OG Movie: స్టార్ హీరో సినిమా అంటే.. ఎన్నీ అంచనాలు.. ఎంత హైప్.. ఎంత హడావిడి. అసలు అందులోనూ పవర్ స్టార్ లాంటి హీరో ఒక సినిమా చేస్తున్నాడు అంటే.. సినిమా మొదటి నుంచి ఎండ్ వరకు వన్ మ్యాన్ షో అన్నట్లు ఉండాలి. అదే ప్రతి అభిమాని కోరుకుంటాడు. కానీ, ఈ మధ్యకాలంలో స్టార్ హీరోలు కథను పక్కన పెట్టి బిల్డప్ లకే ఎక్కువ సమయం ఇచ్చేస్తున్నారు. వాళ్ళను అని ప్రయోజనం లేదు.. వారిని అలా మార్చింది డైరెక్టర్స్ అని చెప్పాలి.
అసలు 3 గంటల సినిమాలో హీరో ఎంతసేపు ఉండాలి. కథ స్టార్టింగ్ లో ఓ 10 నిమిషాలు ప్రేక్షకులను కథలోకి తీసుకెళ్లడానికి ఇతర పాత్రలను పరిచయం చేయడానికి వాడుకున్నాడు అంటే అది ఓకే. కానీ, హీరో ఎంట్రీనే 45 నిమిషాల తరువాత వస్తే.. సరే లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా వచ్చాడు. అప్పటి నుంచి మన హీరోనే తెరపై కనిపిస్తాడు అనుకొని సంబరపడేలోపు.. ఇలా వచ్చి అలా మాయం అయ్యిపోయి.. మళ్లీ ఇంటర్వెల్ కు కనిపిస్తే ఏంటి హీరో సినిమా చేస్తున్నాడా.. లేక క్యామియో చేస్తున్నాడా .. అనే అనుమానం అందరికి వస్తుంది.
అసలు ఇంత ఆవేదన ఎందుకు.. ఏమైంది అంటే.. పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా రేపు రిలీజ్ కు సిద్దమవుతుంది. ఇందులో పవన్ కేవలం ఒక గంట మాత్రమే కనిపిస్తాడని టాక్ నడుస్తోంది. సినిమా మొదలైన 45 నిమిషాల తరువాత పవన్ ఎంట్రీ ఉంటుంది. ఆ తరువాత ఇంటర్వెల్ కు ఒక సీన్.. సెకండాఫ్ లో ఆయన ఫ్లాష్ బ్యాక్.. మొత్తం కలిపి గంటకన్నా తక్కువే పవన్ స్క్రీన్ ప్రెజెన్స్ ఉంటుందని అంటున్నారు. ఈ విషయం తెలియడంతో పవన్ ఫ్యాన్స్ గుక్కపెట్టి ఏడుస్తున్నారు.
అసలు సుజీత్.. పవన్ ను హీరోగా పెట్టి సినిమా తీస్తున్నాడా.. ? లేక క్యామియోగా పెట్టాడా.. ? అని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. లేక పవన్ పేరు చెప్తే ఫ్యాన్స్ చేతులు కోసేసుకుంటారు.. ఏది పెట్టినా చూస్తారు. పవన్ పేరు చెప్పి సినిమాను మొత్తం గట్టెక్కించాలని చూస్తున్నాడా అర్ధం కావడం లేదు. ఇది పవన్ విషయంలోనే కాదు. ప్రభాస్ విషయంలో కూడా జరిగింది. సలార్ లో ప్రభాస్ ఎంతసేపు ఉన్నాడు.
ఇలా స్టార్ హీరోలను ఎలివేషన్స్ తో లేపి లేపి కథను పక్కకు పెట్టి ఫ్యాన్స్ కోసమే సినిమా అని చెప్పి కలక్షన్స్ రాకపోయినా వచ్చాయని చెప్పి.. హిట్ బొమ్మ అని మేకర్స్ చెప్పుకుంటూపోతే సరిపోతుందా.. ఫ్యాన్స్ సాటిస్ఫై అవ్వోద్దా.. ? మూడు గంటల సినిమాలో హీరో కనీసంలో కనీసం గంట కూడా లేకపోతే ఎలా అని నెటిజన్స్ మండిపడుతున్నారు. ఇంతోటి దానికి అంత హైప్ ఎందుకు అని కామెంట్స్ పెడుతున్నారు. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే.