E-Paper
Advertisement

Akhanda 2 : అఘోర పాత్రపై బిగ్ ట్విస్ట్… అంచనాలు పెట్టుకోవద్దా?

Akhanda 2 : అఘోర పాత్రపై బిగ్ ట్విస్ట్… అంచనాలు పెట్టుకోవద్దా?
Advertisement

Akhanda 2 Aghora Role : అఖండ పార్ట్ 1 అందరూ చూశారు. బోయపాటి – బాలకృష్ణల మ్యాజిక్ చూసి అందరూ మెచ్చుకున్నారు. ఇక బాలయ్య అభిమానులు అయితే… బోయపాటిని నెత్తిన పెట్టుకున్నారు. బాలయ్య సినిమా అంటే బోయపాటి తోనే ఉండాలి అనేట్టుగా ఓన్ చేసుకున్నారు బోయపాటిని. దీనికి కారణం… అఖండ సినిమాలో బాలయ్య చేసిన అఘోర పాత్ర. ఇప్పుడు సీక్వెల్‌గా వస్తున్న అఖండ 2 తాండవంలో అలాంటి పాత్రపై బోయపాటి బిగ్ ట్విస్ట్ ఇవ్వబోతున్నారంట. ఈ ట్విస్ట్ వల్ల ఆ పాత్రపై అంచనాలను పెట్టుకున్నవారు… నిరాశచెందుతారని సమాచారం. ఆ కథేంటో ఇప్పుడు చూద్దాం…

పైన చెప్పిన అఖండ సినిమా అంత హిట్ అవ్వడానికి కారణం.. అఘోర పాత్రనే అని చెప్పొచ్చు. కరోనా మహమ్మారి ఉన్నా.. అప్పట్లో ఏపీ ప్రభుత్వం ఆంక్షలు పెట్టినా… బ్లాక్ బస్టర్ హిట్ అయిందంటే… దానికి ఆ అఘోర పాత్రనే కారణమని చెప్పొచ్చు. ఇప్పుడు సీక్వెల్‌లో ఆ అఘోర పాత్రపైనే డైరెక్టర్ ఆంక్షలు పెట్టినట్టు తెలుస్తుంది.

Advertisement

అఖండ 2 తాండవం సినిమాలో అఘోర పాత్ర తక్కువ టైం ఉంటుందంట. సినిమా మొత్తం… బాలయ్య ఎమ్మెల్యేగా చేస్తున్న పాత్రనే ఉంటుందని సమాచారం. అయితే సినిమా ఇంట్రడక్షన్‌లో హిమాలయాల్లో బాలయ్యతో ఓ ఫైట్ సీన్ ఉంటుందంట.

ఇంట్రడక్షన్ సీన్..

అఖండ పార్ట్ 1లో కాపాడిన పాప.. ఇప్పుడు పెద్దగా అవుతుందని, ఆమెను మళ్లీ చంపడానికి కొంత మంది విలన్లు వస్తారంట. అలా.. ఆ పాప అఖండను వెతుకుంటూ హిమాలయాలకు వస్తుందంట. ఆమె వెంట ఆ రౌడీస్ కూడా ఉంటారట…. అక్కడ వాళ్లందరినీ అఖండ త్రిషూలంతో చంపేస్తాడంట. ఇదే సీన్ కొన్ని రోజుల క్రితం వచ్చిన టీజర్‌లో చూపించారు. అలాగే రీసెంట్‌గా వచ్చిన ట్రైలర్‌లో కూడా ఈ సీన్ కాస్త డిటైల్డ్ గా పెట్టారు.

కనిపించేది ఫస్టాఫ్‌లో మాత్రమే ?

Advertisement

ఈ సీన్ తర్వాత ఫస్టాఫ్ వరకు అఘోర పాత్ర కనిపిస్తుందంట. ఇంటర్వెల్ టైంలో ఓ షాకింగ్ ట్విస్ట్ పెట్టారట. ఇక సెకండాఫ్‌లో అఘోర పాత్ర అస్సలు కనిపించదని సమాచారం. ఆ టైంలో సినిమా అంతా… బాలయ్య చేస్తున్న ఎమ్మెల్యే పాత్రను రన్ చేయిస్తారని తెలుస్తుంది.

పార్ట్ 3కి బోయపాటి చేసిన ప్లాన్ ఇదేనా ?

సెకండాఫ్‌లో మొత్తం ఎమ్మెల్యే పాత్ర కనిపిస్తుందట. ఇక క్లైమాక్స్‌లో హై లెవెల్ ఎలివేషన్ సీన్‌లో మళ్లీ అఘోర పాత్ర ఎంట్రీ ఉంటుందంట. లాస్ట్ ‌లో అఖండ పార్ట్ 3కి ఓ లీడ్ ఇచ్చి సినిమాను ఎండ్ చేస్తారని తెలుస్తుంది.

అంతా రోటీన్..?

అఘోర పాత్ర తక్కువ ఉండటం కొంత వరకు బాలయ్య అభిమానులను షాక్ ఇచ్చేలా ఉంటుందని చెప్పొచ్చు. అలాగే ఇప్పటికే అఖండ సినిమా అందరూ చూశారు. ఇప్పుడు దానికి సీక్వెల్ గా వస్తున్న అఖండ 2 కూడా అచ్చం అదే ఫార్మెట్ లో ఉంటుందంట. ఫ్రెష్ ఫీల్ లేకుండా చూసిన సినిమానే మళ్లీ చూస్తున్నాం అనే ఫీల్ వచ్చేలా ఉంటుందని అంటున్నారు.

Related News

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

38ఏళ్ల తర్వాత తండ్రి నాగబాబు రికార్డును రిపీట్ చేసిన నిహారిక!

సైలెంట్ గా నిశ్చితార్థం.. పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ హీరో!

కళ్ళు లేవు.. మైమరిపించే గాత్రానికి నేషనల్ అవార్డు.. ఎవరీ సింగర్?

విజువల్ వండర్ గా రామాయణ ట్రైలర్.. అఫీషియల్ ఎప్పుడంటే?

Big Stories

Advertisement
×