E-Paper
Advertisement

రాజశేఖర్‌తో బాబూమోహన్ స్నేహం వెనుక ఇంత కథ ఉందా?

రాజశేఖర్‌తో బాబూమోహన్ స్నేహం వెనుక ఇంత కథ ఉందా?
Advertisement

Babu Mohan:బాబూమోహన్..టాలీవుడ్‌లో తనదైన కామెడీ టైమింగ్‌తో ఎన్నో ఏళ్లనుండి ఆడియన్స్ ని కడుపుబ్బా నవ్విస్తున్న సంగతి తెలిసిందే. ఇక కేవలం సినిమాలే కాకుండా ప్రభుత్వ ఉద్యోగిగా, రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యేగా, మంత్రిగా కూడా ఎన్నో సేవలు అందించిన ఈ స్టార్ వెటరన్ కమెడియన్ తాజాగా ‘ఆలితో ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తన పాత జ్ఞాపకాలను, ఆసక్తికర విశేషాలను పంచుకున్నారు.

షోలో భాగంగా ఆలీతో తన సినీ జర్నీ గురించి చెబుతూ.. మొదట్లో తనకు నటుడిగా మారాలనే ఆలోచనే లేదని, ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న సమయంలోనే అనుకోకుండా సినిమాల్లోకి వచ్చానని తెలిపారు. తెరపై తన బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ ప్రేక్షకులకు బాగా నచ్చడంతో వరుస అవకాశాలు వచ్చాయని గుర్తు చేసుకున్నారు.

Advertisement

ఈ సందర్భంగా దర్శకుడు కోడి రామకృష్ణతో తనకు ఉన్న అనుబంధాన్ని బాబూమోహన్ పంచుకున్నారు. రాజశేఖర్ హీరోగా నటించిన ఓ సినిమాలో చిన్న పాత్ర చేసినప్పుడు, తన నటనను చూసి కోడి రామకృష్ణ ప్రత్యేకంగా మెచ్చుకున్నారని చెప్పారు. ఆ సినిమా సమయంలోనే రాజశేఖర్‌తో మంచి స్నేహం ఏర్పడిందని తెలిపారు. ‘మగాడు’ సినిమా షూటింగ్ కోసం కేరళలో సుమారు 22 రోజులు ఉన్నామని, ఆ సమయంలో షూటింగ్ లొకేషన్‌లో జరిగిన సరదా విషయాలను గుర్తు చేసుకున్నారు.

అయితే అదే షూటింగ్ సమయంలో రాజశేఖర్‌కు జరిగిన ఒక ప్రమాదం గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యారు బాబు మోహన్ . రైల్వే ట్రాక్‌పై నడుస్తుండగా రాజశేఖర్ కాలికి పెద్ద దెబ్బ తగిలిందని, ఎముక బయటకు కనిపించేలా దారుణమైన పరిస్థితి ఏర్పడిందని, వెంటనే ఆసుపత్రికి తరలించామని ఆనాటి సంఘటనను వివరించారు.

Advertisement

ఇక బాబూమోహన్ కెరీర్‌లో ‘అంకుశం’ సినిమా ఒక టర్నింగ్ పాయింట్‌గా నిలిచిన సంగతి తెల్సిందే. ఈ సినిమాతో ఆయనకు వచ్చిన క్రేజ్ తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాకుండా తమిళంలో ‘ఇద్దండా పోలీస్’ పేరుతో ఈ సినిమా రిలీజ్ కావడంతో అక్కడ కూడా మంచి క్రేజ్ వచ్చింది.దాంతో బెంగళూరు రైల్వే స్టేషన్‌లో దిగినప్పుడు అభిమానులు తనను చుట్టుముట్టి ‘ఇద్దండా పోలీస్’ అంటూ అరిచిన సంఘటన తనకు ఎంతో ఆశ్చర్యాన్ని, సంతోషాన్ని కలిగించిందని చెప్పారు. తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లోనూ నటించిన ఆయన, దిగ్గజ నటుడు అమ్రిష్ పూరితో కలిసి పనిచేసిన అనుభవాలను కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.

ఇక తన మిమిక్రీ టాలెంట్ గురించి చెబుతూ.. తాను దీనికోసం ఎక్కడా ప్రత్యేక శిక్షణ తీసుకోలేదని, సహజంగానే ఆ అలవాటు వచ్చిందని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగం చేసే రోజుల్లో కొందరి మాటతీరును సరదాగా ఇమిటేట్ చేస్తూ తోటివారిని నవ్వించేవాడినని చెప్పారు.

ALSO READ :మోహన్ బాబు కంటే రెండు ఆకులు ఎక్కువే చదివా.. డైరెక్టర్ కామెంట్స్ వైరల్!

Tags

Related News

ఆదర్శ కుటుంబం ఎఫెక్ట్.. మళ్లీ వాయిదా పడిన ఇట్లు అర్జున..!

మోహన్ బాబు కంటే రెండు ఆకులు ఎక్కువే చదివా.. డైరెక్టర్ కామెంట్స్ వైరల్!

అణిచివేయాలని చూస్తే సహించేది లేదు.. స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన ఉపాసన!

సినిమా చూడటానికి కాలేజీకి సెలవా.. ఇదేం కొత్త రూల్ మల్లన్నా!

అవంతిక మిశ్రా అందాల జాతర.. ఆ లుక్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

మరో ప్రతిష్టాత్మకమైన అవార్డును దక్కించుకున్న మెగా డాటర్ నిహారిక!

40 ఏళ్ల సినీ కెరియర్ లో ఫస్ట్ టైం ఆ పని చేసిన రజినీకాంత్.. ఖుషి అవుతున్న ఫ్యాన్స్!

Big Stories

Advertisement
×