E-Paper
Advertisement

విజయవాడ ట్రిప్‌లో విషాదం.. లారీని ఢీకొన్న కారు, ఇద్దరు యువకులు మృతి!

విజయవాడ ట్రిప్‌లో విషాదం.. లారీని ఢీకొన్న కారు, ఇద్దరు యువకులు మృతి!
Advertisement

Huzurabad Accident: స్వేచ్ఛ బ్యూరో: విజయవాడ కనకదుర్గమ్మ దర్శనం ముగించుకుని స్వగ్రామానికి తిరిగి వస్తున్న క్రమంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతిచెందగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన హుజురాబాద్ మండలం రంగాపూర్ శివారులోని 563వ నంబరు జాతీయ రహదారిపై శనివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

Advertisement

పెద్దపల్లి జిల్లా రామగుండానికి చెందిన ఏడుగురు యువకులు విజయవాడ దుర్గమ్మ దర్శనం చేసుకుని ఎర్టిగా కారులో తిరుగు ప్రయాణమయ్యారు. రంగాపూర్ శివారుకు చేరుకోగానే ముందు వెళ్తున్న లారీని కారు వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు కారు ముందు భాగం లారీ కిందకు దూసుకెళ్లి నుజ్జునుజ్జయ్యింది. ఈ ఘటనలో రామగుండానికి చెందిన బట్టారి అరవింద్ (20), మచ్చ సాయి (20) తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతిచెందారు. కారులో ఉన్న ఎరుకల సాయికృష్ణ, మచ్చ ఆదర్శ్, ముఖియా, వివేక్, శ్రీకర్ తీవ్రంగా గాయపడ్డారు.

కేసు నమోదు..

Advertisement

సమాచారం అందుకున్న హుజురాబాద్ రూరల్ సీఐ వీరభత్తిని శ్రీనివాస్ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని, క్రేన్ సాయంతో వాహనంలో చిక్కుకున్న వారిని బయటకు తీశారు. క్షతగాత్రులను తొలుత హుజురాబాద్‌ ప్రాంతీయ ఆసుపత్రికి, అనంతరం మెరుగైన చికిత్స కోసం వరంగల్‌ ఎంజీఎంకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్న ఇద్దరిని హైదరాబాద్‌కు తరలించినట్లు తెలిసింది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

Also Read: ఇదేంట్రా బాబు.. పశువులకు సోకే ఈ వైరస్ ఇప్పుడు మనుషులకు వస్తోందా?

Tags

Related News

సీఎం రేవంత్ రెడ్డికి హరీశ్ రావు లేఖ.. ఆ పరీక్షను వాయిదా వేయండి?

ఐపీఎస్ పేరుతో ఘరానా మోసాలు.. ఎలా ప‌ట్టుబ‌డ్డాడంటే..

మాదాపూర్‌లో హైడ్రా సంచలన ఆపరేషన్.. ఇళ్ల బెడ్‌రూమ్‌, కిచెన్‌లలో వేసిన బోర్లు బట్టబయలు!

2017 నుండి గంజాయి అమ్ముతున్న వృద్ధురాలు అరెస్ట్!

నేను చెప్పిన పద్ధతి ఫాలో అవ్వండి.. నీళ్లు ఎట్లా రావో చూస్తా: జగదీశ్వర్ రెడ్డి!

కాంగ్రెస్‌లో కుర్చీ లాటరీ.. జెండా మోసినోళ్లకు హ్యాండ్.. జంప్ జిలానీలకే హవా!

జోగులాంబ గద్వాల జిల్లాలో.. దొంగ మస్తర్లతో ఉపాధి హామీ నిధుల గోల్‌మాల్?

Big Stories

Advertisement
×