Ayesha Khan in Bridal Look: అయోషా ఖాన్.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సోషల్ మీడియాలో యూజర్లకు ఈమె బాగా సుపరిచితం. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈమెకు మాంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈమె పెట్టే పోస్టులకు సపరేట్ ఫాలోయింగ్ ఉందనడంలో సందేహం లేదు. తరచూ హాట్ హాట్ ఫోటోషూట్‌లు షేర్ చేసి కుర్రకారుకు నిద్రలేకుండ చేస్తోంది. నెట్టింట హాట్ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. ఎప్పుడు గ్లామరస్ ఫోటోలు షేర్ చేసే ఈ బ్యూటీ తాజాగా పెళ్లి కూతురిగా కనిపించి షాకిచ్చింది. పెళ్లి కూతురిలా ముస్తాబైన ఫోటోలు షేర్ చేసింది.
పెళ్లి చేసుకున్న అయోషా?
ఇవి చూసి ఆమె ఫాలోవర్స్ అంతా షాక్ అవుతున్నారు. అంతేకాదు దీనికి పర్ఫెక్ట్ బ్రైడల్ లుక్ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. దీంతో అయేషా ఖాన్‌కి పెళ్లయ్యిందా? అని సర్‌ప్రైజ్ అవుతున్నారు. ఎలాంటి ప్రకటన, సమాచారం లేకుండానే ఈ హాట్ బ్యూటీ పెళ్లి పీటలు ఎక్కేసిందా? అని ఆమె ఫాలోవర్స్ అంతా వాపోతున్నారు. ఇంతకి అసలు విషయం ఏంటంటే.. అయేషా ఖాన్ చేసింది మూడు, నాలుగు చిత్రాలే. కానీ, స్టార్ నటి రేంజ్‌లో ఫాలోయింగ్ సంపాదించుకుంది. సినిమాలో ఈమె లుక్‌తో కుర్రాళ హాట్ ఫేవరేట్ అయ్యింది. టిక్‌టాక్ వీడియోలు, ఇన్‌స్టా రీల్స్‌తో సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయేన్సర్‌గా మారింది. హాట్ హాట్ ఫోటోలు, వీడియోలో ఫేమస్ అయ్యింది. ఆ క్రేజ్‌లో హిందీ బిగ్‌బాస్ ఆఫర్ అందుకుంది.
ఇందులో తనదైన ఆటతీరుతో ఆడియన్స్‌ని ఆకట్టుకుంది. బిగ్‌బాస్ షోతో లైమ్‌లైట్లోకి వచ్చిన ఈ భామ సినిమా ఆఫర్స్ క్యూ కట్టాయి. హీరోయిన్ కావాలనుకున్న ఈ భామకు అదే సమయంలో తెలుగులో అవకాశం తలుపుతట్టింది. ముఖచిత్రం అనే సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. కానీ, ఈ సినిమా ఆశించిన గుర్తింపు రాకపోవడం.. చిన్న చిన్న పాత్రలకే పరిమితమైంది. శ్రీ విష్ణు ఓం భీమ్ బుష్ సినిమాలో అయోషా ఓ కీలక పాత్రలో కనిపించింది. ఇందులో ఆమె గ్లామర్ లుక్‌తో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. ఆ తర్వాత విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలో స్పెషల్ సాంగ్ లో మెరిసింది. ఈ సాంగ్ లోనూ తన అందాలతో కవ్వించింది అయేషా ఖాన్.
పెళ్లి కూతురిలా
అలాగే శర్వానంద్ హీరోగా నటించిన ‘మనమే’ సినిమాలోనూ ఓ పాత్రలో మెరిసింది. అలా చిన్న చిన్న రోల్స్ చూస్తు కెరీర్‌లో బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ బెంగాలీలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక ఆమె తెలుగు తెరపై కనిపించి చాలా కాలం అవుతుంది. ప్రకటనల్లో నటిస్తున్న అయోషా.. తాజాగా పెళ్లి కూతురిగా ముస్తాబైన ఫోటోలు షేర్ చేసింది. దీంతో ఆమెకు పెళ్లయ్యిందా? సందేహిస్తున్నారు. కానీ, ఇది ప్రముఖ బ్రైడల్ డిజైనర్ వేర్‌కి బ్రాండ్ ప్రకటనలో నటించింది. ఇందులో భాగంగా అయోషా పెళ్లి కూతురిలా తయారై ఫోటోషూట్ ఇచ్చింది. ప్రస్తుతం ఇవే ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అసలు విషయం ఈ హాట్ ఫ్యాన్స్ హమ్మయ్య అనుకుంటున్నారు.
Also Read: Jasmin Jaffar: ఆలయంలో బిగ్‌బాస్ భామ ఇన్‌స్టా రీల్.. ఆరు రోజుల ఆలయ శుద్ధి పూజకు ఆదేశం!