా చెప్పేసాడు. ఇక లాండ్రీ ఏరియాకి వచ్చిన ముఖేష్ మిగతా వారిని ప్రశ్నిస్తూ ఒక్కొక్కరికి ఎన్ని కబోర్డ్స్ ఉన్నాయి అని అడగగా.. ఫోర్ అన్నారు .ఇక దేబ్జానీకి అంటే 5 అని చెప్పగా.. వెంటనే ఆమెకు ఒక కబోర్డ్ తీయించేశాడు. ఇక తర్వాత శివతో గొడవ పెట్టుకున్నాడు. మొత్తానికైతే ఈ ప్రోమో చూసిన తర్వాత అసలు ముఖేష్ కి ఏమైంది? ఎందుకు ఇంత అగ్రెసివ్ గా బిహేవ్ చేస్తున్నాడు అంటూ నెటిజన్స్ మండిపడుతున్నారు. ఏది ఏమైనా దేబ్జానినీ టార్గెట్ గా చేసుకొని అటు దేబ్జానీపై ఇటు శివ పై ముఖేష్ రెచ్చిపోవడం వైరల్ గా మారింది.