E-Paper
Advertisement

OG: స్టైల్ కాపీ ఓకే.. రిజల్ట్ కూడా అలాగే ఉంటే.. చెక్కేయడమే!

OG: స్టైల్ కాపీ ఓకే.. రిజల్ట్ కూడా అలాగే ఉంటే.. చెక్కేయడమే!
Advertisement

OG: ప్రముఖ డైరెక్టర్ సుజీత్ (Sujeeth) దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హీరోగా ప్రియాంక మోహన్ (Priyanka Mohan) హీరోయిన్ గా నటిస్తున్న చిత్రం ఓజీ (OG). ఈరోజు రాత్రి ప్రీమియర్ షో తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. సెప్టెంబర్ 25వ తేదీన గ్రాండ్ గా ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న ఈ సినిమాపై అంచనాలు పెంచడానికి మేకర్స్ అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా డైరెక్టర్ సుజీత్.. ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్గా పని చేస్తున్న ఎస్.తమన్ (S.Thaman ) ఒక లుక్, అలాగే స్టిల్ ను రీ క్రియేట్ చేశారు. ఇది చూడడానికి బాగున్నా.. రిజల్ట్ కూడా అలాగే ఉంటే ఇక నష్టం తప్పదు అంటూ కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. మరి వీరిద్దరూ రీ క్రియేట్ చేసిన ఆ లుక్ ఏంటి ? ఏ సినిమా స్టిల్ ని కాపీ కొట్టారు ? అనే విషయం ఇప్పుడు చూద్దాం.

కూలీ స్టిల్ రీ క్రియేట్..

ఇటీవల రజనీకాంత్ (Rajinikanth) హీరోగా… లోకేష్ కనగరాజు దర్శకత్వంలో వచ్చిన చిత్రం కూలీ. ఈ ఏడాది ఆగస్టు 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎన్నో అంచనాల మధ్య విడుదలైంది.కానీ అభిమానుల అంచనాలను ఏమాత్రం అందుకోలేకపోయింది. విడుదలకు ముందే భారీ హైప్ క్రియేట్ చేసింది చిత్ర బృందం కానీ అనూహ్యంగా మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది . ఇకపోతే ఈ చిత్రానికి ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్ర (Anirudh Ravichander) సంగీతాన్ని అందించారు. ఇదిలా ఉండగా ఈ సినిమా విడుదల సమయంలో రజనీకాంత్ కూలీ పోస్టర్ ముందు మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్, డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ఒకరికొకరు చేతులు పట్టుకొని ఫోజులిచ్చారు.

Advertisement

కాపీ కొట్టారు ఓకే.. మరి రిజల్ట్ సంగతేంటి?

అయితే ఈ స్టిల్ ని ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఓజీ లుక్ ముందు డైరెక్టర్ సుజిత్ అలాగే మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ తమన్ రీ క్రియేట్ చేస్తూ ఒక ఫోటో వదిలారు. ఇప్పుడు ఈ రెండు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఇది చూసిన నెటిజన్స్ స్టిల్ , లుక్ కాపీ కొట్టారు బాగుంది.. రిజల్ట్ కూడా అదే అయితే ఇక దొబ్బినట్టే అంటూ తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ఉండడం గమనార్హం. ఏది ఏమైనా ఇప్పుడు ఈ స్టిల్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

Advertisement

also read:National Awards: నాలుగేళ్ల చిన్నారికి నేషనల్ అవార్డు.. ఏ మూవీకంటే ?

ఓజీ సినిమా విశేషాలు..

ఓజీ సినిమా విషయానికి వస్తే.. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డీవీవీ దానయ్య భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పవన్ కళ్యాణ్ హీరోగా ప్రియాంక మోహన్ హీరోయిన్ గా వస్తున్న ఈ సినిమాలో.. శ్రేయ రెడ్డి, శుభలేఖ సుధాకర్, ఇమ్రాన్ హస్మి , ప్రకాష్ రాజ్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. భారీ అంచనాల మధ్య రేపు ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Related News

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

ఎన్టీఆర్ డ్రాగన్ లో బాలీవుడ్ స్టార్స్… ఏం ప్లాన్ చేస్తున్నావ్ నీల్?

RC16పై మాస్ అప్డేట్..చరణ్–సుకుమార్ మూవీ గ్రాండ్ లాంచ్ ఎప్పుడో తెలుసా?

క్యాస్టింగ్ కౌచ్ పై పొలిమేర బ్యూటీ హాట్ కామెంట్స్.. చాలా ఇబ్బంది పెట్టేవారు?

Big Stories

Advertisement
×