E-Paper
Advertisement

Top 20 News: చంద్రబాబు పై విచారణ వాయిదా..ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు మెయిల్

Top 20 News: చంద్రబాబు పై విచారణ వాయిదా..ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు మెయిల్

1. పెరుగుతున్న కాలుష్యాన్ని రైతులపై నెట్టదు: సుప్రీమ్ కోర్ట్

దేశ రాజధాని ఢిల్లీ, పరిసర ప్రాంతాల్లో వాయు కాలుష్యం తీవ్రస్థాయిలో ఉంది. ఢిల్లీలో వాయు కాలుష్యంపై విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. దేశరాజధానిలో పెరుగుతున్న వాయు కాలుష్యానికి రైతులను నిందించడం సరికాదని పేర్కొంది. పంట వ్యర్థాల దహనాన్ని రాజకీయం చేయొద్దని..దాన్ని అహంకారానికి సంబంధించిన విషయంగా పరిగణించకూడదని సూచించింది.పంట దహనం చేయకూడదంటే వ్యర్థాలను తొలగించడానికి వారి వద్ద యంత్రాలు కూడా ఉండాలని పేర్కొంది.

2. రెండేళ్లు పూర్తి చేసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం, బహిరంగ సభ ఏర్పాట్లు

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో రేపు జరగనున్న సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభ ఏర్పాట్లను మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈ సభ ఏర్పాటు చేశామన్నారు. విద్య, వ్యవసాయం, ఉపాధి రంగాల్లో హుస్నాబాద్ గ్రామీణ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని తెలిపారు. తాము తెలంగాణ రైజింగ్ విజన్‌తో రాష్ట్ర అభివృద్ధికి ప్రణాళికతో ముందుకెళ్తున్నామని మంత్రి పొన్నం పేర్కొన్నారు.

3. చంద్రబాబు పై విచారణ వాయిదా

సీఎం చంద్రబాబు, మంత్రి నారాయణపై సీఐడీ కేసు కొట్టేయాలని దాఖలైన పిటిషన్లపై విచారణ ఈ నెల 10కి వాయిదా పడింది. పిటిషనర్ల తరఫు న్యాయవాది, ఫిర్యాదుదారు తరఫున పొన్నవోలు సుధాకర్రెడ్డి హాజరుకావడాన్ని వ్యతిరేకించారు. పొన్నవోలు గతంలో సీఐడీ తరఫున వాదనలు వినిపించినందున, ఇప్పుడు ఫిర్యాదుదారు తరఫున హాజరుకావడంపై కోర్టు స్పందించింది.

4. నర్సీపట్నం అగ్ని ప్రమాదంలో లక్షల్లో ఆస్తి నష్టం

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అగ్ని ప్రమాదం జరిగింది. శారదా నగర్ పోస్ట్ ఆఫీస్ ఎదురుగా ఉన్న భవనంలో మంటలు చెలరేగడంతో భవనం మొత్తం దట్టమైన పొగ వ్యాపించింది. స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ప్రమాదంలో లక్షల్లో ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

5. ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు మెయిల్

కువైట్ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు రావాల్సిన ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. మరికాసేపట్లో శంషాబాద్ లో ల్యాండ్ కావాల్సిన విమానాన్ని.. ముంబైకి దారి మళ్లించారు. ఇండిగో విమానం అర్ధరాత్రి ఒకటిన్నరకు కువైట్ లో బయల్దేరింది.

6. స్కూటీపై వెళ్తున్న యువతిపై రసాయన దాడి

హన్మకొండలో యువతిపై రసాయన దాడి జరిగింది. కాజీపేట మండలం కడిపికొండ గ్రామ పంచాయతీ వద్ద ఘటన చోటుచేసుకుంది. హన్మకొండలో బీఎస్సీ నర్సింగ్ చదువుతున్న యువతి సునంద.. స్కూటీపై వెళ్తుండగా తన కాళ్లపై ఏదో ద్రవం పడినట్లు గుర్తించి బంధువులకు సమాచారం ఇచ్చింది. చికిత్స కోసం ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు బంధువులు. వైద్యులు.. ప్రాణాపాయం లేదని తేల్చారు. యువతి ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు పోలీసులు.

7. వైద్య కళాశాలలో ర్యాగింగ్ కలకలం

ఏలూరు వైద్య కళాశాలలో ర్యాగింగ్ కలకలం రేగింది. సీనియర్లకు, జూనియర్లకు అర్ధరాత్రి గొడవ జరిగింది. సీనియర్లు 15 మంది వేధిస్తున్నారని.. జూనియర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ర్యాగింగ్ ఇష్యూపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తామని పోలీసులు చెబుతున్నారు.

8. పోలీస్ కమిషనర్ పేరుతో సైబర్ మోసం

సిద్దిపేట సీపీ విజయ్ కుమార్ పేరుతో సైబర్ నేరగాళ్లు నకిలీ ఫేస్‌బుక్ ఖాతాను సృష్టించారు. సీపీ ఫోటో పెట్టి ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు పంపుతూ, ఆ తరువాత మెసెంజర్‌లో కాంటాక్ట్ నంబర్ అడుగుతూ మోసానికి ప్రయత్నిస్తున్నారు సైబర్ నేరగాళ్లు. ఈ విషయం తెలుసుకున్న సీపీ విజయ్ కుమార్, ఎవరూ స్పందించవద్దని, సైబర్ క్రైమ్ పోలీసులకు సమాచారం అందించానని సూచించారు.

9. సిరిసిల్ల జిల్లా గొల్లపల్లి గ్రామ పంచాయతీ ఓటర్ల సమస్య తీరింది

రాజన్న సిరిసిల్ల జిల్లా గొల్లపల్లి గ్రామ పంచాయతీలో ఓటర్ల సమస్య పరిష్కారం కావడంతో ఏడేళ్ల ప్రత్యేక అధికారి పాలనకు తెరపడింది. 12 సంవత్సరాల తర్వాత తమ ఓటర్లను తిరిగి తమ పంచాయతీలో కలపడంతో గ్రామస్థులు సంతోషంగా ఉన్నారు. 622 మంది ఓటర్లు ఉన్న ఈ పంచాయతీని ఎస్సీ మహిళకు కేటాయించారు. ఈ నెల 14న జరిగే ఎన్నికలకు సిద్ధమవుతున్నట్లు గ్రామస్థులు తెలిపారు.

10. తల్లి మరణాన్ని తట్టుకోలేక డిప్రెషన్ లోకి వెళ్లిన యువతీ

కరీంనగర్‌‌ స్మశానంలో ఒక హృదయ విదారక ఘటన వెలుగుచూసింది. తల్లి మరణాన్ని తట్టుకోలేకపోయిన ఓ యువతి, గత మూడు రోజులుగా ఆమె సమాధి వద్దే పగలూ రాత్రీ తేడా లేకుండా నిద్రిస్తోంది. దీంతో కుటుంబ సభ్యులు, స్థానికులు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. యువతి తీవ్రమైన డిప్రెషన్‌లోకి వెళ్లిందని భావిస్తున్నారు. ఈ పరిస్థితి మానసిక ఒత్తిడా లేక మతి భ్రమణమా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. యువతికి తగిన రక్షణ, వైద్యం అందించాలని, ముఖ్యంగా షీ టీమ్స్, సఖి టీం, మహిళా సంక్షేమ అధికారులు వెంటనే జోక్యం చేసుకోవాలని మానవతావాదులు కోరుతున్నారు.

11. రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వాహనం తనిఖీ

రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి చెక్ పోస్ట్ వద్ద వేములవాడ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వాహనాన్ని అధికారులు తనిఖీ చేశారు. పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున, అధికారులు ఈ తనిఖీలు చేపట్టారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అధికారులకు పూర్తిగా సహకరించారు.

12. ఇంటర్ ద్వితీయ సంవస్తరం చదువుతున్న విద్యార్ధి ఆత్మహత్య

హైదరాబాద్‌లోని బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం నెలకొంది. ప్రగతి జూనియర్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న మంజునాథ్(18) ఆత్మహత్య చేసుకున్నారు. తన నివాసంలో ఉరేసుకుని మంజునాథ్ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించి, దర్యాప్తు చేపట్టారు.

13. నిర్లక్ష్యం కారణంగా వైద్యులను సస్పెండ్ చేసిన ఉన్నతాధికారులు

తూర్పు గోదావరి జిల్లా తుని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఓ యువకుడికి ఆర్ధోపెడిక్ డాక్టర్ సత్యసాగర్ ఈనెల 27న సర్జరీ చేశారు. లోపల ఉన్న స్క్రూను తొలగిస్తూ.. ఉపయోగించిన సర్జికల్ బ్లేడును పొరపాటున లోపలే వదిలేశారు. మళ్లీ నొప్పి పెరగడంతో ఎక్స్‌రే తీయగా ఈ విషయం బయటపడింది. బాధ్యతారహితంగా వ్యవహరించిన డాక్టర్ సత్యసాగర్, నర్సు పద్మావతిని సస్పెండ్ చేశారు ఉన్నతాధికారులు. ఈ ఘటనపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని మంత్రి ఆదేశించారు.

14. చిన్నారి మహన్విత కేసులో ఇద్దరు నిందితులు అరెస్ట్

మంచిర్యాల జిల్లా నంబాల గ్రామంలో చిన్నారి మహన్విత అత్యాచారం, హత్య కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు డీసీపీ భాస్కర్ వెల్లడించారు. శనిగారపు బాపు, ఉపారపు సతీష్ అనే ఈ నిందితులు చిన్నారిని పత్తి చేనులో అత్యాచారం చేసి, విషయం బయటపడుతుందనే భయంతో గొంతు నులిమి బావిలో పడేశారని తెలిపారు. హంతకులపై పోక్సో కేసు నమోదు చేశామని, ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ద్వారా త్వరగా శిక్ష పడేలా చేస్తామని డీసీపీ స్పష్టం చేశారు.

15. కడప జిల్లా రోడ్డు సేఫ్టీపై అధికారులతో ఆర్డీవో చంద్రమోహన్ సమీక్ష సమావేశం

కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని ఆర్డీఓ కార్యాలయంలో రోడ్డు సేఫ్టీపై అధికారులతో ఆర్డీవో చంద్రమోహన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రమాదాలు జరిగే బ్లాక్ స్పాట్‌లను గుర్తించి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రధాన రహదారులపై, ముఖ్య కూడళ్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి, ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమిస్తే ఆటోమేటిక్‌గా చలానా జనరేట్ అయ్యేలా సిస్టమ్‌ను అప్డేట్ చేయాలని సూచించారు.

16. పరకామణి కేసు నివేదికను నేడు హైకోర్టుకు సమర్పించనున్నా సీఐడీ డీజీ రవిశంకర్ అయ్యనార్

టీటీడీ పరకామణి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించిన నివేదికను నేడు హైకోర్టుకు సమర్పించనున్నారు సీఐడీ డీజీ రవిశంకర్ అయ్యనార్. అక్టోబర్ 27న హైకోర్టు ఆదేశాలతో పరకామణి కేసుకు సంబంధించి విచారణ చేపట్టారు CID అధికారులు. ఇప్పటి వరకు ఈ కేసులో మొత్తం 35 మందిని CID అధికారులు విచారించారు.

17. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం దౌత్య చర్చలను స్వాగతించిన ఫ్రాన్స్

పారిస్‌లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మెక్రాన్‌ భేటీ అయ్యారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై ఊపందుకుంటున్న దౌత్య చర్చలను స్వాగతించారు. ఈ చర్చలు శాంతికి, ఐరోపా భద్రతకు కీలకం అన్నారు. అయితే చర్చలు జరుగుతున్నప్పటికీ రష్యా దాడులు ఆపకపోవడాన్ని విమర్శించారు. ఉక్రెయిన్ సార్వభౌమాధికారం గురించి చర్చించే హక్కు ఆ దేశానికి మాత్రమే ఉంటుందని స్పష్టం చేశారు.

18. మల్లికార్జున ఖర్గేకు పార్లమెంట్ వార్నింగ్

రాజ్యసభ ఛైర్మన్‌గా ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్‌కు కాంగ్రెస్ పక్ష నేత మల్లికార్జున ఖర్గే స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాజీ ఛైర్మన్ ధన్‌ఖడ్‌ ఆకస్మిక రాజీనామా, వీడ్కోలు లేకపోవడంపై ప్రశ్నించారు. దీనిపై అధికారపక్ష సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో సభలో వాగ్వాదం చోటుచేసుకుంది. ఖర్గే ఇరుపక్షాల సమతుల్యత పాటించాలని కొత్త ఛైర్మన్‌ను కోరారు.

19. రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ కచ్చితంగా 2027 వన్డే వరల్డ్‌ కప్‌లో ఆడుతారు: కృష్ణమాచారి శ్రీకాంత్

భారత స్టార్‌ క్రికెటర్లు.. రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ కచ్చితంగా 2027 వన్డే వరల్డ్‌ కప్‌లో ఆడుతారని మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ అన్నారు. అందులో సందేహమే అక్కర్లేదని తెలిపారు. రాంచి వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మొదటి వన్డే మ్యాచ్‌లో రో-కో జోడీ అద్భుత ప్రదర్శన చేసిన ఈ నేపథ్యంలోనే కృష్ణమాచారి శ్రీకాంత్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.

20. అనారోగ్యంతో ఉన్న సినిమా కోసం పని చేశా: ఆషికా రంగనాథ్

రవితేజ, కిశోర్‌ తిరుమల కాంబోలో వస్తున్న ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో నటి ఆషికా రంగనాథ్ తన డ్యాన్స్ కోరిక తీరిందని తెలిపారు. ఈ సినిమా సంక్రాంతికి విడుదల కానుంది. ముగింపు దశలో ఉన్న ఈ చిత్రం నుంచి సోమవారం తొలి గీతాన్ని విడుదల చేశారు. అభిమానులను చూడడం కోసం ఆరోగ్యం బాగాలేకపోయినా బెంగళూరు నుంచి రాజమండ్రి వచ్చినట్లు చెప్పారు ఆశికా రంగనాథ్.

Tags

Related News

ఉదయం లేవగానే అలసట, కాళ్ల నొప్పులు ఎందుకు వస్తాయో తెలుసా ?

Intinti Ramayanam TRP Rating : ‘ఇంటింటి రామాయణం’ టీఆర్పీ రేటింగ్.. మే హైలెట్ ఎపిసోడ్స్..

Brahmamudi Serial Today Episode May 26th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రాజుకు షాక్ ఇచ్చిన ఇందు

తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరడం ఖాయం.. ఎంపీ ఈటల రాజేందర్ ధీమా

ఎంత స‌తాయిస్తే.. అంత విజ‌య్‌కే మేలు.. ! దేశం మొత్తం త‌ల‌ప‌తి స్థితిపై సానుభూతి!!

మంత్రి హోదాలో తుమ్మల 40 వసంతాల వేడుక!

Podarillu Today Episode : నారాయణకు దిమ్మతిరిగే షాక్.. డ్యాన్స్ లతో సందడి.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రతాప్..

జేమ్స్ కామెరాన్‌కు గట్టి ఎదురుదెబ్బ.. అవతార్ లాభాల్లో వాటా డిమాండ్ చేస్తున్న నటి

Big Stories

×