Does 120Hz drain battery: ప్రస్తుతం మార్కెట్లో వస్తున్న ఏ స్మార్ట్ ఫోన్ చూసినా ‘120Hz రిఫ్రెష్ రేట్’ గురించే ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. సోషల్ మీడియా స్క్రోలింగ్ చేసేటప్పుడు, గేమ్స్ ఆడేటప్పుడు స్క్రీన్ చాలా స్మూత్‌గా పని చేయడానికి ఈ ఫీచరే కారణం. అయితే ఈ హై-ఎండ్ డిస్‌ప్లే వాడటం వల్ల ఫోన్ బ్యాటరీ చాలా త్వరగా అయిపోతుందనే అపోహ చాలా మందిలో ఉంది. ఇది నిజంగానే బ్యాటరీని ఎక్కువగా పీల్చుకుంటుందా? లేదా దీనివెనక వేరే టెక్నాలజీ ఉందా? అసలు నిజాన్ని ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
సాధారణంగా.. రెగ్యులర్ ఫోన్లలో 60Hz డిస్‌ప్లే ఉంటుంది. అంటే స్క్రీన్ ఒక సెకనుకు.. 60 సార్లు రిఫ్రెష్ అవుతుంది. అదే ..120Hz డిస్‌ప్లే అయితే సెకనుకు 120 సార్లు రిఫ్రెష్ అయ్యి అద్భుత మైన విజువల్ ఫీల్ ఇస్తుంది. ఎక్కువ సార్లు స్క్రీన్ రిఫ్రెష్ కావాలంటే.. ప్రాసెసర్‌పై, డిస్‌ప్లేపై కాస్త ఎక్కువ భారం పడుతుంది. అందువల్ల టెక్నాలజీ 120Hz వాడినప్పుడు 60Hz తో పోలిస్తే.. దాదాపు 15% నుంచి 20% వరకు బ్యాటరీ ఎక్కువ ఖర్చవుతుంది.
అయితే.. కంపెనీలు ఈ సమస్యకు చెక్ పెట్టడానికి ‘అడాప్టివ్ రిఫ్రెష్ రేట్’ లేదా ‘ఎల్‌టీపీఓ’ టెక్నాలజీని తీసుకొచ్చాయి. దీని వల్ల మీరు చదువుతున్నప్పుడు లేదా ఫోన్ టచ్ చేయకుండా .. ఉన్నప్పుడు రిఫ్రెష్ రేట్ ఆటోమేటిక్‌గా 1Hz లేదా 10Hz కి పడి పోతుంది. అదే.. మీరు గేమ్ ఆడుతున్నప్పుడు.. లేదా ఫాస్ట్‌గా స్క్రోల్ చేస్తున్నప్పుడు అది 120Hz కి మారుతుంది. దీని వల్ల బ్యాటరీ అనవసరంగా ఖర్చు కాకుండా చాలా వరకు ఆదా అవుతుంది.
మార్కెట్లో రూ. 15,000 నుంచి రూ. 1,00,000 పైబడిన ధరల్లో .. లభించే దాదాపు అన్ని స్మార్ట్‌ఫోన్లలో ఇప్పుడు 120Hz డిస్‌ప్లే కామన్ అయిపోయింది. దీనివల్ల కలిగే ప్లస్ మైనస్‌లు..
సూపర్‌ఫాస్ట్ స్మూత్‌నెస్: సోషల్ మీడియా యాప్స్ స్క్రోల్ చేసేటప్పుడు..లాగ్స్ లేకుండా చాలా ఈజీగా అనిపిస్తుంది.
గేమింగ్ ఫీల్: హై-ఎండ్ గేమింగ్ ఆడే వారికి విజువల్స్ చాలా క్లియర్‌గా, ఫాస్ట్‌గా కనిపిస్తాయి.
బ్యాటరీ ఖర్చు: మాన్యువల్‌గా ఎప్పుడూ 120Hz లోనే ఉంచితే.. మాత్రం బ్యాటరీ చాలా త్వరగా డ్రైన్ అవుతుంది.
మీ ఫోన్‌లో 120Hz డిస్‌ప్లే ఉన్నప్పటికీ.. బ్యాటరీ ఎక్కువ సేపు రావాలంటే కొన్ని చిన్న సెట్టింగ్స్ మార్చుకోవాలి.
అడాప్టివ్ మోడ్ వాడండి: మీ ఫోన్ సెట్టింగ్స్‌లో.. డిస్‌ప్లే ఆప్షన్‌కి వెళ్లి ‘అడాప్టివ్’ లేదా ‘డైనమిక్ రిఫ్రెష్ రేట్’ ఆన్ చేసుకోండి. అవసరమైనప్పుడు మాత్రమే ఇది 120Hz కి మారుతుంది.
Also Read: వింటర్‌లో కాలుష్యం నుంచి ఫుల్ సేప్టీ..ఏసీలో ఈ ఒక్క మోడ్ ఉంటే చాలు!
స్టాండర్డ్ మోడ్ ఎంచుకోండి: మీకు విజువల్స్ కంటే బ్యాటరీ లైఫ్.. చాలా ముఖ్యం అనుకుంటే.. సెట్టింగ్స్‌లో రిఫ్రెష్ రేట్‌ను 60Hzకి మార్చుకోవచ్చు.
డార్క్ మోడ్: ఎమోఎల్ఈడీ డిస్‌ప్లే ఉన్న ఫోన్లలో డార్క్ మోడ్ ఎనేబుల్ చేయడం వల్ల బ్యాటరీ చాలా వరకు ఆదా అవుతుంది.
120Hz డిస్‌ప్లే ఖచ్చితంగా సాధారణ డిస్‌ప్లే కంటే కాస్త ఎక్కువ బ్యాటరీని వినియోగిస్తుంది మాట వాస్తవమే. కానీ.. టెక్నాలజీ , స్మార్ట్ సాఫ్ట్‌వేర్ ఆప్టిమైజేషన్ కారణంగా ఆ తేడా ఇప్పుడు చాలా వరకు తగ్గింది. కొద్ది పాటి జాగ్రత్తలు పాటిస్తే.. బ్యాటరీ టెన్షన్ లేకుండానే 120Hz స్మూత్ ఫీల్ ఉంటుంది.