BigTV English

Tollywood:కిస్ పెడుతూ… ఇన్‌ఫ్లుయెన్సర్‌తో పబ్‌లో అడ్డంగా దొరికిపోయిన బేబీ హీరో

Tollywood:కిస్ పెడుతూ… ఇన్‌ఫ్లుయెన్సర్‌తో పబ్‌లో అడ్డంగా దొరికిపోయిన బేబీ హీరో

Tollywood:సాధారణంగా సెలబ్రిటీలు పబ్లిక్ ఫిగర్స్ కాబట్టి వీరికి సంబంధించిన ఏ చిన్న విషయమైనా సరే ఇట్టే వైరల్ అవుతూ ఉంటుంది. అందుకే సెలబ్రిటీలు ఎక్కడికి వెళ్ళినా ఆచితూచి ప్రవర్తించాలని అభిమానులు కూడా కోరుతూ ఉంటారు. అయితే ఇక్కడ ‘బేబీ’ మూవీ హీరో మాత్రం పబ్ లో ఏకంగా ఒక అమ్మాయికి కిస్ పెడుతూ అడ్డంగా దొరికిపోయాడు. దీంతో ఆయనపై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు.అంతేకాదు ఎఫైర్ రూమర్స్ కూడా క్రియేట్ చేస్తూ ఉండడం గమనార్హం.


పబ్ లో అమ్మాయితో అడ్డంగా దొరికిపోయిన విరాజ్..

ఆయన ఎవరో కాదు విరాజ్ అశ్విన్ (Viraaj Ashwin).. 2018 లోనే ఇండస్ట్రీకి అడుగుపెట్టిన ఈయన ‘అనగనగా ఒక ప్రేమ కథ’ సినిమాతో ప్రేక్షకులను అలరించారు. అయితే 2023 లో వచ్చిన బేబీ సినిమాతోనే భారీ పాపులారిటీ దక్కించుకున్నారు. అప్పటినుంచి ఈయన ఊహించని క్రేజ్ దక్కించుకోవడంతో ఇక ఎక్కడ కనిపించినా ఆయన గురించే వార్తలు వినిపిస్తున్నాయి. ఇకపోతే బేబీ సినిమాలో మోసపోయిన ప్రేమికుడిలా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన విరాజ్ తాజాగా ఒక అమ్మాయితో కనిపించారు. అందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

కిస్ చేస్తూ మరీ..


ఆమె ఎవరో కాదు మరాఠీ సోషల్ మీడియా స్టార్ యశ శ్రీ (Yasha Sri).. తాజాగా హైదరాబాదులోని ఒక ప్రముఖ పబ్ కి ఈ జంట వచ్చింది.. నిన్న రాత్రంతా ఫుల్ ఎంజాయ్ చేసినట్లు కూడా సమాచారం. అంతేకాదు ఈ పబ్బులో యశ శ్రీ పై చేతులు వేస్తూ.. కిస్ పెడుతూ మరీ చాలా క్లోజ్ గా కనిపించాడు విరాజ్. దీంతో ఈ ఇద్దరికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో వీళ్ళిద్దరూ రిలేషన్ లో ఉన్నారా ? అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి అయితే వీళ్ళిద్దరూ ఇప్పుడు ప్రేమలో ఉన్నారని.. త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఇందులో ఎంత నిజం ఉందో తెలియాలి అంటే విరాజ్ స్పందించాల్సి ఉంటుంది.. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు మీడియాలో హల్ చల్ చేస్తోంది.

విరాజ్ అశ్విన్ బ్యాక్ గ్రౌండ్..

విరాజ్ అశ్విన్ విషయానికి వస్తే.. తెలుగు కుటుంబంలో.. వెంకటేశ్వరరావు, వెంకటేశ్వరి దంపతులకు జన్మించారు. విరాజ్ అశ్విన్ తండ్రి వెంకటేశ్వర రావు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ “ఇస్రో” లో శాస్త్రవేత్తగా పనిచేసి ఇటీవల రిటైర్మెంట్ తీసుకున్నారు. విరాజ్ ఎవరో కాదు దివంగత సినిమా ఎడిటర్ కే.ఏ. మార్తాండ్ మనవడు. ఈయన మేనమామ ఫిలిం డైరెక్టర్ శంకర్ కే మార్తాండ్. ప్రముఖ తెలుగు సినీ దర్శకుడు బి.ఏ.సుబ్బారావు ముని మనవడు కూడా.. ఇలా సినీ ఇండస్ట్రీలో భారీ బ్యాక్ గ్రౌండ్ దక్కించుకున్న విరాజ్ అశ్విన్.. ఇప్పుడిప్పుడే హీరోగా నిలదొక్కుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.

విరాజ్ అశ్విన్ సినిమాలు..

విరాజ్ అశ్విన్ సినిమాలు అనగనగా ఒక ప్రేమ కథ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన ఈయన.. ఒక షార్ట్ ఫిలిం లో కూడా నటించారు. ఆ తర్వాత ధన్యవాదాలు సోదరా, వాళ్ళిద్దరి మధ్య, మాయాపేటిక , బేబీ , జోరుగా హుషారుగా, హాయ్ నాన్న , శ్రీరంగనీతులు ఇలా పలు చిత్రాలలో నటించారు విరాజ్ అశ్విన్. ఇన్ని చిత్రాలలో నటించిన ఈయనకు మాత్రం బేబీ సినిమా మంచి విజయాన్ని అందించింది అని చెప్పవచ్చు.

also read:OG: స్టైల్ కాపీ ఓకే.. రిజల్ట్ కూడా అలాగే ఉంటే.. చెక్కేయడమే!

?utm_source=ig_web_copy_link

Related News

Manchu Manoj: మనోజ్ క్యారెక్టర్ ఆ స్టార్ హీరో చేస్తే మిరాయ్ హిట్ అయ్యేదా.. ?

OG Bookings : ఛీ ఛీ.. కాసులకు కక్కుర్తి పడి.. బ్లాక్ టికెట్స్ దందాలోకి డిస్ట్రిబ్యూటర్స్ ?

OG Movie: మిరాయ్ థియేటర్లు ఓజీకి.. పవన్ భయపెట్టాడా.. ?

OG Movie: ఉండే గంటకు అంత హైప్ ఎందుకురా బుజ్జి..

OG: స్టైల్ కాపీ ఓకే.. రిజల్ట్ కూడా అలాగే ఉంటే.. చెక్కేయడమే!

National Awards: నాలుగేళ్ల చిన్నారికి నేషనల్ అవార్డు.. ఏ మూవీకంటే ?

Hero Suriya: మోసపోయిన సూర్య సెక్యూరిటీ ఆఫీసర్ .. రూ.42 లక్షల భారీ మోసం!

Big Stories

×