E-Paper
Advertisement

Bigg Boss 9 Telugu : బిగ్ బాస్ ఓటింగ్ తారుమారు.. కంటెస్టంట్స్ కు ఊహించని షాక్..

Bigg Boss 9 Telugu : బిగ్ బాస్ ఓటింగ్ తారుమారు.. కంటెస్టంట్స్ కు ఊహించని షాక్..
Advertisement

Bigg Boss 9 Telugu : తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న టాప్ రియాలిటీ షో బిగ్ బాస్.. మారో వారంలో శుభం కార్డు వేసుకోబోతున్న సంగతి తెలిసిందే.. గత సీజన్ తో పోలిస్తే ఈ సీజన్ రణరంగం కాస్త ఎక్కువగానే ఉంది. ముందుగా నాగార్జున అన్నట్లుగానే హౌస్మెట్స్ అందరూ కూడా నువ్వా నేనా అని పోటీపడి మరి గేమ్ ని ఆడుతున్నారు.. ఇప్పటికే 11 వారాలు పూర్తి చేసుకున్న ఈ షో 12 వ వారంలోకి అడుగుపెట్టింది.. ఈవారం నామినేషన్స్ ఎంత రచ్చ రచ్చగా సాగాయో చూసే ఉన్నాం. ఇక ఈవారం తో చివరికి కెప్టెన్సీ టాస్క్ కోసం హౌస్మెట్స్ అందరూ కూడా పాత కంటెస్టెంట్లతో పోటీపడుతున్నారు. నిన్న హౌస్ లోకి బిగ్ బాస్ రన్నర్ గౌతమ్ రాగా.. ఇవాళ ఎపిసోడ్ లో ప్రేరణ హౌస్ మేట్స్ తో గేమ్ ఆడపడుతుంది. అయితే గత వారంతో పోలిస్తే ఈ వారం ఓటింగ్ తారుమారు అయిందని తెలుస్తుంది. ఈ వారం టాప్ 5 లో ఎవరున్నారు..? విన్నర్ ట్రోపికి దగ్గరగా ఎవరున్నారు అన్నది ఒకసారి తెలుసుకుందాం..

బిగ్ బాస్ ఓటింగ్ లో మార్పు..టాప్ 5 ఎవరంటే..?

బిగ్ బాస్ సీజన్ 9.. ఈ సీజన్ గతంలో వచ్చిన సీజన్లతో పోలిస్తే చాలా భిన్నంగా ఉంది.. ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సెలబ్రిటీలతో పాటుగా ఆరుగురు కంటెస్టెంట్స్ కామనర్స్ ను హౌస్ లోకి తీసుకొని వచ్చారు. కామనర్స్ లలో నలుగురు హౌస్ నుంచి బయటకు వచ్చేసారు.. మిగిలింది కేవలం పవన్, కళ్యాణ్.. మిగిలిన వాళ్లంతా కూడా సెలబ్రిటీలే. గత సీజన్ కన్నడ స్టార్ నిఖిల్ ట్రోఫీని సొంతం చేసుకున్నాడు. మరి ఈ సీజన్లో సెలబ్రిటీలు వర్సెస్ కామనర్స్ లో ఎవరు విన్నర్ అవుతారన్న ఆసక్తి జనాల్లో కనిపిస్తుంది. ప్రస్తుతం ఓటింగ్ పూర్తిగా మారిపోవడంతో కళ్యాణ్ విన్నర్ అవుతారని వార్తలు వినిపిస్తున్నాయి. కళ్యాణ్, తనూజ, ఇమ్మన్యుయేల్, భరణి, పవన్ లలో ట్రోఫీ ఎవరి సొంతం అవుతుందా అన్నది హాట్ టాపిక్ అయ్యింది. ఏది ఏమైనా మరో రెండు, మూడు రోజుల్లో విన్నర్ ఎవరు అన్నది తెలిసిపోనుంది.

Advertisement

Also Read : ప్రియుడితో ప్రియాంక జైన్ బ్రేకప్..సోలో అంటున్న శివ..ఇదేం ట్విస్ట్ సామి..

ఈ వీక్ ఎలిమినేట్ అయ్యేది ఎవరు..? 

గత వారం దివ్య ఎలిమినేట్ అవ్వాల్సింది.. కానీ ఇమ్మానుయేల్ పవర్ అస్త్ర వాడటంతో ఆమె సేవ్ అయింది. ఈవారం డబల్ ఎలిమినేషన్ ఉండే అవకాశాలు ఉన్నట్లు సోషల్ మీడియాలో ఇప్పటికే వార్తలు వినిపిస్తున్నాయి. సంజన, దివ్య ఇద్దరు డేంజర్ జోన్ లో ఉండడంతో ఈవారం వీళ్లిద్దరూ బ్యాగ్ సర్దుకోవాల్సిందేనంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి. మొన్న జరిగిన గొడవల్లో రీతుకు నెగిటివ్ పబ్లిసిటీ వస్తుంది. ఇప్పటికే ఆమె నెగిటివ్ ట్రోల్స్ ని అందుకుంటుంది. మరి ఈ వారం రీతు కూడా వెళ్లే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. మరి ఈ వారం డబల్ ఎలిమినేషన్ ఉంటుందా..? లేక ఎవరో ఒకరు హౌస్ ని వీడతారా? ఏం జరగబోతుందో తెలియాలంటే ఎపిసోడ్ లను మిస్ అవ్వకుండా చూడాల్సిందే..

Related News

బిగ్ బాస్10 హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న కంటెస్టెంట్ తనేనా?

బిగ్ బాస్ హౌస్ లోకి గుండెనిండా గుడి గంటలు హీరో.. ఈ ట్విస్ట్ ఏందీ బాలు..వీడియో వైరల్!

బిగ్ బాస్ 10 లాంచింగ్ ఎపిసోడ్… చీఫ్ గెస్ట్ గా స్టార్ హీరో!

న్యూ చాప్టర్ బిగిన్స్.. బిగ్ బాస్ 10 ఎంట్రీ పై జబర్దస్త్ కమెడియన్ క్లారిటీ!

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ లిస్ట్ లీక్..హౌస్ లోకి వెళ్లేది వీళ్ళే!

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

Big Stories

Advertisement
×