Remove moisture from phone camera: వర్షా కాలంలో ఫోన్ పట్టుకుని.. బయటకు వెళ్లినప్పుడు లేదా తుంపర్లలో ఫోటోలు తీస్తున్నప్పుడు అనుకోకుండా కెమెరా లెన్స్ లోపలికి తేమ చేరడం కామన్. ఫోన్ వాటర్‌ప్రూఫ్ అయినప్పటికీ.. ఒక్కోసారి క్లైమేట్‌లో ఉండే తేమ వల్ల కెమెరా లెన్స్ లోపల పొగ మంచులాగా మసకగా మారి పోతుంది. దీని వల్ల ఫోటోలు అస్సలు క్లియర్‌గా రావు. ఈ సమస్య వచ్చినప్పుడు కంగారు పడి సర్వీస్ సెంటర్లకు పరుగులు తీయాల్సిన పని లేదు. ఇంట్లోనే రూపాయి ఖర్చు లేకుండా.. కెమెరాలోని తేమను ఈజీగా పోగొట్టే ట్రెండీ హ్యాక్స్ ఇప్పుడు చూద్దాం.
స్మార్ట్ ఫోన్ కెమెరా లెన్స్ లోపల నీటి చుక్కలు లేదా తేమ చేరినప్పుడు దాన్ని నిర్లక్ష్యం చేస్తే..కెమెరా సెన్సార్ శాశ్వతంగా పాడై పోయే ప్రమాదం ఉంది. కాబట్టి వెంటనే.. స్పందించి ఈ కింద తెలిపిన పద్ధతులను పాటించండి.
ఇది తరతరాలుగా వస్తున్న అత్యంత ప్రజాదరణ పొందిన పద్ధతి. బియ్యానికి గాలిలోని తేమను పీల్చుకునే అద్భుతమైన శక్తి ఉంటుంది. ముందుగా ఫోన్‌ను పూర్తిగా స్విచ్ ఆఫ్ చేయండి. తర్వాత ఒక బాక్స్ లేదా కంటైనర్‌లో పొడిగా ఉన్న బియ్యాన్ని నింపి, అందులో ఫోన్‌ను పూర్తిగా మునిగిపోయేలా పెట్టండి. కనీసం 12 నుంచి 24 గంటల పాటు ఫోన్‌ను అలాగే ఉంచండి. బియ్యం కెమెరా లోపలి తేమను పూర్తిగా పీల్చేస్తుంది.
బియ్యం కంటే కూడా అత్యంత వేగంగా, సమర్థవంతంగా పని చేసే చిట్కా ఇది. మనం కొత్త బూట్లు, వాటర్ బాటిల్స్ లేదా ఎలక్ట్రానిక్ వస్తువులు కొన్నప్పుడు అందులో చిన్న తెల్లటి సిలికా జెల్ ప్యాకెట్లు వస్తాయి. ఒక ఎయిర్ టైట్ కంటైనర్‌లో మీ ఫోన్‌తో పాటు 4 లేదా 5 సిలికా జెల్ ప్యాకెట్లను ఉంచండి. ఇవి చాలా వేగంగా కెమెరా లెన్స్ లోపలి తడిని పీల్చుకుంటాయి. మార్కెట్‌లో లేదా ఆన్‌లైన్‌లో సిలికా జెల్ ప్యాకెట్ల సెట్ సుమారు రూ. 100 నుండి రూ. 200 లభ్యం అవుతుంది.
కెమెరాలో.. తేమ చాలా తక్కువగా ఉంటే, ఫోన్‌ను స్విచ్ ఆఫ్ చేసి ఒక కాటన్ క్లాత్‌పై ఉంచి ఫ్యాన్ గాలికి లేదా ఉదయాన్నే.. వచ్చే మైల్డ్ సూర్యరశ్మిలో 15-20 నిమిషాలు ఉంచవచ్చు. అయితే విపరీతమైన ఎండలో ఉంచకూడదు.
కెమెరాలోని తేమను వేగంగా పోగొట్టాలనే.. కంగారులో చాలామంది కొన్ని తప్పులు చేస్తుంటారు. ఇవి ఫోన్‌ను పూర్తిగా పాడుచేస్తాయి.
హెయిర్ డ్రైయర్ : హెయిర్ డ్రైయర్ నుంచి వచ్చే విపరీతమైన వేడి గాలి వల్ల ఫోన్ లోపలి ప్లాస్టిక్ భాగాలు, కెమెరా గ్లూ కరిగిపోయే ప్రమాదం ఉంది.
మైక్రోవేవ్ లేదా ఓవెన్‌లో పెట్టకూడదు: ఇది ఫోన్ పేలిపోవడానికి కారణమవుతుంది.
టూత్‌పిక్స్ లేదా సూదులు : కెమెరా గ్లాస్‌ను గీకడం లేదా సర్క్యూట్‌లను దెబ్బతీయడం జరుగుతుంది.
Also Read: వింటర్‌లో కాలుష్యం నుంచి ఫుల్ సేప్టీ..ఏసీలో ఈ ఒక్క మోడ్ ఉంటే చాలు!
వాటర్‌ప్రూఫ్ పౌచ్‌లు : వర్షాకాలంలో బయటకు వెళ్లేటప్పుడు ఫోన్‌ను ఇందులో ఉంచితే నీరు లోపలికి వెళ్లకుండా ఉంటుంది. దీని ధర సుమారు రూ. 150 నుంచి రూ. 300 వరకు ఉంటుంది.
లేయర్ క్లీనింగ్ కిట్ : మైక్రోఫైబర్ క్లాత్ , క్లీనింగ్ సొల్యూషన్ ఉన్న కిట్స్ సుమారు రూ. 200 నుంచి రూ. 500 బడ్జెట్‌లో లభిస్తాయి.
ఒకవేళ ఈ పద్ధతులన్నీ పాటించిన తర్వాత కూడా కెమెరా లోపల నీటి చుక్కలు అలాగే ఉంటే.. ఫోన్ మదర్‌బోర్డ్ పాడవకుండా.. ఉండటానికి దగ్గరలోని అధికారిక సర్వీస్ సెంటర్‌కు తీసుకెళ్లడం మంచిది. సర్వీస్ సెంటర్‌లో గ్లాస్ క్లీనింగ్ చేయడానికి .. మోడల్‌ను బట్టి సుమారు రూ. 300 నుంచి రూ. 800 వరకు ఛార్జ్ చేస్తారు.