E-Paper
Advertisement

Akhanda 2 Premiers : తెలంగాణలో అఖండ 2 ప్రీమియర్ షోలు రద్దు.. ముహూర్తం బెడిసి కొట్టిందా?

Akhanda 2 Premiers : తెలంగాణలో అఖండ 2 ప్రీమియర్ షోలు రద్దు.. ముహూర్తం బెడిసి కొట్టిందా?
Advertisement

Akhanda 2 Premiers : బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ నటిస్తున్న సినిమా అఖండ. ఈ సినిమా భారీ అంచనాల మధ్య రాబోతుంది. ఈ సినిమా రేపు విడుదల కానుంది. మామూలుగా ఒక పెద్ద సినిమా రేపు విడుదలవుతుంది అనగా ఈరోజు షోస్ పడటం జరుగుతుంది. ఈ సినిమాకి ఈరోజు ప్రీమియర్ షోలు పడతాయి అనుకునే టైంలో గంటకొక వార్త వినిపించింది. మొత్తానికి ఎటూ కాకుండా ఈరోజు కంప్లీట్ గా ప్రీమియర్ షోలు రద్దు అయిపోయినట్లు అధికారికంగా ప్రకటించారు.

దారుణంగా మారిన పరిస్థితి

అఖండ 2 పరిస్థితి మరి అధ్వానంగా మారిపోయింది. తెలంగాణ గవర్నమెంట్ నుంచి ప్రీమియర్స్ కోసం టికెట్ కు600 రూపాయలు పెంచుకున్నా.. ఉపయోగం లేకుండా పోయింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు 8 గంటలకు ఉండాల్సిన ప్రీమియర్స్ షోలను మేకర్స్ రద్దు చేసినట్టు తెలుస్తుంది. అలాగే ఉదయం నుండే మార్నింగ్ షో ల విషయంలో కూడా సందిగ్ధత నెలకొంది.

ఫైనాన్స్ క్లియర్ చేయలేదు 

Advertisement

ఈ సినిమాకి సంబంధించి దాదాపు 50 కోట్ల వరకు ఫైనాన్సు క్లియర్ చేయాల్సిన పరిస్థితి. అయితే అనుకున్న టైంలో 50 కోట్లు ఫైనాన్స్ క్లియర్ చేయలేదు కాబట్టి ఈ అడ్డంకులు ఎదురైనట్లు తెలుస్తుంది. మొత్తానికి బాలకృష్ణ అభిమానులందరికీ నిరాశ మిగిలింది.

ముహూర్తం బెడిసి కొట్టింది

Advertisement

మామూలుగా బాలకృష్ణ కొన్ని సెంటిమెంట్స్ ను ఎంతలా నమ్ముతారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. వాస్తవానికి ఈ సినిమాకి సంబంధించిన ప్రీమియర్ షోలు 12 గంటల ఒక నిమిషంలో పై పూర్తి అయిపోవాలి. ఎనిమిది గంటలకి ప్రీమియర్ షోలు స్టార్ట్ అవుతాయని సర్వత్రా ఊహించారు. కానీ చివరి నిమిషంలో సోష్ క్యాన్సిల్ అయిపోయాయి. మొత్తానికి బాలకృష్ణ పెట్టిన ముహూర్తం కూడా బెడిసి కొట్టింది అని అర్థమవుతుంది.

ప్లానింగ్ లేదు

ఈ సినిమాను 14 రీల్స్ నిర్మాణ సంస్థ నిర్మించింది. గతంలో ఎన్నో అద్భుతమైన సినిమాలు చేసిన అనుభవం ఈ బ్యానర్ కి ఉన్నా కూడా సరైన ప్లానింగ్ లేక ఈరోజు ప్రీమియర్ షోస్ క్యాన్సిల్ అయ్యే పరిస్థితికి వచ్చేసారు. పాన్ ఇండియా రేంజ్ సినిమా చేస్తున్నప్పుడు అన్ని రకాల జాగ్రత్తలు ముందుగానే తీసుకోవాలి. ఒక తెలుగు సినిమా తెలుగులో కాకుండా మిగతా భాషల్లో ముందు రిలీజ్ అవడం అనేది కొంచెం ఆశ్చర్యకరమైన విషయం.

Also Read: SPIRIT : సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ సినిమాకి బ్రేక్, జపాన్ వెళ్తున్న ప్రభాస్

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×