BigTV English

Bigg Boss telugu: నన్ను దూరం పెట్టారు.. అతడే జడ్జ్ గా ఎందుకు?

Bigg Boss telugu: నన్ను దూరం పెట్టారు.. అతడే జడ్జ్ గా ఎందుకు?

Bigg Boss telugu: తెలుగు బుల్లితెర ప్రేక్షకులను అలరించడానికి బిగ్ బాస్ సీజన్ 9 ప్రారంభం కాబోతోంది. సెప్టెంబర్ 5 నుంచి స్ట్రీమింగ్ కానున్న నేపథ్యంలో ఈ సీజన్లోకి దాదాపు 5 మంది సామాన్యులను హౌస్ లోకి పంపిస్తున్నారు. అందులో భాగంగానే అగ్నిపరీక్ష పేరిట ఒక మినీ షో నిర్వహిస్తూ ఉండగా.. ఇందులో ముగ్గురిని జడ్జెస్ గా నియమించిన విషయం తెలిసిందే బిందు మాధవి(Bindu Madhavi), నవదీప్(Navdeep), అభిజిత్ (Abhijeeth) జడ్జిలుగా వ్యవహరిస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ జడ్జెస్ విషయంలో అసహనం వ్యక్తం చేశారు బిగ్ బాస్ సీజన్ 2 విజేత కౌశల్ (Kaushal )


నవదీప్ జడ్జిగా తీసుకోవడం పై కౌశల్ అసహనం..

కౌశల్ మాట్లాడుతూ.. బిగ్ బాస్ 9 హౌస్ లోకి కామన్ ఆడియన్స్ ను తీసుకోవాలనే వారి నిర్ణయం చాలా బాగుంది. కానీ జడ్జిలుగా వారిని తీసుకోవడంపై అభ్యంతరాలు ఉన్నాయి. బిగ్ బాస్ సీజన్ 4 విజేత అభిజిత్ కాబట్టి పర్వాలేదు. అటు ఓటీటీ విజేత బిందు మాధవి కాబట్టి ఆమె కూడా ఓకే.. ఇక సీజన్ 1 లో నవదీప్ మూడో స్థానంలో ఉన్నాడు. ఓడిపోయిన వ్యక్తిని కాకుండా విన్నర్ శివబాలాజీ (Siva Balaji) ని జడ్జిగా తీసుకొని ఉండుంటే బాగుండేది. అలా చేసిండుంటే విన్నర్స్ కి గుర్తింపు ఇచ్చినట్లు ఉండేది. కానీ అతడిని ఎందుకు తీసుకున్నారో నాకు అర్థం కాలేదు అంటూ కౌశల్ తెలిపారు.


నా విజయం బిగ్ బాస్ కి ఇష్టం లేదు – కౌశల్

వాస్తవానికి కౌశల్ ఎప్పుడూ కూడా బిగ్బాస్ సీజన్ 2 తర్వాత హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వలేదు. చాలామంది పాత కంటెస్టెంట్స్ గెస్ట్ రూపంలో స్టేజ్ పై సందడి చేశారు. కానీ కౌశల్ దూరంగానే ఉన్నారు. దానికి ఆయన మాట్లాడుతూ..” నా వరకు వస్తే నేను గెలవడం బిగ్ బాస్ టీం కి ఇష్టమే లేదు. ప్రేక్షకుల అభిమానం వల్ల నాకు ట్రోఫీ ఇచ్చారు. అటు ఓట్ల విషయంలో కూడా నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. నా తర్వాత కంటెస్టెంట్స్ ఓట్ల విషయంలో చాలా దూరం ఉండడంతో తప్పని పరిస్థితుల్లో మాత్రమే నన్ను విజేతగా ప్రకటించారు.

నా విషయంలో బిగ్ బాస్ రూల్స్ బ్రేక్ చేశారు..

ఆ కారణంతోనే బిగ్ బాస్ వారికి నేనంటే ఇష్టం ఉండదు. అందుకే వాళ్ళు కూడా హౌస్ కి రమ్మని నన్నెప్పుడూ పిలవలేదు. ముఖ్యంగా బిగ్ బాస్ చరిత్రలోనే వారికి ఇష్టం లేని కంటెంట్ కి ట్రోఫీ ఇవ్వాల్సి వచ్చింది. ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. సాధారణంగా అతిథిగా వచ్చినవారు చేయి పట్టుకుని విజేతను ప్రకటిస్తారు. కానీ మొదటిసారి నా విషయంలో దానిని బ్రేక్ చేసి స్క్రీన్ మీద విన్నర్ ను ప్రకటించారు. దీన్నిబట్టే చెప్పొచ్చు నా విజయం బిగ్ బాస్ టీం కి నచ్చలేదు అని”.. అంటూ ఆవేదన వ్యక్తం చేశారు కౌశల్. మొత్తానికైతే నవదీప్ ని తీసుకోవడంపై కాస్త అభ్యంతరం వ్యక్తం చేసినట్లు అనిపిస్తోంది. ఏది ఏమైనా కౌశల్ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పాటు నెటిజన్స్ కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. జడ్జిగా నవదీప్ పర్ఫెక్ట్.. ఎవరికి ఎలాంటి టాస్క్ ఇవ్వాలో అతడికి బాగా తెలుసు.. అగ్నిపరీక్ష షో ని ఇప్పుడు ముందుకు తీసుకెళ్తున్నది కూడా నవదీప్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

 

?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

 

ALSO READ: Sameera Reddy: దాన్ని భరించలేకపోయా… డిప్రెషన్‌లోకి వెళ్లిపోయా – సమీరా

Related News

DMart Offers: ఆ వస్తువులు సగం ధరలకే, డిమార్ట్ వినాయక చవితి బంపర్ ఆఫర్!

Agni Pariksha: డైరెక్టర్ క్రిష్ కే చెమటలు పట్టించిన అగ్నిపరీక్ష.. ఇదెక్కడి ఉత్కంఠరా బాబు?

Bigg Boss 9 Telugu : బిగ్ బాస్ లోకి మరో కన్నడ నటి.. రచ్చ మాములుగా ఉండదు మరి..!

Bigg Boss Agnipariksha: బిగ్ బాస్ అగ్నిపరీక్ష పై ఆడియన్స్ రియాక్షన్..ఇదొక బొ** పరీక్ష అంటూ!

Bigg Boss 9: గంటలో కేజీ వెయిట్.. ఫోర్ హెడ్ పై పచ్చబొట్టు.. ఈ ట్విస్ట్ లు మామూలుగా లేవుగా!

Big Stories

×