E-Paper
Advertisement

Chandrahas: ఆస్టార్ హీరోయిన్ తో పెళ్లి.. యాటిట్యూడ్ స్టార్ కోరికలు మామూలుగా లేవుగా!

Chandrahas: ఆస్టార్ హీరోయిన్ తో పెళ్లి.. యాటిట్యూడ్ స్టార్ కోరికలు మామూలుగా లేవుగా!
Advertisement

Chandrahas: చంద్రహాస్ పేరు చెబితే గుర్తుపట్టరు కానీ యాటిట్యూడ్ స్టార్ట్ అంటే మాత్రం టక్కున గుర్తుకొస్తాడు. ప్రముఖ బుల్లితెర నటుడు ప్రభాకర్ కొడుకుగా చంద్రహాస్ ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఇదివరకే పలు సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చంద్రహాస్ (Chandrahas)మొదటి సినిమాతోనే యాటిట్యూడ్ స్టార్ అనే ట్యాగ్ సొంతం చేసుకున్నారు. ఇక ఈయన నటించిన సినిమాలు పెద్దగా ప్రేక్షకులను కూడా ఆకట్టుకోలేకపోయాయి. ఇలా సినిమాలో నిరాశపరిచిన మాత్రం వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. త్వరలోనే బారాబర్ ప్రేమిస్తా(barabar premistha) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేస్తున్నారు. ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఈయన అరియనాతో కలిసి ఒక ఇంటర్వ్యూ నిర్వహించారు.

అనుపమను రిజెక్ట్ చేసిన యాటిట్యూడ్ స్టార్..

ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోలో భాగంగా అరియానా హీరో చంద్రహాస్ ను ప్రశ్నిస్తూ ముగ్గురు హీరోయిన్ల పేరు చెప్పారు అనుపమ పరమేశ్వరన్, మృణాళ్, శ్రీ లీల. ఈ ముగ్గురు పేర్లను చెబుతూ ఇందులో మీరు ఎవరిని రిజెక్ట్ చేస్తారు, ఎవరితో డేట్ వెళ్తారు, ఎవరిని పెళ్లి చేసుకుంటారు అనే ప్రశ్న వేశారు. ఈ ప్రశ్నకు చంద్రహాస్ సమాధానం చెబుతూ.. అనుపమ పరమేశ్వరన్ రిజెక్ట్ అంటూ షాకింగ్ విషయాన్ని తెలిపారు.

శ్రీలీలను పెళ్లి చేసుకుంటా..

Advertisement

ఇక డేటింగ్ వెళ్లాల్సి వస్తే ఖచ్చితంగా మృణాళ్ ఠాకూర్ తో వెళ్తానని తెలియజేశారు. ఇక పెళ్లి విషయానికి వస్తే శ్రీ లీల(Sreeleela)ను పెళ్లి చేసుకుంటాను అంటూ చంద్రహాస సమాధానం చెప్పడంతో ఈ కామెంట్స్ కాస్త వైరల్ అవుతున్నాయి. అసలు శ్రీ లీలనే ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు అంటూ మరో ప్రశ్న కూడా వేశారు. తన ఏజ్ తో పాటు శ్రీ లీల ఏజ్ కూడా సమానం కావడంతో ఏ విషయాన్ని అయినా ఒకే విధంగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటాము కాబట్టి శ్రీ లీలను పెళ్లి చేసుకుంటాను అంటూ క్లారిటీ కూడా ఇచ్చారు. ఇలా పెళ్లి గురించి చంద్రహాస్ ఈ సందర్భంగా చేసిన కామెంట్స్ వైరల్ గా మారడంతో సోషల్ మీడియా వేదికగా ఈయన కామెంట్లపై విభిన్న రీతిలో స్పందిస్తున్నారు.

బూతులతో పాట పాడిన యాటిట్యూడ్ స్టార్..

Advertisement

ఇకపోతే ఇటీవల చంద్రహాస్ ఈ సినిమా ఈవెంట్ లో భాగంగా సింగర్ గా మారి ఒక పాట పాడిన సంగతి తెలిసిందే . ఈ పాట మొత్తం బూతులు ఉండడంతో సోషల్ మీడియా వేదికగా మరోసారి ట్రోల్స్ ఎదుర్కొంటున్నారు. ఇలా ఎప్పటికప్పుడు తన వ్యవహార శైలితో విమర్శలను ఎదుర్కొంటున్నారు. ఇదివరకే చంద్రహాస్ రామ్ నగర్ బన్నీ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. మరి ఫిబ్రవరి ఆరో తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న బారాబర్ ప్రేమిస్తా ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందనేది తెలియాల్సి ఉంది.

Also Read: Bhartha Mahasayulaku Wignyapthi:  రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి ఓటీటీ స్ట్రీమింగ్..ఎప్పుడంటే?

Related News

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

38ఏళ్ల తర్వాత తండ్రి నాగబాబు రికార్డును రిపీట్ చేసిన నిహారిక!

సైలెంట్ గా నిశ్చితార్థం.. పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ హీరో!

కళ్ళు లేవు.. మైమరిపించే గాత్రానికి నేషనల్ అవార్డు.. ఎవరీ సింగర్?

విజువల్ వండర్ గా రామాయణ ట్రైలర్.. అఫీషియల్ ఎప్పుడంటే?

Big Stories

Advertisement
×