Ganja Case: మనవలు.. మనవరాళ్లతో ఆడుకోవాల్సిన వయసులో గంజాయి దందా చేస్తూ పట్టుబడింది ఓ వృద్ధురాలు. పక్కాగా అందిన సమాచారంతో నిఘా పెట్టి మరీ ఈగల్ ఫోర్స్ అధికారులు ఆమెను అరెస్ట్ చేశారు. 179 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి.
ఫతేనగర్ ప్రాంతంలోని లాల్ బహదూర్ శాస్త్రినగర్ నివాసి షేక్ జతిన్ బీ ఇంట్లోనే గంజాయిని స్టాక్ పెట్టుకుని అమ్ముతున్నట్టుగా ఈగల్ ఫోర్స్ అధికారులకు తెలిసింది. ఈ క్రమంలో మఫ్టీలో శుక్రవారం రాత్రి అక్కడికి వెళ్లిన అధికారులు నిఘా పెట్టారు. రెండు గంటల్లో దాదాపు డెబ్భయి మంది రావటం 5వందల రూపాయల నోటును షేక్ జతిన్ బీ చేతికి ఇవ్వగానే ఆమె 5గ్రాముల గంజాయి ప్యాకెట్ ను వారికి ఇవ్వటం గమనించారు. ఇలా గంజాయి కొన్నవారందరినీ అదుపులోకి తీసుకున్న అధికారులు ఆ తరువాత షేక్ జతిన్ బీ ఇంట్లో సోదాలు జరిపారు. దీంట్లో 179గ్రాముల గంజాయి దొరికింది.
దాంతో ఆమెను అరెస్ట్ చేశారు. విచారణలో 2017నుంచి గంజాయి దందా చేస్తున్నట్టుగా షేక్ జతిన్ బీ చెప్పింది. సదాశివపేటలో ఉంటున్న తన తన కుటుంబ సభ్యులు గంజాయి పంపిస్తుంటారని వెల్లడించింది. ప్రతిరోజు 2వందల మందికి గంజాయి అమ్ముతుంటానని తెలిపింది. ఇక, అదుపులోకి తీసుకున్న డెబ్భయి మందికి డ్రగ్ పరీక్షలు జరుపగా అరవై ఆరుమందికి పాజిటీవ్ వచ్చింది. వీరిలో ఇద్దరు మైనర్లు కూడా ఉన్నారు. అరవై ఎనిమిది మందిపై మాదక ద్రవ్యాల నిరోధక చట్టం ప్రకారం కేసులు నమోదు చేశారు. మైనర్లపై జువెనైల్ జస్టిస్ యాక్ట్ ప్రకారం కేసులు పెట్టారు.
Also read: నేను చెప్పిన పద్ధతి ఫాలో అవ్వండి.. నీళ్లు ఎట్లా రావో చూస్తా: జగదీశ్వర్ రెడ్డి!