E-Paper
Advertisement

Akhanda 2 PreRelease : ‘అఖండ 2 ‘ ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఇదే.. బాలయ్య కోసం వచ్చేస్తున్న స్టార్ట్స్..

Akhanda 2 PreRelease : ‘అఖండ 2 ‘ ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఇదే.. బాలయ్య కోసం వచ్చేస్తున్న స్టార్ట్స్..
Advertisement

Akhanda 2 PreRelease : టాలీవుడ్ గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను డైరెక్షన్లో వస్తున్న లేటెస్ట్ మూవీ అఖండ 2. అఖండ లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ సినిమా సీక్వెల్‌గా తెరకెక్కిన ఈ సినిమాను థియేటర్లలో ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. గతంలో ఎన్నడూ కనిపించని విధంగా బాలయ్య ఈ మూవీలో డ్యూయల్ పాత్రలో కనిపిస్తున్నాడు. శివతత్వం ఉట్టిపడేలా.. హిందూ సనాతన ధర్మాన్ని స్క్రీన్ పై ఆవిష్కరించామని. మేకర్స్ ఇప్పటికే అఫీషియల్ గా వెల్లడిస్తూ వచ్చారు. ఇక సినిమా కోసం బాలయ్య తన లుక్ ను పూర్తిగా మార్చుకున్నాడు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ మూవీ డిసెంబర్ 5 న థియేటర్లలోకి రాబోతుంది. విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో ఈ సినిమా ప్రమోషన్స్ లో జోరుని పెంచారు చిత్ర యూనిట్. ఈ క్రమంలో ఈ మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించనున్నారు. ఈ ఈవెంట్ కు రాబోతున్న చీఫ్ గెస్ట్ లు ఎవరు? ఈవెంట్ వివరాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..

అఖండ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ లాక్..!

టాలీవుడ్ మాస్ హీరో బాలయ్య, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో రాబోతున్న నాలుగో సినిమా అఖండ 2.. గతంలో వీరి కాంబోలో వచ్చిన సినిమాలన్నీ కూడా బిగ్గెస్ట్ హెట్ గా నిలవడంతో ఈ సినిమాపై అంచనాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. ఇప్పుడు సినిమా ప్రమోషన్స్ కోసం రెండు భారీ ఈవెంట్లను టీం ప్లాన్ చేశారు.. ఒకటి హైదరాబాదులో ని కూకట్ పల్లిలోని కైత్లాపూర్ గ్రౌండ్స్ లో ఈనెల 28 న భారీ ఈవెంట్ ను నిర్వహించనున్నారని మేకర్స్ ఒక పోస్టర్ ను రిలీజ్ చేశారు.. ఆ పోస్టర్ లో బాలయ్య అఘోర పాత్రలో కనిపిస్తున్నారు. మరి ఈ ఈవెంట్ కు చీఫ్ గెస్టులు గా పలువురి స్టార్ హీరోల పేర్లు వినిపిస్తున్నాయి. మరి ఎవరు వస్తారో ఒకసారి చూసేద్దాం..

Advertisement

Also Read :బిగ్ బాస్ ఓటింగ్ తారుమారు.. కంటెస్టంట్స్ కు ఊహించని షాక్..

ప్రీరిలీజ్ ఈవెంట్స్ గెస్టులుగా స్టార్స్.. 

ఈ మధ్యకాలంలో రిలీజ్ అవుతున్న స్టార్ హీరోల సినిమాల ఈవెంట్లకు చీఫ్ గెస్ట్లుగా స్టార్ హీరోలు వస్తున్నారు.. ఇప్పటికే ఎంతోమంది హీరోలు ప్రీ రిలీజ్ఈవెంట్లలో సందడి చేశారు. అయితే ఈ సినిమా ఈవెంట్ కు కూడా ఇండస్ట్రీలోని స్టార్ హీరోలు వచ్చే అవకాశం ఉందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు టాలీవుడ్ లోని ప్రముఖ సినీ దర్శకులు అనిల్ రావిపూడి, గోపీచంద్ మలినేని గెస్ట్లుగా రాబోతున్నారంటూ సమాచారం. వీరిద్దరి కాంబోలో బాలయ్య సినిమాలు వచ్చాయి. వీళ్లతో పాటుగా కొందరు హీరోలు వచ్చే అవకాశం ఉందని ప్రచారంలో ఉంది. మరోవైపు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా రాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఈవెంట్ కి ఎవరు చీఫ్ గెస్ట్లుగా రాబోతున్నారు తెలియాలంటే మరో రెండు రోజులు వెయిట్ చేయాల్సిందే.. బాలయ్య ఈ మధ్య వరుస హిట్ సినిమాలను తన అకౌంట్ లో వేసుకుంటున్నాడు. దాంతో ఈ మూవీ భారీ విజయాన్ని అందుకోవడం పక్కా అని అభిమానులు అభిప్రాయ పడుతున్నారు.

Related News

వారికి అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం!

వారణాసి షూటింగ్ పై క్రేజీ అప్డేట్.. జక్కన్న ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా?

ఎమోషనల్ గా ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్.. కిరణ్ ఖాతాలో మరో హిట్?

ఫిగర్ బాలేదని టార్చర్.. 40 ఏళ్లొచ్చాకే ఆ నరకం నుండి బయటపడ్డానంటున్న తారక్ హీరోయిన్

యాంకర్ సుమ హీరోయిన్‌గా నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా ?

‘టాక్సిక్’ ట్రైలర్ డేట్ ఫిక్స్..ఇదైనా ఖాయమా యష్?

72వ జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన తెలుగు సినిమాలు.. ఉత్తమ చిత్రం ఏదంటే?

విక్రమ్ 1 సక్సెస్.. చిరు ఫిదా: ప్రైవేట్ రాకెట్ ప్రయోగంపై మెగాస్టార్ క్రేజీ రియాక్షన్!

Big Stories

Advertisement
×