Tirumala: తిరుమలలో ఈ సంవత్సరం అద్బుతం జరగనుంది. ఆ అద్బుతం చూడటానికి లక్షలాది మంది భక్తులు తిరుమలకు క్యూ కట్టనున్నారు. ఇంతకీ ఆ అద్బుతం ఏంటి..? దాని స్పెషల్ ఏంటి..? ఎప్పుడు జరుగుతుంది. లాంటి ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు ఈ కథనంలో తెలుసుకుందాం.
భువి మీద వెలిసిన వైకుంఠమే తిరుమల. సాక్ష్యాత్తు శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవి సమేతుడై వెలిసిన దివ్యమైన కొండలు తిరుమల కొండలు. ప్రతి నిత్యం తిరుమల కొండల్లో స్వామి వారి అద్బుతాలు భక్తులకు తారసపడుతూనే ఉంటాయి. తిరుమలలో జరిగే ప్రతి కేంకర్యమూ ఒక అద్బుతమనే చెప్పాలి. అలాంటి తిరుమలలో ఈ సంవత్సరం ఒక అద్బుతమైన ఘట్టం ఆవిష్కృతం కానుంది. ప్రతి ఏటా కాకుండా కొన్ని సంవత్సరాలకు ఒకసారి ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే తెలుగు పంచాగంలో అధికమాసం వచ్చిన సంవత్సరం జరిగే అద్బుతమైన ఘట్టం ఈ సంవత్సరం ఆవిష్కృతం కానుంది. ఇంతకీ ఆ అద్బుతం ఏంటో..? ఏం జరగబోతుందో తెలుసుకుందాం.
సాధారణంగా స్వామి వారికి ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలు ఒకసారి మాత్రమే నిర్వహిస్తారు. కానీ ఈ సంవత్సరం బ్రహ్మోత్సవాలు రెండు సార్లు నిర్వహించనున్నారు. అది కూడా ఒక నెల వ్యవధిలోనే అందుకే ఈ సంవత్సరం తిరుమల కొండ మీద అద్బుతం ఆవిష్కృతం కానుందని భక్తులు ఆనందం పడుతున్నారు. అయితే ఇలా నాలుగేళ్లకోసారి జరగడం సహజమేనని పండితులు చెప్తున్నారు. ఇలా జరిగే బ్రహ్మోత్సవాలను సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంటారట.
ఏదైనా సంవత్సరంలో శ్రీవారి బ్రహ్మోత్సవాలను రెండు సార్లు నిర్వహిస్తే వాటిని సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంటారు. ఈ సంవత్సరం బ్రహ్మోత్సవం రెండుసార్లు నిర్వహిస్తారు.. సెప్టెంబర్ లో సాలకట్ల బ్రహ్మోత్సవాలు అక్టోబర్లో నవరాత్రి బ్రహ్మోత్సవాలు. నిర్వహిస్తారు. ఇది మహంతుల కాలంలో ఏర్పడిన నామం. మహంతులు ఉత్తర భారతీయులు. “సాల్” అంటే హిందీ లో సంవత్సరం. ఈ పదం “సాలుకు” ,’సాలీనా” వంటి పదాల లో సమానార్ధకం గా వాడబడుతూ మనకు కనిపిస్తుంది. కట్ల అనేది కట్టడి అనే దాని నుంచి వచ్చినదిగా కొందరి భావన. సాల్ కట్ల అంటే సంవత్సరం లో సంప్రదాయం గా పాటించబతున్న అని మనం అనుకోవచ్చు. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ లో వచ్చే (కన్యారాశి లో శ్రవణా నక్షత్రం రోజున) బ్రహ్మోత్సవం నే వార్షిక బ్రహ్మోత్సవం లేదా సాలుకట్ల బ్రహ్మోత్సవం ఇంకా నిజ బ్రహ్మోత్సవం అంటారు. అదే ఆశ్వయుజ మాస శ్రవణా నక్షత్రం అంటే ఇంచుమించు అక్టోబర్ నెలలో అమ్మవారి నవరాత్రుల సమయం లో వచ్చేది అధిక మాస బ్రహ్మోత్సవం .దీనిని నవరాత్రి బ్రహ్మోత్సవం అంటారు.
అధిక మాసం ఎలా నిర్ణయం అవుతుంది అంటే సౌరమానం లో 365 రోజులకు ఒక సంవత్సరం అయితే చంద్రమానం లో 354 రోజులకు ఒక ఏడాది. ఇలా వ్యత్యాసం ఉన్న పదకొండు రోజులను మూడేళ్ళ తరవాత లెక్కేస్తే ఒక నెల అధికం గా కలుస్తుంది.అప్పుడు రెండు పద్దతుల్లో రోజుల సంఖ్యా సమం అవుతుంది. ఇలా అధికంగా వచ్చే చంద్రమాన మాసాన్ని అధిక మాసం అంటారు. ఇది 2017, 2020,2023 లో వచ్చింది. మళ్లీ ఇప్పుడు ఈ సంవత్సరం 2026 లో వస్తుంది.
వార్షిక బ్రహ్మోత్సవాల్లో ధ్వజారోహణ, అవరోహణ ఉంటే నవరాత్రి ఉత్సవాల్లో ఉండవు. వార్షిక బ్రహ్మోత్సవాల్లో కొయ్యరథం రథోత్సవాల్లో వాడితే నవరాత్రి ఉత్సవాల్లో బంగారు రధం మాత్రమే వాడతారు. వార్షిక బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజూ వాహన సేవ తర్వాత విగ్రహాలని తిరుమలరాయ మండపం లో ఉంచి పల్లకి ఉత్సవం చేస్తారు. నవరాత్రి ఉత్సవాల్లో రంగ నాయకుల మండపంలో ఉంచుతారు.