E-Paper
Advertisement

Kissik Talks Show: పబ్లిక్‌లోకి వచ్చినప్పుడు పద్దతిగా ఉండాలి.. ఆ యాంకర్‌కు ఇంద్రజ కౌంటర్‌?

Kissik Talks Show: పబ్లిక్‌లోకి వచ్చినప్పుడు పద్దతిగా ఉండాలి.. ఆ యాంకర్‌కు ఇంద్రజ కౌంటర్‌?
Advertisement

Kissik Talks Show Actress Indraja: సీనియర్‌ నటి ఇంద్రజ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు తెలుగులో స్టార్‌ హీరోయిన్‌ గా ఓ వెలుగు వెలిగింది. యమ లీల చిత్రంతో తెలుగులో హీరోయిన్‌గా పరిచయమైన ఆమె ఆ తర్వాత జగపతి బాబు, నరేష్‌ వంటి హీరోల సరసన నటించి మెప్పించింది. అప్పట్లో సౌందర్య, రమ్యక్రష్ణ లాంటి స్టార్‌ హీరోయిన్లకు పోటీ ఇచ్చిన ఈమె పెళ్లి తర్వాత సినిమాలను పూర్తిగా పక్కన పెట్టింది. కొన్నేళ్ల పాటు ఇంట్లోనే భర్త, పిల్లల బాధ్యత చూసుకుంది. గృహిణిగా సెటిలైపోయిన ఇంద్రజ శతమానం భవతి చిత్రంతో రీఎంట్రీ ఇచ్చింది.

జబర్దస్త్‌, శ్రీదేవి డ్రామా కంపెనీ జడ్జ్‌ గా

ప్రస్తుతం వెండితెరపై తల్లి పాత్రలతో మెప్పిస్తున్న ఆమె మరోవైపు బుల్లితెరపై కూడా సందడి చేస్తోంది. జబర్దస్త్‌, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి కామెడీ షోలకు ఇంద్రజ జడ్జీగా వ్యవహరిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె బిగ్‌ టీవీ కిస్సిక్‌ టాక్స్‌ షోకి అతిథిగా వచ్చింది. యాంకర్‌ వర్ష హోస్ట్ చేస్తున్న ఈ షోలో ఇంద్రజ పాల్గొన్నారు. ఈ ఇంటర్య్వూలో ఆమె తన పర్సనల్‌, ప్రొఫెషనల్‌ విషయాలకు సంబంధించిన విషయాలను షేర్‌ చేసుకుంది. ఇందుకు సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. ఇందులో ఇంద్రజ బుల్లితెరపై హాట్‌ టాపిక్‌గా ఉన్న పలు అంశాలపై తన అభిప్రాయాలను వెల్లడించింది.

ఆ యాంకర్‌కు కౌంటర్‌

Advertisement

ముఖ్యంగా ఓ స్టార్‌ యాంకర్‌ వ్యవహర శైలిపై ఇంద్రజ ఘాటు వ్యాఖ్యలు చేశారు. బుల్లితెరపై ఎంతోమంది యాంకర్లు ఉన్నారు. అందులో కొందరు తమకు ఇష్టానుసారంగా ఉంటూ సోషల్ మీడియాలో హాట్‌ టాపిక్‌ నిలుస్తుంటారు. ముఖ్యంగా వారి వస్త్రాధారణతో నెట్టింట దారుణమైన ట్రోల్స్‌కి గురవుతున్నారు. ఎన్ని విమర్శలు, ట్రోల్స్‌ వచ్చినా.. తమ తీరును మాత్రం మార్చుకోవడం లేదు. పైగా ఇది మా వ్యక్తిగతం.. మాకు నచ్చినట్టు ఉండే హక్కు మాకుందంటూ వారి తీరు సమర్థించుకుంటున్నారు. అలాంటి వారిని ఉద్దేశిస్తూ తాజాగా ఇంద్రజకు ప్రశ్న ఎదురైంది. కొందరు తమకు నచ్చినట్టు దుస్తులు ధరిస్తారు. ఏమన్నా అంటే ఇది నా ఇష్టం.. నా స్టైల్‌, ఎవరమనుకుంటే నాకేంటి అంటుంటారు.

తప్పకుండ ప్రశ్నిస్తారు..

Advertisement

దానికిపై తన అభిప్రాయ అడగ్గా ఇంద్రజ ఇలా వ్యాఖ్యానించారు. “మీ పర్సనల్‌ స్పెస్‌ వరకు ఎలా ఉన్న పర్వలేదు. కానీ, అది పబ్లిక్‌ వచ్చేసరికి ఖచ్చితంగా కామెంట్స్‌ చేస్తారు” అని తన అభిప్రాయాన్ని వెల్లడించింది. అయితే ఇంద్రజ కామెంట్స్‌ చేస్తుంటే ప్రముఖ యాంకర్‌ గురించేనని నెటిజన్స్‌ అభిప్రాయపడుతున్నారు. అయితే ఇది ఎవరిని పర్టిక్యులర్‌ ఉద్దేశించినవి అనేది మాత్రం ఆమె స్పష్టం చేయలేదు. అలాగే షోలో సుడిగాలి సుధీర్‌ తన బాండ్‌పై కూడా స్పందించారు. ఏ షోలో అయిన సుధీర్‌ అమ్మ అమ్మ అంటూ ఇంద్రజని పలిచేవాడు. ఆ బాండ్‌ మిగతావారికి కూడా చాలా బాగా అనిపించేది. సుధీర్‌తో తన అనుబంధం దేవుడు ఇచ్చిందే అంటూ ఇంద్రజ ఎమోషనల్‌ అయ్యారు.

Also Read: Allu Arjun-Sri Tej: శ్రీతేజ్‌ని పట్టించుకోని అల్లు అర్జున్.. రంగంలోకి దిల్ రాజు!

Related News

Illu Illalu Pillalu Today Episodes: శ్రీవల్లి మాటతో నర్మద షాక్.. విశ్వంకు భద్ర వార్నింగ్.. కన్నీళ్లు పెట్టుకున్న వేదవతి..

Intinti Ramayanam Today Episode: పల్లవికి టెన్షన్.. ప్రణతి ఎంట్రీతో ఆల్ హ్యాపీ.. ఫైనల్ ట్విస్ట్ అదిరింది..

Ye Devi Varamo Neevu Hero : సీరియల్ హీరోకు ఎంతకష్టం వచ్చింది.. అసలేం జరిగింది..?

Friday Movies in Tv : శుక్రవారం టీవీల్లోకి సూపర్ హిట్ సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..

రాధాకృష్ణుడి గెటప్‌లో మెరిసిపోయిన ప్రియాంక జైన్, శివకుమార్.. పిక్స్ వైరల్!

బాడీ షేమింగ్స్..లవ్ బ్రేకప్ పై పవిత్ర ఓపెన్ !

కారు యాక్సిడెంట్..జీవితమే వద్దనుకున్నా..పవిత్ర ఎమోషనల్ కామెంట్స్!

ఆ ఒక్క కారణంతో షో నుంచి తప్పించారు..8 నెలలు నరకం చూసా: పాగల్ పవిత్ర

Big Stories

Advertisement
×