Tiger Shroff:బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ప్రత్యేకించి కొంతమంది సెలబ్రిటీలను టార్గెట్ గా చేసుకొని దుండగులు కాల్పులు జరుపుతున్న విషయం కలకలం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్ వంటి బడా హీరోల ఇళ్లపై , వారు ప్రయాణిస్తున్న వాహనాలపై కాల్పులు జరిపి బాలీవుడ్ ప్రజలను భయాందోళనలకు గురి చేశారు.. అయితే ఇప్పుడు టాలీవుడ్ యంగ్ హీరో టైగర్ ష్రాఫ్ (Tiger Shroff) ను టార్గెట్గా చేసుకొని ఆయన కారుపై పలు రౌండ్లు కాల్పులు జరిపి సంచలనం సృష్టించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. పలు బృందాలుగా విడిపోయి నేరస్తులను గాలించారు. అయితే ఈ గాలింపులో ఏకంగా ముగ్గురిని అరెస్టు చేయడం సంచలనంగా మారింది. అసలేం జరిగిందో ఇప్పుడు చూద్దాం.
అసలు విషయంలోకి వెళ్తే.. నిన్న రాత్రి 7:30 గంటల ప్రాంతంలో జుహూలో ఫుట్బాల్ ఆడి కారులో తిరుగు ప్రయాణమైన టైగర్ ష్రాఫ్ ను లక్ష్యంగా చేసుకొని.. దుండగులు కాల్పులు జరిపారు. ముఖ్యంగా ఫ్యాన్స్ కు అభివాదం చేస్తుండగా.. ఈ దాడి జరిగింది. ఈ సమయంలో దుండగుల తుపాకీ జామ్ కావడంతో అప్రమత్తమైన టైగర్ ష్రాఫ్ ప్రాణాపాయం నుండి తప్పుకున్నారు. పగిలిన అద్దాల ముక్కలు, గన్ పౌడర్ కారణంగా ఆయనకు అక్కడక్కడ స్వల్ప గాయాలవగా.. కారు డ్రైవర్ ఫిర్దౌస్, పక్కనే వెళ్తున్న ఆటో డ్రైవర్ గాయపడ్డారు. వెంటనే స్పందించిన టైగర్ ష్రాఫ్ స్వయంగా కారు నడుపుతూ వారిని ఆసుపత్రికి తరలించారు.
అయితే ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు రాజస్థాన్లోని కోట రైల్వే స్టేషన్ లో రైలులో పరారవుతున్న ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో హర్యానా సోనీ పట్ కి చెందిన 17 ఏళ్ల ఫూల్ సింగ్, ముంబై అంతేరీలో రాపిడో రైడర్ గా పనిచేస్తున్న బీహార్ కు చెందిన 22 ఏళ్ల రోషన్, హర్యానాకు చెందిన మరో యువకుడు 18 ఏళ్ల రెహాన్ గా గుర్తించారు. దాడికి ముందే వీరు సుమారు పది రోజులుగా టైగర్ ష్రాఫ్ నివాసాన్ని, ఆయన జిమ్ ను రెక్కీ చేసినట్లు దర్యాప్తులో తేలింది.
also read:డైరెక్టర్ పై సోనాలి క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు.. నిర్మానుష్య ప్రాంతంలో?
ఇకపోతే వరుసగా బాలీవుడ్ లో సెలబ్రిటీలపై కాల్పులు జరుగుతున్న లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ తో వీరికి ఏమైనా లింక్ ఉందా అనే కోణంలో పోలీసులు ఆరా తీయగా.. ఈ దాడి వెనుక వీరి ప్రమేయం ఉన్నట్లు ప్రాథమిక విచారణలోనే వెళ్లడయింది. బాలీవుడ్ సెలబ్రిటీలను లక్ష్యంగా చేసుకొని ముంబైలో భయాందోళన సృష్టించేందుకు ఈ గ్యాంగ్ కుట్ర పన్నినట్టు తెలుస్తోంది. దాడి వెనుక అసలు కోణాలతో పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. అతి తక్కువ సమయంలోనే నిందితులను పోలీసులు పట్టుకోవడం అభినందనీయం నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు.