Bhartha Mahasayulaku Wignyapthi: సంక్రాంతి పండుగ సందర్భంగా టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి ఎన్నో సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇలా తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ఏకంగా ఐదు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాగా ఈ సినిమాలన్నీ కూడా మంచి విజయాలను సొంతం చేసుకున్నాయి. ఇలా సంక్రాంతి బరిలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమాలలో మాస్ మహారాజ రవితేజ(Raviteja) హీరోగా నటించిన భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా కూడా ఒకటి ఈ సినిమా సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జనవరి 13వ తేదీ విడుదల అయింది. ఈ సినిమా అనుకున్న స్థాయిలో కాకపోయినా పరవాలేదు అనిపించుకుంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా థియేటర్ రన్ పూర్తి చేసుకుందని త్వరలోనే డిజిటల్ స్ట్రీమింగ్ కాబోతోందని తెలుస్తోంది.
ఇప్పటికే సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలైన సినిమాలన్నీ కూడా డిజిటల్ మీడియాలో ప్రసారానికి సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి(BMW) కూడా త్వరలోనే డిజిటల్ స్ట్రీమింగ్ కాబోతోందని సమాచారం. ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5(Zee 5) కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా జనవరి 13వ తేదీ థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలోనే తిరిగి డిజిటల్ మీడియాలో ఫిబ్రవరి 13వ తేదీ నుంచి ప్రసారం కాబోతోందని సమాచారం.
ఇకపోతే త్వరలోనే ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కు సంబంధించి అధికారక ప్రకటన రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో రవితేజకు జోడిగా డింపుల్ హైయతి, ఆషిక రంగనాథ్ నటించిన సందడి చేశారు. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా అనుకున్న స్థాయిలో కాకపోయినా పర్వాలేదు అనిపించుకుంది. థియేటర్లలో అనుకున్న స్థాయిలో సక్సెస్ అందుకో లేకపోయినా ఈ సినిమా ఓటీటీలో ఎలాంటి ఆదరణ సొంతం చేసుకుంటుంది అనేది తెలియాల్సి ఉంది. ఇటీవల రవితేజ వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్న సరైన విధంగా సక్సెస్ అందుకోలేకపోతున్న సంగతి తెలిసిందే.
ఇరుముడి షూటింగ్ పనులలో రవితేజ..
ఇక ఈ సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల కావడంతో రవితేజ తన తదుపరి సినిమాలపై పూర్తిస్థాయిలో దృష్టి సారించారు. ప్రస్తుతం రవితేజ శివ నిర్వాణ దర్శకత్వంలో ఇరుముడి అనే సినిమా పనులలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఈ ఏడాదిలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం కోసం చిత్ర బృందం ప్రణాళికలు రక్షిస్తున్నారు.. ఇక ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేయగా ఈ పోస్టర్ పెద్ద ఎత్తున సినిమా పట్ల అంచనాలను పెంచుతుంది. ఈ పోస్టర్ చూస్తుంటే తండ్రి కూతురి నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతుందని స్పష్టం అవుతుంది. మరి ఈ సినిమా ద్వారా రవితేజ ఎలాంటి హిట్ కొడతారనేది తెలియాల్సి ఉంది.
Also Read: Amardeep Chowdary: అమర్ దీప్ సినిమాకు రవితేజ సపోర్ట్.. గాల్లో తేలిపోతున్న అమర్!